మసాజ్ రోబోట్స్.. మస్త్ ఫీల్ .. మర మనుషులే కావాలంటున్న అక్కడి జనం..!

by Javid Pasha |

మసాజ్ రోబోట్స్.. మస్త్ ఫీల్ .. మర మనుషులే కావాలంటున్న అక్కడి జనం..!

మసాజ్ రోబోట్స్.. మస్త్ ఫీల్ .. మర మనుషులే కావాలంటున్న అక్కడి జనం..!
X

దిశ, ఫీచర్స్ : ఏ పనైనా మనుషులే బాగా చేస్తారనుకుంటే తప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే ఆధునిక సాంకేతికత ఆ పరిస్థితిని మార్చేసింది. మానవులు చేయలేని అనేక పనులను, హ్యూమనాయిడ్ రోబోట్స్ అంతకంటే సమర్థంగా చేస్తున్నాయి. మనుషులైనా అలసిపోతుంటారు కానీ, ఈ మర మనుషులకు ఆ రిస్క్ ఉండదు. ఎంతసేపైనా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందకు చక్కటి ఉదాహరణ చైనాలోని మసాజ్ పార్లర్లే అంటున్నారు నిపుణులు. ఇక్కడ మానవ మసాజ్ థెరపిస్టులకంటే.. రోబోలకే డిమాండ్ పెరుగుతోంది. అవి మసాజ్ చేస్తే మస్త్ ఫీల్ వస్తుందంటున్న కస్టమర్లు వాటితో చేయించుకోవడానికే మొగ్గు చూపుతున్నారు.

చైనీస్ మసాజ్ పార్లర్లలో ఒకప్పుడు యువతీ యువకులు అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు పొందేవారు. ఇప్పుడా పరిస్థితి మారుతోంది. మసాజ్ చేయడంలో హ్యూమన్ టచ్ (human touch) స్థానంలో రోబోటిక్ ఆర్మ్స్ (Robotic Arms) వినియోగంలోకి వస్తున్నాయి. పైగా ఇవి ఎంతసేపైనా అలసిపోకుండా మనుషులకంటే బాగా మసాజ్ చేస్తుండటంతో కస్టమర్లు కూడా మానవ థెరపిస్టులకంటే, రోబోటిక్ మసాజ్ థెరపిస్టులనే కోరుకుంటున్నారు. అయితే దీనివల్ల కొందరు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోతున్నారు. అయితే ఎల్లప్పుడూ అవే(Massage Robots) శాశ్వతం కాదనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఎందుకంటే రోబోటిక్ మసాజ్‌లు సమర్థవంతమైనవి, స్థిరమైనవి అయినప్పటికీ, సేవల సందర్భంలో మానవుల మాదిరి సానుభూతిని, పర్సనలైజ్ కేర్‌ను అందించలేవని నిపుణులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఈ రోబోటిక్ ఆటోమేషన్ ఇప్పుడు వెల్‌నెస్ అండ్ సర్వీస్ ఇండస్ట్రీలోకి వేగంగా ప్రవేశిస్తోంది.

Next Story