Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ్ల బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు.. ఇలా చేస్తే మీరు కూడా మెరిసిపోతారు

by Vennela |   (  Updated:2026-02-12 11:54:30  IST  )

తన అందాన్ని కాపాడుకునేందుకు సింపుల్ చిట్కాలను పాటిస్తానని శోభిత దూలిపాళ చెప్పింది. దీనిలో ప్రధానంగా శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యకరమైన, స్మూత్ స్కిన్ కోసం వినియోగించే కొబ్బరి నూనె. అదే తన సీక్రెట్ అని చెప్పింది శోభిత. జుట్టుబలంగా ఉండాలంటే కొబ్బరినూనె మంచి ఎంపిక అని కొబ్బరి నూనెతో చాలా సమస్యలను తగ్గించుకోవచ్చని చెప్పారు.

Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ్ల బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు.. ఇలా చేస్తే మీరు కూడా మెరిసిపోతారు
X

దిశ, వెబ్ డెస్క్: Sobhita Dhulipala: అక్కినేని కోడలు...హీరో అక్కినేని నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ్ల గ్లామరస్ గౌను అయినా క్లాసిర్ చీరలో అయినా అందర్నీ ఆకట్టుకుంటుంది. కానీ శోభిత అందం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. సాంప్రదాయ సౌందర్య సాధనాలే తన బ్యూటీ సీక్రెట్ అంటూ ఈ మధ్యే ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. వోగ్ బ్యూటీ స్కోప్ తో మాట్లాడిన మేడ్ ఇన్ హెవెన్ యాక్టర్ శోభిత తన బ్యూటీ సీక్రెట్స్, స్వీయ సంరక్షణకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. అందంగా కనిపించడమే కాదు ఆనందంగా ఉండటం కూడా ముఖ్యమని వివరించింది. స్వీయ సంరక్షణ, ఆత్మవిశ్వాసం ముఖ్యమైన నిజమైన అందం లోపలి నుంచే వస్తుందని తన నమ్మకాన్ని చెప్పుకొచ్చింది.

తన అందాన్ని కాపాడుకునేందుకు సింపుల్ చిట్కాలను పాటిస్తానని చెప్పింది. దీనిలో ప్రధానంగా శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యకరమైన, స్మూత్ స్కిన్ కోసం వినియోగించే కొబ్బరి నూనె. అదే తన సీక్రెట్ అని చెప్పింది శోభిత. జుట్టుబలంగా ఉండాలంటే కొబ్బరినూనె మంచి ఎంపిక అని కొబ్బరి నూనెతో చాలా సమస్యలను తగ్గించుకోవచ్చని చెప్పారు. తనకు తీవ్రమైన మైగ్రేన్ వచ్చినప్పుడు కొబ్బరి నూనె చాలా హెల్ప్ చేసిందని చెప్పింది. కొద్దిగా కొబ్బరి నూనెను నీటితో కలిపి స్ప్రే బాటిల్ లో వేసి స్ప్రే చేసుకుంటే తన జుట్టు అణిగి ఉంటుందని తెలిపింది. ఇక దద్దర్లు, చర్మం పొడిబారడం ఇలా ప్రతీదానికి తాను కొబ్బరినూనె వాడుతానని తెలిపింది.

రకరకాల పెదవి ఉత్పత్తులపై భారీగా ఖర్చు పెట్టే బదులు నెయ్యి మంచి మాయిశ్చరైజర్ లేదని..లిప్ బామ్, లైనర్, కాజల్ వాడినప్పటికీ ..పొద్దున్నే తన పెదవులుపై నెయ్యి రాసుకుంటానని చెప్పుకొచ్చింది. షూటింగ్ సమయంలో తప్ప భారీ మేకప్ లేకుండా సాదా సీదాగానే ఉంటానంటూ చెప్పింది. శోభిత తన లుక్స్ కు బ్లూ కలర్ ఇష్టమని తెలిపింది. ప్రపంచంలోని కొత్త ట్రెండ్స్ ను ఆనందిస్తూనే సాంప్రదాయ సౌందర్య చిట్కాలను పాటించడం వల్ల తన స్టైల్ అని చెప్పుకొచ్చింది అక్కినేని కోడలు.

Next Story