- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొదటి డెలివరీ సిజేరియన్.. రెండోది నార్మల్ అయ్యే ఛాన్స్ ఉందా?
మొదటి ప్రసవంలో సిజేరియన్ అయితే రెండో ప్రసవం నార్మల్ అయ్యే అవకాశం ఉందా అంటే.. ఉందనే అంటున్నారు వైద్యులు.

దిశ, వెబ్ డెస్క్ : మొదటి ప్రసవంలో సిజేరియన్ అయితే రెండో ప్రసవం నార్మల్ అయ్యే అవకాశం ఉందా అంటే.. ఉందనే అంటున్నారు వైద్యులు. కానీ దానికి అవకాశాలు మాత్రమే ఉన్నాయట. సాధారణంగా మొదటి ఆపరేషన్‌లో అడ్డంగా చేసే ‘"లో ట్రాన్స్‌వర్స్’’ కట్ ఉన్నప్పుడు, రెండు గర్భాల మధ్య 18 నెలలకు పైగా గ్యాప్ ఉంటే, బిడ్డ పొజిషన్ సరిగా ఉన్నపుడు అనగా తల కింది వైపుగా ఉంటే రెండవ డెలివరీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉందట. అలాగే గర్భిణికి BP, షుగర్ వంటి సమస్యలు లేకపోతే VBAC అనే నార్మల్ డెలివరీ అవకాశం 60–80% వరకు ఉంటుందని చెబుతన్నారు.
అయితే పాత సిజేరియన్ నిలువు కట్ అయితే, రెండు కంటే ఎక్కువ డెలివరీలు సిజేరియన్ అయి ఉంటే, ప్లాసెంటా ప్రీవియా, బ్రీచ్ పొజిషన్ అడ్డంగా ఉండటం వంటి సమస్యలు ఉంటే మరోసారి సిజేరియన్ అవసరం అవుతుందని అంటున్నారు. కాబట్టి రెండోసారి నార్మల్ డెలివరీ కావాలంటే గైనిక్ డాక్టర్ పర్యవేక్షణలో, అన్ని వైద్య సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలో మాత్రమే ప్రయత్నించాలని సూచిస్తున్నారు.






