బాల్కనీ.. మహిళల మానసిక వికాస స్థలినీ..!

by Javid Pasha |

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా మహిళలు ఏదో ఒక సందర్భంలో తమకంటూ కొన్ని క్షణాలు కేటాయించుకునేది బాల్కనీలోనే.

బాల్కనీ.. మహిళల మానసిక వికాస స్థలినీ..!
X

దిశ, ఫీచర్స్ : చాలా మంది మహిళలకు ఆ ప్రదేశమంటే ఎంతో ఇష్టం. గృహిణులకు మరింత ఇష్టం. అదే వారి నేచర్. వారు తమకంటూ స్పెషల్‌గా టైమ్ స్పెండ్ చేసుకునేది. రిలాక్స్ అయ్యేది, బయటి ప్రపంచంతో, ప్రకృతితో కనెక్ట్ అయ్యేది ఇక్కడే. ఇంతకీ అదేమిటి అనుకుంటున్నారా..? మరేదో కాదు.. ఇంటి ముందు బాల్కనీ(balcony). ముఖ్యంగా భారతీయ గృహిణుల జీవితంలో ఇది విడదీయలేని అనుబంధాన్ని పెనవేసుకున్నది. తరచూ బిజీగా ఉండే హోం మేకర్స్ బయటి ప్రపంచాన్ని చూడగలిగే కిటికీవంటిదనీ, మరో విధంగా మహిళల మానసిక వికాస స్థలమనీ కూడా చెబుతుంటారు పెద్దలు, నిపుణులు. ఎందుకంటే.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా మహిళలు ఏదో ఒక సందర్భంలో తమకంటూ కొన్ని క్షణాలు కేటాయించుకునేది బాల్కనీ(Women's Favorite Spot)లోనే. ఇంట్లో బోరు కొట్టినప్పుడు పొరుగువారితో ముచ్చట పెట్టేందుకు, సోషల్ లైఫ్ కనెక్ట్ అయ్యేందుకు ఇది దోహదపడుతోంది. తీరిక వేళల్లో వెదురు ఊయల మీద కూర్చుని మ్యూజిక్ వినడం నుంచి, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఒక కప్పు కాఫీ తాగడం వరకూ లేదా పొరుగువారితో మాట్లాడటం వరకు బాల్కనీయే వారి ప్రత్యేక స్థలం. వారు రిలాక్స్‌గా భావించే అనువైన ప్రదేశం.

అందరికంటే ముందుగా నిద్ర లేవడం, వంట చేయడం, పిల్లల్ని బడికి పంపడం, భర్తను పనికి పంపడం, ఇంటి పనులు ముగించడం, పిల్లల్ని స్కూల్‌కి చేర్చడం, హోం వర్క్‌లో సహాయం చేయడం, రాత్రి భోజనం రెడీ చేయడం ఇలా రకరకాల బాధ్యతలతో హోం మేకర్స్ జీవితం ముడిపడి ఉంటుంది. మన దేశంలో ప్రబలంగా ఉన్న జెండర్ రోల్స్ మూస పద్ధతులు ఇంటి పనులు, సంతాన సాఫల్యాన్ని మహిళలకు మాత్రమే అంటగడుతున్నాయి. శ్రామిక మహిళలు పనికి వెళ్లేటప్పుడు కనీసం బయట అడుగు పెట్టగలుగుతున్నారు కానీ, ఇప్పటికీ కొంతమంది గృహిణులకు బయటకు వెళ్లే అవకాశం నిరాకరించబడుతోంది. 2019 లో “టైమ్ యూజ్” పేరుతో చేసిన ఒక సర్వే ప్రకారం.. 50% మంది భారతీయ పట్టణ మహిళలు ఎప్పుడూ తీరికలేని ఇంటి పనుల కారణంగా రోజుకు ఒక్కసారికూడా ఇంటి నుంచి బయటకు వెళ్లడం లేదట. ఇది వారి మానసిక, శారీరక ఆరోగ్యానికి హాని కలిగించడంతోపాటు సోషల్ లైఫ్‌ను కిల్ చేస్తోంది. అలాంటి స్విచువేషన్‌లో ఎంతోమంది మానసిక ఆరోగ్యానికి, ఆనందానికి అనువైన ప్రదేశంగా విలసిల్లుతోంది బాల్కనీ.

Next Story