- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందరిలో పెళ్లి కూతురు అలా చేసినా.. తాళి కట్టావంటే నీది మామూలు గుండె కాదురా! (వీడియో)
జననం తర్వాత మనిషి జీవితంలో అతిపెద్ద ఘట్టం ఏదైనా ఉంది అది పెళ్లి(Marriage) మాత్రమే. ఏ విషయంలో కాంప్రమైజ్ అయినా పర్లేదు కానీ పెళ్లి విషయంలో అస్సలు కాంప్రమైజ్(Compromise) కావొద్దని పెద్దలు చెబుతుంటారు.

దిశ, వెబ్‌డెస్క్: జననం తర్వాత మనిషి జీవితంలో అతిపెద్ద ఘట్టం ఏదైనా ఉంది అది పెళ్లి(Marriage) మాత్రమే. ఏ విషయంలో కాంప్రమైజ్ అయినా పర్లేదు కానీ పెళ్లి విషయంలో అస్సలు కాంప్రమైజ్(Compromise) కావొద్దని పెద్దలు చెబుతుంటారు. అందుకే ముందు ఏడు తరాలు.. వెనుక ఏడు తరాలు చూసి పెళ్లి చేసుకోవాలని సూచనలు చేస్తుంటారు. అయితే, ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు కూడా కమర్షియల్(Commercial)గా మారిపోయాయి. కొందరు ఇష్టమైన వారితో జీవితం పంచుకునేందుకు ఎంతకైనా తెగించి లవ్ మ్యారేజ్‌లు చేసుకుంటుండగా.. మరికొందరు పెద్దల మాట కాదనలేక.. ఇష్టం లేకపోయినా తలొంచి పెళ్లి చేసుకుంటున్నారు. ఏది ఎలా పెళ్లి వరకు వెళ్లాక మర్యాదల్లో మాత్రం ఎవరూ తగ్గకుండా జాగ్రత్త పడతారు. ముఖ్యంగా మటన్ ముక్క కోసం ఎన్నో పెళ్లిళ్లు ఆగిపోయిన ఘటనలు ఎన్నో చూశాం.
కానీ స్వయంగా పెళ్లి కూతురే వందల మంది మధ్యలో అతి దారుణంగా అవమానించినా ఓ వరుడు ఏమాత్రం సిగ్గు పడకుండా.. అవమానంగా ఫీల్ అవ్వకుండా తాళి కట్టేశాడు. పీటల మీదకు రావడం నుంచి మొదలు తాళి కట్టే వరకూ.. మండపం సాక్షిగా వరుడ్ని ఆ పెళ్లి కూతురు అవమానిస్తూ వచ్చింది. మెడలో వేసే దండ కూడా సరిగా వేయకుండా.. అలా పక్కకు విసిరిపారేసింది. అయినా వరుడు కోపం తెచ్చుకోకుండా.. ఆ దండను తానే మెడలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని గమనించిన నెటిజన్లంతా ‘ఏం గుండెరా నీది.. నీ గుండె బతకాలి’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు అంతాల అవమానిస్తుంటే ఎందుకు భరిస్తున్నావు బ్రో.. తను కాకపోతే మరొకరు వదిలిపాడేయ్ అంటూ మండిపడుతున్నారు.
Marriage is scary these days, what if she pic.twitter.com/4iV1baxdQ8
— ︎ ︎venom (@venom1s) January 23, 2025






