- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Expensive mango: ఈ మామిడి పండు ఖరీదు ఏకంగా రూ. 2 లక్షలు.. ఇది తింటే ఏమవుతుందో తెలిస్తే డాక్టర్లకు సైతం షాక్
Expensive mango: ప్రపంచంలో ఎక్కడైనా ఒక మామిడిపండు ఖరీదు రెండు లక్షల రూపాయలు అంటే నోరెళ్ళ పెట్టి చూడటం తప్ప ఏమీ చేయలేము.

దిశ, వెబ్ డెస్క్: Expensive mango: ప్రపంచంలో ఎక్కడైనా ఒక మామిడిపండు ఖరీదు రెండు లక్షల రూపాయలు అంటే నోరెళ్ళ పెట్టి చూడటం తప్ప ఏమీ చేయలేము. ఎందుకంటే బంగారం ఖరీదే తులం లక్ష రూపాయలు ఉన్న ఈ రోజుల్లో ఒక మామిడిపండుకు రెండు లక్షల పెట్టి తినేంత స్పెషాలిటీ ఏముందా అని మీరు ఆలోచించవచ్చు. మరి ఆ స్పెషాలిటీ ఏంటో ఆ మామిడిపండు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో మ్యాంగో ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు ఇక్కడ 240 రకాల మామిడి పండ్లను ప్రపంచవ్యాప్తంగా సేకరించి ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనలో రూ. 2 లక్షల విలువైన మియాజాకీ మ్యాంగో అందరినీ ఆకర్షిస్తోంది. జపాన్ నుంచి తెచ్చిన ఈ అరుదైన మామిడిపండు ఖరీదు ఒక కేజీ రూ. 2 లక్షల రూపాయలు దీని స్పెషాలిటీ విషయానికి వస్తే ఇందులో బీటా కెరోటిన్లు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు.
ఇది తింటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిదని కూడా సూచిస్తున్నారు. రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ చెట్టు ఆరు బయటపెరగదు. దీనికోసం పాలీహౌస్ నిర్మించాల్సి ఉంటుంది. పూర్తిగా నియంత్రిత వాతావరణంలోనే ఇది పెరుగుతుంది. ఈ మామిడిపండు చాలా తీపి కలిగి ఉంటుంది అలాగే చాలా జ్యూసీగా ఉంటుంది దీని లోపల కండ కూడా రుచికరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దీని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఉండే అత్యధిక సంఖ్యలోని బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. అయితే ఈ చెట్టును పెంచడం అనేది ఎంతో కష్టమైన పని దీనిని ఎంతో కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో పెంచాల్సి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన మామిడి పండుగా పేరు సంపాదించుకుంది. ఈ మామిడిపళ్ళను సాధారణంగా వేలంపాట వేసి మరీ కొంటారు. ఇక ఈ ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన హిమాయత్ రకం మామిడిపండు చాలా ఆదరణ పొందుతుంది. దీంతోపాటు మహారాష్ట్రకు చెందిన ఆల్ఫాన్సో రకం కూడా ప్రదర్శనకు వచ్చిన వారిని నోరూరిస్తోంది.






