- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Technology : 1840 నుంచి మోగుతూనే ఉన్న ‘ఆక్స్‌ఫర్డ్ ఎలక్ట్రిక్ బెల్’.. రహస్యం ఏంటంటే..
Technology : 1840 నుంచి మోగుతూనే ఉన్న ‘ఆక్స్‌ఫర్డ్ ఎలక్ట్రిక్ బెల్’.. రహస్యం ఏంటంటే..

దిశ, ఫీచర్స్ : మోడ్రన్ టెక్నాలజీ ఇటీవల అద్భుతాలు చేస్తున్న మాట నిజమే. కానీ దశాబ్దాల కిందట కూడా అందరినీ ఆశ్చర్యపరిచే అరుదైన సాంకేతిక పరిజ్ఞానం ఉందంటున్నారు నిపుణులు. ఇప్పటంత కాకపోయినా.. కొన్ని విషయాల్లో మాత్రం నాటి సాంకేతికత ప్రత్యేకతను సంతరించుకొని ప్రపంచాన్నే ఆశ్చర్య పరిచింది. అలాంటి వాటిలో ఆక్స్‌ఫర్డ్‌లోని క్లారెండన్ ప్రయోగశాలలో(Clarendon Laboratory) గల ఎలక్ట్రిక్ బెల్ కూడా ఒకటి. ఇంతకీ దాని విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఒక ఎలక్ట్రిక్ బ్యాటరీ గానీ, మరే వస్తువైనా గానీ ఎన్ని రోజులు పనిచేస్తుంది? మహా అయితే ఆర్నెల్లు, అంతకు మించితే ఏడాది చేయవచ్చు. కానీ ఆక్స్‌ఫర్డ్(Oxford)లోని క్లారెండన్ లాబొరేటరీ( Laboratory)లో విద్యుత్ ఆధారంగా పనిచేసే బ్యాటరీ కలిగి ఉన్న ఒక గంట(Electric bell)మాత్రం 1840 నుంచి ఒక్కసారి కూడా పాడవకుండా పనిచేస్తూనే ఉంది. అయితే ఈ మధ్య టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి కదా.. దానికి ఏ అధునాతన సాంకేతికతనో జోడించారనుకుంటే పొరపాటే. అలాంటిదేం చేయలేదంటున్నారు నిపుణులు. ఇదే ఇప్పుడందరినీ ఆశ్చర్య పరుస్తోంది.
185 ఏండ్ల కిందట తయారు చేసిన ఆక్స్‌ఫర్డ్ ఎలక్ట్రిక్ బెల్ ఇప్పటి వరకు సుమారు 10 బిలియన్ సార్లు మోగిందని, భూమిపై అత్యంత మన్నికైన బ్యాటరీగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. కాగా అప్పట్లోనే ఇంత మన్నికగల సాంకేతికత ఎలా సాధ్యమైంది? అనే సందేహం అందరినీ వెంటాడుతోంది. ఇది తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఆక్స్‌ఫర్డ్(Oxford) ఎలక్ట్రిక్ బెల్ (Electrical Bell) విషయంలో పరిశోధనలు జరపాలనుకుంటున్నారు. అయితే అది ఎప్పుడైతే పనిచేయడం ఆగిపోతుందో అప్పుడు మాత్రమే పరిశోధన ప్రారంభించాలని ఎదురు చూస్తున్నారు.






