- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా మారిన ఓ మహిళలోని జన్యు వైవిధ్యం!
నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా మారిన ఓ మహిళలోని జన్యు వైవిధ్యం!

దిశ, ఫీచర్స్ : నొప్పి, బాధ అనేవి మనిషిలో కనిపించే సహజమైన లక్షణాలు. చిన్న గాయం తగిలినా, శస్త్ర చికిత్సలు జరిగినా దాని తాలూకు నొప్పి లేదా మంట బాధకు కారణం అవుతుంది. కానీ ఓ మహిళలో మాత్రం ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. పైగా అవి త్వరగా మానిపోతాయి. ఆమెలోని ఈ అరుదైన లక్షణమే ఇప్పుడు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తుండగా.. ఈ అరుదైన జన్యు వైవిధ్యం సైన్స్‌కు మరో కొత్త సవాల్‌గా మారిందంటున్నారు నిపుణులు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ అనస్థీషియాలో పబ్లిషైన ఈ పరిణామం ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం చర్చకు దారితీసింది.
ఆమె పేరు కామెరాన్. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ అనస్థీషియాలో పబ్లిషైన అధ్యయన వివరాల ప్రకారం ఆమెకు నొప్పి అనేది తెలియదు. అంటే గాయమైనా, దెబ్బలు తగిలినా, రక్తం కారినా సాధారణంగా ఎవరికైనా నొప్పి, మంట, బాధ, భయం వంటివి కలుగుతాయి. కామెరాన్‌కు మాత్రం అలా జరగదు. పైగా గాయాలు త్వరగా మానిపోతాయి. ఈమెలోని ఈ లక్షణం 2019లో బయటపడగా, ఈ అరుదైన జన్యు వైవిధ్యం శాస్త్రవేత్తలకు సైతం సవాలుగా మారింది. దీని ఆధారంగా జన్యుశాస్త్రంలో మరిన్ని రహస్యాల ఛేదనపై పరిశోధకులు ఫోకస్ చేశారు.
65 ఏండ్ల వయసులో కామెరాన్ తుంటి సమస్య కారణంగా వైద్య సహాయం తీసుకున్నప్పుడు, తీవ్రమైన జాయింట్ డీజనరేషన్ ఉన్నప్పటికీ, ఆమెకు ఏమాత్రం నొప్పి కలగలేదు. తర్వాత ఆపరేషన్ చేసినప్పుడు కూడా నొప్పి, మంట లేకపోవడంతో ఆశ్చర్యపోయిన వైద్యులు ఆమెను యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ అండ్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని పెయిన్ జెనెటిక్స్ శాస్త్రవేత్తల(For pain geneticists)లకు రిఫర్ చేశారు. ఈ సందర్భంగా వారు సదరు మహిళకు సంబంధించి జన్యు విశ్లేషణ చేయగా, FAAH (Fatty Acid Amide Hydrolase) అండ్ FAAH-OUT(Fatty-Acid Amide Hydrolase pseudogene and regulatory long non-coding RNA) జన్యువులలో రెండు వైవిధ్యాలు ఉన్నట్లు గుర్తించారు.
కామెరాన్ శరీరంలోని జన్యు వైవిధ్యం అనందమైడ్ అనే కెమికల్ స్థాయిలను(chemical called anandamide) పెంచడం కారణంగా అది నొప్పి, మంట, గాయాలను తగ్గించడంలో(Pain sensation), మానసిక స్థితిని మెరుగు పర్చడంలో వేగంగా సహాయపడుతుంది. కామెరాన్‌లో నొప్పి, బాధ, భయంలేని అరుదైన జన్యు వైవిధ్యానికి కారణం అయ్యాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ సరికొత్త నొప్పి నివారణ ఔషధాలకు మరో కొత్త మార్గాన్ని క్రియేట్ చేసిందని చెబుతున్నారు.






