Blue eyes : అందమా.. అనర్థమా? నీలికళ్లు దేనికి సంకేతం?

by Javid Pasha |   (  Updated:2025-04-15 08:04:25  IST  )

Blue eyes : అందమా.. అనర్థమా? నీలికళ్లు దేనికి సంకేతం?

Blue eyes : అందమా.. అనర్థమా? నీలికళ్లు దేనికి సంకేతం?
X

దిశ, ఫీచర్స్ : మనిషికి అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కళ్లు ఒకటి. వీటిని అందానికి ప్రతీకగానూ పోలుస్తుంటారు. ‘తేనె కళ్ల చిన్నది.. నీలి కళ్ల కుర్రది. కాటుక కనులది’ అంటూ కవిత్వాలు సైతం అల్లుతుంటారు కవులు. అంతెందుకు కుంభమేళ సందర్భంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మోనాలిసా సైతం.. తన తేనెకళ్ల కారణంగా ఫేమస్ అయింది. బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్ అంతలా ఫేమస్ కావడానికి ఆమె పిల్లికళ్లే ప్రధాన కారణం. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే.. ఇండోనేషియాలోని బుటన్ ద్వీపం(Button Island)లో నివసించే అత్యధి మంది ట్రైబల్స్ ప్రస్తుతం నీలి రంగు కళ్లను(Electric Blue Eyes) కలిగి ఉంటున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వైరల్ సమాచారం ప్రకారం.. బుటన్ ద్వీపం(Button Island)లో నివసించే అత్యధి మంది ట్రైబల్స్ విద్యుత్ తరంగాలను పోలే నీలి రంగు కళ్లను(Electric blue eyes) కలిగి ఉంటున్నారు. ప్రముఖ ఫొటో గ్రాఫర్, జియాలజిస్ట్ కొర్చ్‌నోయ్ పసరిబు(Korchnoi Pasaribu) ద్వారా మొదట ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. అతను తన ఫొటోగ్రఫీ వృత్తిలో భాగంగా బుటన్ తెగ గిరిజనుల ఫొటోలను సైతం ప్రదర్శించడంతో వారి నీలికళ్లు అందరినీ ఆకట్టుకున్నాయి.

బుటన్ ద్వీపంలోని ప్రజలందరూ ఎందుకలా ఎలక్ట్రిక్ నీలి రంగు కళ్లను కలిగి ఉంటున్నారనే విషయం నెటిజన్లలో క్యూరియాసిటీని పెంచుతోంది. ఎందుకంటే ఇవి సాధారణ నీలి రంగు కళ్లకు భిన్నం. అయితే నిపుణులు ప్రకారం.. అందం సంగతి పక్కన పెడితే ఎలక్ట్రిక్ నీలి ళ్లు జన్యుపరమైన రుగ్మతల వల్ల సంభవిస్తాయని గత పరిశోధనలు పేర్కొంటున్నాయి. దీనినే వార్డెన్ బర్గ్ సిండ్రోమ్ (Waardenburg Syndrome)గా పేర్కొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ 42,000 మందిలో ఒకరు ఈ విధమైన ఎలక్ట్రిక్ నీలి రంగు కళ్లను కలిగి ఉంటున్నారు. కాగా జన్యుపరమైన రుగ్మతలు కావడంవల్ల ఈ విధమైన కళ్ల(Electric Blue Eyes)ను కలిగి వ్యక్తుల్లో కొందరు వినికిడి లోపం, పిగ్మెంటేషన్ సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

Next Story