- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టైల్ అంటే వాళ్లదే గురూ..! ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలిన ఫేమస్ లేడీ ఇన్‌ఫ్లుయెన్సర్లు వీళ్లే..
స్టైల్ అంటే వాళ్లదే గురూ..! ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలిన ఫేమస్ లేడీ ఇన్‌ఫ్లుయెన్సర్లు వీళ్లే..

దిశ, ఫీచర్స్ : కాలంతోపాటు మానవ రోజువారీ జీవితంలో అనేక మార్పులు సంతరించుకుంటాయి. వర్తమానంలో ఉన్నప్పుడు అప్పటి పరిస్థితులు, పోకడలే బాగున్నాయి అనుకునేవారు సైతం.. ఆ తర్వాత భవిష్యత్తులో అవి అంత ఆసక్తికరమైనవి కావని భావించవచ్చు. వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు, ఫ్యాషన్ వంటి అనేక విషయాలకు ఇది వర్తిస్తుంది. అయితే పురాతనకాలం నుంచి ఆధునిక కాలం వరకు ఫ్యాషన్ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్సియల్ స్టైల్ ఐకాన్స్(influential style icons) అయిన కొందరు మహిళల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రాణి ఎలిజబెత్ నుంచి కోకో షానెల్ వరకు
పురాతన కాలంలో, ఈజిప్టు రాణి క్లియోపాత్రా తన విలాసవంతమైన దుస్తులు(Luxurious clothing), బంగారు ఆభరణాలు, ఐకానిక్ మేకప్‌తో ఫ్యాషన్‌కు కొత్త డెఫినేషన్ ఇచ్చింది. మధ్య యుగాలలో రాణి ఎలిజబెత్ I తన రాయల్ గౌన్‌లు, అలాగే లగ్జరీ ఫ్యాబ్రిక్స్‌తో యూరోపియన్ ఫ్యాషన్‌ను ప్రభావితం చేసింది. 20వ శతాబ్దంలో అయితే కోకో షానెల్(Coco Chanel) ఆధునిక ఫ్యాషన్‌కు విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ముఖ్యంగా ‘లిటిల్ బ్లాక్ డ్రెస్’ వంటి సింపుల్ అండ్ ప్రాక్టికల్ డిజైన్‌లతో ఆకట్టుకున్నది. అదే విధంగా ఆడ్రీ హెప్‌బర్న్ (Audrey Hepburn)తన సొగసైన, క్లాసిక్ స్టైల్‌తో, ముఖ్యంగా ‘బ్రేక్‌ఫాస్ట్ ఎట్ టిఫనీస్’ సినిమాలో ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకర్షించింది.
మడన్నా నుంచి రిహానా వరకు
ఆధునిక కాలంలో మడన్నా(Madanna), రిహానా, అండ్ బియాన్సే వంటి సెలబ్రిటీలు తమ ధైర్యమైన, ప్రయోగాత్మక ఫ్యాషన్ ఎంపికలతో ట్రెండ్ సెట్ చేశారు. మడన్నా 80లలో తన రెబెల్ స్టైల్(Rebel style)తో యూత్‌ను ఆకర్షించగా, రిహానా తన ఫెంటీ బ్రాండ్‌తో ఇన్‌క్లూజివ్ ఫ్యాషన్(Inclusive fashion)ను ప్రోత్సహించింది. అయితే ఈ ఫ్యాషన్ ఐకాన్‌లు కేవలం దుస్తులకే పరిమితం కాకుండా, సామాజిక సందేశాలు(Social messages), స్వీయ వ్యక్తీకరణ(to self-expression)కు మాధ్యమంగా మార్చారు. అంతేకాదు వీరు ఫ్యాషన్‌ను సాంస్కృతిక, సామాజిక మార్పులతో ముడిపెట్టి, ప్రపంచవ్యాప్తంగా కొత్త ట్రెండ్‌లను రూపొందించారు. ఇప్పటికీ ఫ్యాషన్ అభివృద్ధి చెందుతున్న నిరంతర కళగా, స్టైల్‌గా కాలంతోపాటు పయనిస్తూనే ఉంది.






