- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలోని పురుషులపై విడాకుల ఆర్థిక భారం.. తాజా సర్వేలో సంచలన నిజాలు
దేశంలోని పురుషులపై విడాకుల ఆర్థిక భారం పెను సమస్యగా మారుతుందని అనేక సర్వేలు, విశ్లేషకులు సూచిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో భారత్ దేశంలో విడాకులు (Divorce) సంఖ్య పెరుగుతుంది. ఈ విడాకుల వివాదాలను ప్రముఖులు, సెలబ్రేటీలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మొదలుకొని సామాన్య ప్రజల వరకు ఎదుర్కొంటూనే ఉన్నారు. మారుతున్న పరిస్థితులు, అలవాట్ల కారణంగా ఈ పచ్చని కాపురాలను విడాకుల కోసం కోర్టు మేట్లను ఎక్కిస్తున్నాయి. ఈ క్రమంలో కోర్టులు కూడా తప్పని పరిస్థితుల్లో వారికి విడాకులు మంజూరు చేస్తున్నాయి. అయితే ఈ కేసులు సంవత్సరాల తరబడి సాగుతుండటం, న్యాయవాదుల ఫీజులు పెరగడం, కోర్టు ఖర్చులు అధికమవడం వంటివి పురుషులపై ఆర్థిక ఒత్తిడిని పెంచుతున్నాయి.
ముఖ్యంగా విడాకులు వచ్చిన తర్వాత అలిమోనీ (Alimony) చెల్లింపులు భారీగా ఉంటున్నాయి. దీంతో వాటిని చెల్లించడం కోసం దాదాపు 42 శాతం మంది పురుషులు బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్లు తీసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అలిమోనీ చెల్లింపులు నెలకు లక్షల రూపాయల వరకు ఉండడంతో, మధ్య తరగతి, పై మధ్య తరగతి వర్గాల వారు కూడా రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు.
తగిన ప్రణాళిక లేకుండా ఇలాంటి రుణాలను తీసుకోవడం భవిష్యత్తులో తీవ్రమైన అప్పుల సమస్యలకు దారి తీస్తుందని సూచిస్తున్నారు. విడాకుల సమయంలో భావోద్వేగ ఒత్తిడికి తోడు ఆర్థిక సమస్యలు కూడా అధికమవడం వల్ల పురుషులు మానసికంగా కుంగిపోతున్నారని అనేక సర్వేలు చెబుతున్నాయి. భారతదేశంలో విడాకుల కేసుల సంఖ్య ప్రతి సంవత్సరం గణనీయంగా పెరుగుతుంది. ఈ పరిస్థితి కొనసాగితే రాబోయే కాలంలో విడాకులు కేవలం వ్యక్తిగత సమస్య కాకుండా, ఆర్థిక సమస్యలకు కేంద్రబిందువుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.






