Interesting study : తల్లిదండ్రులు అలాంటి వారైతే గనుక.. పిల్లల ఆయుష్షు తగ్గొచ్చు !!

by Javid Pasha |

Interesting study : తల్లిదండ్రులు అలాంటి వారైతే గనుక.. పిల్లల ఆయుష్షు తగ్గొచ్చు !!

Interesting study : తల్లిదండ్రులు అలాంటి వారైతే గనుక.. పిల్లల ఆయుష్షు తగ్గొచ్చు !!
X

దిశ, ఫీచర్స్ : అన్నీ అమ్మ పోలికలే.. అచ్చం నాన్నలా ఉన్నాడు.. చిన్న పిల్లల గురించి తరచుగా ఎవరో ఒకరు ప్రస్తావించే విషయాలివి. పోలికలే కాదు, చిన్నారుల్లో ప్రవర్తన, అనుకరణ కూడా సహజంగానే పేరెంట్స్‌ లెక్కనే ఉంటుంది కొన్నిసార్లు. ఇదంతా కామన్. కానీ ఓ కొత్త అధ్యయనం మాత్రం పిల్లల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఏంటంటే.. పిలలను వారి పేరెంట్స్ పెంచే విధానాన్ని బట్టి వాళ్ల జీవితం ప్రభావితం అవుతుందని, ముఖ్యంగా వారి ఆయుష్షు లేదా జీవితకాలం ఎంత ఉంటుందనేది డిసైడ్ అవుతుందని పేర్కొన్నది.

పేరెంట్స్ తమ పిల్లలను మరీ ఎక్కువగా గారాబం చేస్తూ.. అతిగా నియంత్రించడం, అలాగే వారిని అంతగా పట్టించుకోకపోవడం వారి జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనం పేర్కొన్నది. తల్లిదండ్రులు పిల్లలను పెంచే విధానం కూడా వారి లైఫ్ క్వాలిటీని నిర్ణయించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. పిల్లలు, పేరెంట్స్ మధ్య సంబంధాలు, ముఖ్యంగా బాల్యంలో పేరెంట్స్ వారిని పెంచే విధానం.. పెద్దయ్యాక వారి జీవింతపై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందో తెలుసుకునేందుకు ‘ఇంగ్లీష్ లాంగిట్యూడినల్ స్టడీ ఆఫ్ ఏజింగ్(ELSA)’ ఇంగ్లండ్‌ కేంద్రంగా అధ్యయనం నిర్వహించింది.

*అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 50 ఏండ్లు పైబడిన11,391 మందిని వారి వారి బాల్యం, తల్లిదండ్రులు పెంచిన విధానాన్ని, అది వారిలో త్వరగా వృద్ధాప్యం రావడానికి, జీవన ప్రమాణం తగ్గడానికి ఎలాంటి ప్రభావం చూపిందో కూడా విశ్లేషించారు. 2002లో ప్రారంభమైన ఈ పరిశోధన ఇటీవలె ముగిసింది. కాగా పరిశోధన ప్రకారం.. ప్రతీ రెండేళ్లకోసారి రీసెర్చర్స్ తాము పరిశీలించిన వ్యక్తుల ఆరోగ్యం, సామాజిక, ఆర్థిక, మానసిక పరిస్థితలను సైతం పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ వచ్చారు. అయితే బాల్యంలో పేరెంట్స్ పిల్లలను పెంచిన విధానం ఆయా వ్యక్తుల వృద్ధాప్యం, ఆయుష్షు వంటి విషయాలపై ప్రభావం చూపినట్లు కనుగొన్నారు.

*తల్లిదండ్రుల నుంచి అవసరమైనంత ప్రేమ, శ్రద్ధ, స్వేచ్ఛ (lacks love, attention, and independence) వంటివి లభించకుండా పెరిగిన పిల్లల్లో జీవన ప్రమాణం తగ్గినట్లు గుర్తించారు. ముఖ్యంగా వీరు పెద్దయ్యాక వృద్ధాప్య ఛాయలు త్వరగా రావడం, మిగతా వారితో పోలిస్తే ఆయుష్షు తక్కువగా ఉండటం వంటివి సంభవించాయని పరిశోధకులు పేర్కొన్నారు. అలాగే తల్లిదండ్రుల అతి రక్షణ లేదా అతి నియంత్రణ(overprotective or controlling), ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం వంటివి కూడా పిల్లలు పెద్దయ్యాక పలు మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇది వారిలో ఎర్లీ డెత్ రిస్క్‌ను పెంచుతుందని చెబుతున్నారు.

*ముఖ్యంగా చిన్నప్పుడు ఓవర్ ప్రొటెక్షన్ కల్పించే తండ్రిని కలిగి ఉండే మగపిల్లలు, అలాంటి అతి సంరక్షణ కల్పించకుండా సాధరణంగా ఉండే తండ్రిని కలిగి ఉండే పిల్లలతో పోలిస్తే ఓవర్ ప్రొటెక్టివ్ ఫాదర్ కలిగి ఉన్న పిల్లలు పెద్దయ్యాక తమ 80 ఏండ్ల వయస్సులోపే మరణించే రిస్క్ 12 % అధికంగా ఉన్నట్లు పరిశోధకులు తేల్చారు. అలాగే బాల్యంలో అతి కఠినమైన తండ్రిని కలిగి ఉన్న మహిళలు కూడా, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కల్పించే తండ్రి కలిగి ఉన్న మహిళలతో పోలిస్తే 22% అధికంగా ఎర్లీ డెత్ రిస్క్ కలిగి ఉంటారని రీసెర్చర్స్ పేర్కొంటున్నారు. అందుకే చిన్నప్పుడు పిల్లకు తగిన సమయం కేటాయించాలని, వారికి ఎమోషనల్ సపోర్ట్ అందించాలని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఓవర్ ప్రొటెక్షన్, అతినియంత్రణ తగదని సూచిస్తున్నారు.

Next Story