- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏఐ స్కిల్స్‌తోనే బంగారు భవిత.. వృద్ధికి, ఉద్యోగ సృష్టికి ఊతమిస్తున్న సాంకేతికత
ఏఐ స్కిల్స్‌తోనే బంగారు భవిత.. వృద్ధికి, ఉద్యోగ సృష్టికి ఊతమిస్తున్న సాంకేతికత

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతికత రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఏఐ ప్రవేశంతో మొత్తం ప్రపంచమే మారిపోయింది. ఒకప్పటితో పోలిస్తే శాస్త్ర, సాంకేతిక, సామాజిక రంగాల్లో వేగవంతమైన మార్పులకు, అభివృద్ధికి ఇది దోహదం చేస్తోంది. ఆ ప్రభావం భారత్‌పై కూడా ఎక్కువగానే ఉందంటున్నారు సాంకేతిక నిపుణులు. అందుకే 2025ను సాంకేతికరంగంలో ‘డిజిటల్ గోల్డ్ రష్’గా పేర్కొంటున్నారు.
*డిజిటల్ సెక్టార్‌లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బ్లాక్‌చైన్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతల సమాహారాన్ని ‘డిజిటల్ గోల్డ్ రష్’గా అభివర్ణిస్తున్నారు నిపుణులు. ఇది దేశ ఆర్థిక, వాణిజ్య అవకాశాల్లో వేగవంతమైన అభివృద్ధికి దోహదపడుతోంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆర్థిక వృద్ధికి, ఉద్యోగ సృష్టికి ఊతం ఇస్తున్నది. అందుకే నేటి యువత అందుకు తగిని స్కిల్స్‌ను అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది.
*ముఖ్యంగా బ్యాంకింగ్, ఆరోగ్యం, వ్యవసాయం, తయారీ రంగాల(manufacturing sectors)లో ఏఐ ఆధారిత డేటా అనలిటిక్స్ కారణంగా ఉత్పాదకత పెరుగుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. అందుకే దాదాపు 75% భారతీయ సంస్థలు (Indian companies) ఇప్పటి వరకు (2025) ఏఐని ఇంటిగ్రేట్ చేసుకున్నాయి. ఇది $115 బిలియన్ల ఆర్థిక ప్రభావాన్ని సృష్టిస్తుందని ఐడీసీ (Trusted Tech Intelligence)అంచనా వేసింది.
*బ్లాక్‌చైన్ : బ్లాక్ చైన్ (డిజిటల్, వికేంద్రీకృత లెడ్జర్ టెక్నాలజీ) టెక్నాలజీ అనేది సురక్షిత లావాదేవీలు, స్మార్ట్ కాంట్రాక్టులు, సప్లయ్ చైన్ (supply chain)ట్రాకింగ్‌లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. భారతదేశంలో 55% వ్యాపారాలు ఈ టెక్నాలజీని అవలంబిస్తున్నాయి(Adopting) అని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇది 2027 నాటికి 128.8 బిలియన్ డాలర్ల మార్కెట్(రూ. 10,73,160 కోట్లు)గా ఎదగనుంది.
*సైబర్‌సెక్యూరిటీ : డిజిటలైజేషన్ పెరిగే కొద్దీ సైబర్ దాడులు లేదా నేరాలు పెరుగుతున్నాయి. పలు నివేదికల ప్రకారం 2025లో సైబర్ సెక్యూరిటీ ఖర్చు $3.5 బిలియన్ల(350 కోట్లు )ను దాటనుంది. ఏఐ ఆధారిత బెదిరింపు గుర్తింపు, అలాగే క్వాంటం-సేఫ్ ఎన్‌క్రిప్షన్‌పై దృష్టి పెరుగుతోంది.
*డేటా అనలిటిక్స్ : డేటా అనలిటిక్స్ వ్యాపారాలకు మారుతున్న పోకడలను, ప్రజల అవసరాలను (Trends for businesses) తెలుసుకోవడానికి, కస్టమర్ ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి ఏఐ సహాయపడుతోంది. అట్లనే స్మార్ట్ సిటీలు, వ్యవసాయం, ఆరోగ్యంలో ఇంటర్నెట్ ఆధారిత (Internet of Things - IoT) డేటా సేకరణలోనూ హెల్ప్ అవుతోంది. దీంతో ఏఐకు మరింత ఆదరణ లభిస్తోంది. అంతేకాకుండా మారుతున్న అవసరాలకు అనుగుణంగా నైపుణ్య లోటు(Skills shortage), సైబర్ సెక్యూరిటీ ఛాలెంజెస్‌లను పరిష్కరించాల్సిన అవసరం నిరంతర పక్రియగా మారింది. కాబట్టి ఏఐకి డిమాండ్ పెరుగుతోంది. 2030 నాటికి ఇది భారతదేశాన్ని క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్, స్పేస్ టెక్‌లలో గ్లోబల్ లీడర్‌గాఎదిగేందుకు సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. Link






