- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబుల్ డేటింగ్ ట్రెండ్.. మహిళలే 3 రెట్లు ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు!
ఇండియాలోనూ ‘డబుల్ డేట్’ డేటింగ్ ట్రెండ్ ముందుకొచ్చింది. ముఖ్యంగా స్త్రీలు దీనిపై ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని ప్రముఖ డేటింగ్ యాప్ టిండర్(Tinder) ‘ఇయర్ స్వైప్ 2025’ రిపోర్ట్ పేర్కొన్నది.

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు యువతీ యువకులు పేరెంట్స్ చూసిన సంబంధాలకు ఓకే చెప్పేవారు. ప్రేమ పెళ్లిళ్లు, డేటింగ్‌లకు అంత ప్రయారిటీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో పేరెంట్స్‌తో పాటు తమ సొంత అభిప్రాయాలతోపాటు, నమ్మకమైన స్నేహితుల అభిప్రాయాలు సైతం తీసుకుంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా తమ సొంత అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో నచ్చిన సంబంధాన్ని ఎంపిక చేసుకునే ప్రక్రియలో భాగంగా డేటింగ్ కల్చర్ కూడా పుట్టుకొచ్చింది. అంటే ఒక వ్యక్తిని జీవిత భాగస్వామిగా స్వీకరించాలంటే అతను/ఆమె తనకు సరైన వ్యక్తియేనా కాదా అని తెలుసుకోవడానికి ప్రత్యక్షంగా కలిసి మాట్లాడుకోవడం, అభిప్రాయాలు, ఆసక్తులు పంచుకోవడం, అవసరమైతే కొన్ని రోజులు కలిసి ఉండటం వంటివి చేస్తారు. ఈ సమయంలో పరస్పరం నచ్చితే సంబంధాన్ని ఫైనల్ చేసుకోవడం, నచ్చకపోతే ఎండ్ కార్డ్ వేయడం డేటింగ్ ముఖ్య ఉద్దేశం. ఒకప్పుడు విదేశాల్లోనే ఉండే ఈ కల్చర్ ప్రస్తుతం ఇండియాలోనూ మస్తు పాపులరైంది. అయితే ఇటీవల ‘డబుల్ డేట్’ డేటింగ్ ట్రెండ్ కూడా ముందుకొచ్చింది. ముఖ్యంగా స్త్రీలు దీనిపై ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని ప్రముఖ డేటింగ్ యాప్ అయిన టిండర్(Tinder) ‘ఇయర్ స్వైప్ 2025’ రిపోర్ట్ పేర్కొన్నది.
ఆన్‌లైన్‌లోనో, స్నేహితుల ద్వారానో, పేరెంట్స్ ద్వారానో ఒక సంబంధం నచ్చుతుంది. అయితే అవతలి వ్యక్తి తనకు సెట్ అవుతారా? జీవిత భాగస్వామిగా స్వీకరించాలా లేదా? అని తెలుసుకోవడానికి ఎక్కడో ఒకచోట కలిసి మాట్లాడుకోవాలి. అది అమ్మాయి లేదా అబ్బాయి ఇల్లు కావచ్చు. బయట హోటల్, రిసార్ట్ లేదా ఏదైనా నచ్చిన ప్రదేశం కావచ్చు. ఇద్దరు రిలేషన్‌లో లేదా డేటింగ్‌లో ఉన్న జంటలు కలిసి డిన్నర్, సినిమా, ట్రిప్, కేఫెలో కలుసుకోవడం కూడా కావచ్చు. అయితే అలా వెళ్లాలంటే.. అవతలి వ్యక్తి ఎలాంటి వారో? పైకి చూడ్డానికి అందరూ బాగానే ఉంటారు. కానీ అక్కడికి వెళ్లాక ఏమేం మాట్లాడతారో, ఏం అడుగుతారో, ఒకవేళ ఏదైనా మోసం జరిగితే? తగాదా వచ్చి గొడవ జరిగితే? ఎవరుంటారక్కడ? అందుకే ఒక్కరే వెళ్లొద్దు, ఒక వ్యక్తిని తోడుగా తీసుకెళ్లాలి. ఈ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే డబుల్ డేటింగ్ ట్రెండ్. ‘ఇయర్ ఇన్ స్వైప్ 2025’ రిపోర్ట్ ప్రకారం.. దీనిని పురుషులకంటే మహిళలే మూడు రెట్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. డేట్‌కు వెళ్లేటప్పుడు ఎమోషనల్ సపోర్ట్ కోసం, తమ భద్రత కోసం తమ క్లోజ్ ఫ్రెండ్ లేదా బ్రదర్/సిస్టర్/కొలీగ్ ఇలా తమకు అత్యంత సన్నిహితమైన, నమ్మకమైన వ్యక్తిని తోడుగా తీసుకెళ్తున్నారు.
డేటింగ్ యాప్‌లలో ‘డబుల్ డేట్’ ఫీచర్‌ను ఉపయోగించేవారిలో ఎక్కువమంది మహిళలు కాగా 85% మంది 30 ఏండ్ల లోపువారేనని సర్వేలు పేర్కొంటున్నాయి. సింగిల్ మెసేజింగ్‌తో పోలిస్తే, డబుల్ డేట్‌ల సమయంలో చాట్‌లు 25% పెరుగుతున్నాయని, ఈ ట్రెండ్ జెన్‌జీలు, అలాగే మిలీనియల్స్‌లో బాగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మోడరన్(Modern) డేటింగ్‌లో స్వైపింగ్, అలాగే అంతకు ముందు తెలియని వ్యక్తులతో ఒక్కొక్కరిగా కలవడం ఒత్తిడి కలిగిస్తుంది. అందుకే స్నేహితులు ఇప్పుడు ‘ఎమోషనల్ కో-పైలట్స్’ లా పనిచేస్తున్నారు. అంటే డేటింగ్‌లో సపోర్ట్ సిస్టమ్‌గా మారుతున్నారు. అందుకే డబుల్ డేట్‌కు ప్రయారిటీ పెరుగుతోంది.






