- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోటింగ్‌లో సరికొత్త ట్రెండ్.. ఫైబర్ గ్లాస్ బోట్లకు ఎందుకంత ఆదరణ?
గ్లోబల్ రిక్రియేటషనల్ ఫైబర్ గ్లాస్ బోట్ మార్కెట్ 2025లో సుమారు 11 బిలియన్ డార్లుగా ఉంది. 2026-2033 మధ్య ఇది 9%కి పైగా CAGRతో పెరగనుందని కూడా నివేదికలు పేర్కొంటున్నాయి.

దిశ, ఫీచర్స్ : మీరేదైనా సముద్ర ప్రాంతమున్న టూరిస్ట్ ప్లేస్‌కు గానీ, బీచ్‌కు గానీ వెళ్లినప్పుడు బోటింగ్ చేశారా? ఎంత బాగుంటుంది కదూ! పర్యాటక రంగం, ముఖ్యంగా సముద్ర మార్గం ద్వారా రావాణా పెరుగుతున్న ఈ బోటింగ్ రంగంలో ఆధునిక సాంకేతికత కూడా విస్తరిస్తోంది. అలాంటి వాటిలో ఫైబర్ గ్లాస్ బోట్లు (Fiberglass boats) కూడా ఒకటి. ఒకప్పుడు చెక్క, స్టీల్ వంటి మెటీరియల్‌తో వీటిని తయారు చేసేవారు. కానీ ప్రస్తుతం ఫైబర్‌తో తయారు చేస్తున్నారు. వీటికి రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతోందని సాంకేతిక నిపుణులు అంటున్నారు.
సాంప్రదాయ బోట్లకు ప్రత్యామ్నాయంగా..
చెక్క, స్టీల్ వంటి పదార్థాలతో తయారు చేసిన బోట్లు సముద్ర మార్గంలో ఎక్కువ కాలం మన్నికగా ఉండే అవకాశాలు తక్కువ. ఎందుకంటే.. కాలక్రమంలో ఉప్పు నీరు, తేమ ప్రభావంతో చెక్క కుళ్లిపోవడం, లోహం తుప్పు పట్టడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కానీ ఫైబర్ గ్లాస్ బోట్లు అలా కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇవి గాజు తంతువులు& రెసిన్ కలిపి తయారు చేసే కాంపోజిట్ పదార్థం. తక్కువ బరువుతోపాటు అధిక బలం, అధిక నాణ్యత కలిగి ఉండటంవల్ల నీటిలో ప్రయాణించడానికి అనువుగా ఉంటాయి. మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువే అంటున్నారు సాంకేతిక నిపుణులు. కాబట్టి ప్రస్తుతం సాంప్రదాయ బోట్లకు ప్రత్యామ్నాయంగా ఫైబర్ గ్లాస్ బోట్లను వినియోగానికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. స్థానిక నదులు, చెరువుల్లో, కాలువల్లో కూడా వీటిని ఉపయోగించడానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు.
భారత్‌లో పెరుగుతున్న అవకాశాలు
సాంకేతిక నిపుణుల ప్రకారం.. గ్లోబల్ రిక్రియేటషనల్ ఫైబర్ గ్లాస్ బోట్ మార్కెట్ 2025లో సుమారు 11 బిలియన్ డార్లుగా ఉంది. 2026-2033 మధ్య ఇది 9%కి పైగా CAGRతో పెరగనుందని కూడా నివేదికలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా భారత్‌లో నీటి పర్యాటక రంగం క్రమంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో బోట్ల తయారీతో సంబంధమున్న ఫైబర్‌గ్లాస్ మార్కెట్ కూడా రోజు రోజుకూ డెవలప్ అవుతోంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో మూసీ నది పునరుద్ధరణ, పల్లెల్లో చెరువుల అభివృద్ధి వంటి ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఇవి భవిష్యత్తులో బోటింగ్, నీటి ఆధారిత కార్యకలాపాలకు మార్గం సుగమం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫైబర్ గ్లాస్ బోట్లు భారతీయ పరిస్థితులకు అనుకూలమైన ఎంపికగా భావిస్తున్నారు. తక్కువ నిర్వహణ, సురక్షిత ప్రయాణం, దీర్ఘకాలిక ఉపయోగం వంటి లక్షణాలు ఈ బోట్లను మరింత ఉపయోగకరంగా మారుస్తున్నాయని సాంకేతిక నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా టూరిస్ట్ బోటింగ్, ఫిషింగ్, ఫ్లోటింగ్ కేఫేలు వంటి రంగాల్లో కొత్త అవకాశాలు పెరుగుతుండటంతో ఫైబర్ గ్లాసెస్ బోట్లకు ఆదరణ కూడా పెరుగుతున్నది. Link






