గాలి నుంచి తాగునీరు.. ఎడారిలోనూ దాహం తీర్చే మ్యాజిక్ మెషిన్!

by Javid Pasha |   (  Updated:2026-02-24 12:00:50  IST  )

ఒమర్ యాగి అభివృద్ధి చేసిన గాలి నుంచి నీటిని గ్రహించే మెషిన్ రోజుకు 2.8 లీటర్ల వరకు నీటిని గాలి నుంచి ఉత్పత్తి చేస్తుంది.

గాలి నుంచి తాగునీరు.. ఎడారిలోనూ దాహం తీర్చే మ్యాజిక్ మెషిన్!
X

దిశ, ఫీచర్స్ : బయట నడుచుకుంటూ వెళ్తుంటాం. అనుకోకుండా దాహం వేస్తుంది. కానీ.. సమయానికి వాటర్ అందుబాటులో లేకుంటే..? ఈ ప్రశ్నకు సమాధానంగా పుట్టుకొచ్చిన అధునాతన సాంకేతిక పరికరమే అట్మాస్ఫెరిక్ వాటర్ హార్వెస్టర్ (Atmospheric Water Harvester). మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్(MOFs)MOF-బేస్డ్ వాటర్ హార్వెస్టర్ అని కూడా పిలుస్తారు. జోర్డాన్-అమెరికన్ రసాయన శాస్త్రవేత్త అయిన ఒమర్ యాగి(Omar Yaghi) దీనిని తయారు చేశారు. అసలు విషయం ఏమిటంటే.. ఇది గాలి నుంచి నీటిని సేకరించే మెషిన్. ఇంతకీ అదెలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజుకు వెయ్యి లీటర్లు !

ఒమర్ యాగి MOF-303తో హ్యాండ్-హెల్డ్ వెర్షన్‌తో అభివృద్ధి చేసిన గాలి నుంచి నీటిని గ్రహించే మెషిన్ రోజుకు 2.8 లీటర్ల వరకు నీటిని 20% తేమ ఉన్న గాలి నుంచి ఉత్పత్తి చేస్తుంది. పైగా ఇది పరిసర ఉష్ణశక్తి లేదా సౌరశక్తితో పనిచేస్తుంది. అయితే దీని అధునాతన కమర్షియల్ యూనిట్లు (ఉదాహరణకు, Atoco కంపెనీ ద్వారా) రోజుకు 1,000 లీటర్ల వరకు (ఆఫ్-గ్రిడ్ వెర్షన్) లేదా 2,000 నుండి 4,000 లీటర్ల వరకు (ఆన్-గ్రిడ్ వెర్షన్) కూడా నీటిని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి కరువు ప్రాంతాల్లో, ఎడారి ప్రాంతాల్లో గాలి నుంచి శుద్ధమైన తాగునీటి(Clean drinking water)ని అవసరమైన చోట్ల తీసుకొని ఉపయోగించుకోవచ్చు.

ఎలా పనిచేస్తుంది?

గాలి నుంచి నీటిని తయారు చేసే మెషిన్ పనితీరు విషయానికి వస్తే ఇందులోని అధునాతన పోరస్ మెటీరియల్స్‌ ఉంటాయి. కాబట్టి వీటిని ఉపయోగించి గాలిలోని తేమను ఆకర్షించి, నీటిని విడుదల చేస్తుంది. అయితే ఇది సూర్యకాంతి మాత్రమే ఉపయోగించి నీటిని ఉత్పత్తి చేస్తుంది. అంటే.. ఈ మెషిన్ రాత్రి సమయంలో గాలి తేమను సంగ్రహించి, పగలు ఉష్ణంతో విడుదల చేసే విధంగా కూడా రూపొందించబడింది.

ఉపయోగాలు?

గాలి నుంచి నీటిని తీసే మెషిన్‌తో నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రమైన తాగునీటిని పొందడం, అందించడం సాధ్యం అవుతుంది. ముఖ్యంగా ఎడారులు, దూర ప్రాంతాలు లేదా కరువు ప్రాంతాలలో చాలా ఉపయోపడుతుంది. పైగా ఇది విద్యుత్ అవసరం లేకుండా సూర్యకాంతి లేదా పరిసర ఉష్ణోగ్రతతో పనిచేస్తుంది. మెషిన్ పరిణామాన్నిబట్టి రోజుకు 1,000 లీటర్ల వరకు నీటిని ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 2.2 బిలియన్ మంది నీటి సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇది సస్టైనబుల్ సొల్యూషన్‌గా మారుతుందని, క్లైమేట్ చేంజ్ ప్రభావాలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మెషిన్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. రసాయన శాస్త్రవేత్త యాగి స్థాపించిన కంపెనీలు అటోకో (Atoco) అండ్ వాహా (WaHa) ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు.

Next Story