ఈ మూడు రహస్యాలు తెలిస్తే చాలు.. ఎక్కువ కాలం యవ్వనంగా ఉండొచ్చు..!

by Javid Pasha |

ఈ మూడు రహస్యాలు తెలిస్తే చాలు.. ఎక్కువకాలం యవ్వనంగా ఉండొచ్చు..!

ఈ మూడు రహస్యాలు తెలిస్తే చాలు..  ఎక్కువ కాలం యవ్వనంగా ఉండొచ్చు..!
X

దిశ, ఫీచర్స్ : ఆధునికత ఎన్ని కొత్త పుంతలు తొక్కినా మరణాన్ని, వృద్ధాప్యాన్ని పూర్తిగా అడ్డుకోగల ఔషధాలో, అద్భుతమైన మార్గాలో ఇప్పటి వరకైతే లేవు. కాకపోతే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా ఆనందంగా జీవించడం, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసుకోవడం మాత్రం మన చేత్తుల్లో ఉందంటున్నది నేచర్ మెడిసిన్ అండ్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి నిర్వహించిన తాజా అధ్యయనం. నిజానికి వృద్ధాప్యం నెమ్మదిగానో, స్థిరంగానో సంభవించదు. జీవితంలోని మూడు దశల్లో అది అత్యంత వేగంగా సంభవిస్తుంది. వాటిని గుర్తించి జాగ్రత్త పడితే మాత్రం యవ్వనాన్ని మరిన్ని ఎక్కువ రోజులు కాపాడుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఆ దశలేవి? వృద్ధాప్యాన్ని ఎలా అడ్డుకోవాలో ఇప్పుడు చూద్దాం.

వయసుతో పాటు శరీరంలో మార్పులు, అనారోగ్య సమస్యలు కూడా సంభవిస్తుంటాయి. ముఖ్యంగా జీవితంలోని మూడు దశల్లో అంటే.. 34, 60, 78 ఏండ్ల వయస్సులలో శరీరంలో వృద్ధాప్య ప్రక్రియలు వేగంగా సంభవిస్తాయని, అధ్యయనం పేర్కొన్నది. ఎందుకంటే.. ఈ మూడు దశల వయస్సులో జీవసంబంధమైన తరంగాల( biological waves) రూపంలో శరీరం ప్రతికూల మార్పులకు గురౌతుందని, రక్తంలోని ప్రొటీన్ స్థాయిలలో సంభవించే ప్రతికూల మార్పులు వేగవంతమైన వృద్ధాప్యానికి దారితీస్తాయని అధ్యయనం కనుగొన్నది.

పరిశోధనల ప్రకారం.. మానవుల 34వ ఏట జీవక్రియ సంబంధిత ప్రోటీన్లలో, 60వ ఏట రోగ నిరధక వ్యవస్థలో, 78వ ఏట గుండె, గుండె కండరాల పనితీరులో ప్రతికూలమైన మార్పలు చాలా వేగంగా సంభవించి, వృద్ధాప్యాన్ని కూడా వేగవంతం చేస్తాయి. దీర్ఘాయుష్షును అర్థం చేసుకోవడం, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడంలో అనుసరించే విధానాన్ని మార్చడానికి ఈ అధ్యయనం సహాయపడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే ఈ మూడు దశల్లో శరీరాన్ని వృద్ధాప్యానికి దారితీసే పరిస్థితుల నుంచి రక్షించుకోగలిగే దానిని ఆలస్యం చేయవచ్చునని చెబుతున్నారు.

34 ఏండ్ల వయసులో..

వృద్ధాప్యానికి దారితీసే జీవక్రియ మార్పులను అడ్డుకోవాలంటే 34 ఏండ్ల వయసులో ఆరోగ్యం గురించి కాస్త ఎక్కువ కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయానికి వస్తే.. బెర్రీలు, ఆకుపచ్చ కూరగాయలు, నట్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అలాగే సాల్మన్ చేప, చియాసీడ్స్ వంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఆహారలు తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్ తగ్గించాలి. దీంతోపాటు రోజుకు 30 నిమిషాలు వ్యాయామం అవసరం. ఒత్తిడి నిర్వహణకోసం మెడిటేషన్ చేయడం, ఎక్కువ నీరు తాగడం వంటివి చేయాలి.

60 ఏండ్ల వయసులో..

జీవితంలోని 60 ఏండ్ల వయసులో రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మందగించడం ద్వారా వృద్ధాప్యం వేగంగా వచ్చేస్తుంది. ఆ సమయంలో దీనిని ఆలస్యం చేయడానికి, సిట్రస్ పండ్లు, బాదం, బీన్స్ వంటి విటమిన్ సి, డి, జింక్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ప్రోబయోటిక్స్ కలిగి ఉండే పెరుగు, మజ్జిగ వంటివి తీసుకోవాలి. నడక, స్విమ్మింగ్ లేదా తేలికపాటి ఇతర వ్యాయామాలు చేయాలి. సరిపడా నిద్రపోవాలి.

78 ఏండ్ల వయసులో..

సాధారణంగా 78 ఏండ్ల వయసులో గుండె కండరాలు దెబ్బతింటుంటాయి. వృద్ధాప్యం తీవ్రతరం కావడం లేదా మరణం సంభవించడానికి ఇవి ప్రధాన కారణం అవుతాయి. కాబట్టి అలాంటి పరిస్థితిని అడ్డుకోవాలంటే.. గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆలీవ్ ఆయిల్, ఆకుకూరలు, ఓట్స్, క్వినోవా వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్స్ తగ్గించాలి. శరీరం సహకరించే దానిని బట్టి బ్యాలెన్స్‌డ్ వ్యాయామాలు చేయాలి. ధూమపానం, మద్యపానం తగ్గించాలి. యోగా, తాయ్ చీ వంటి వ్యాయామాలు ఈ వయసులో కండరాల బలాన్ని, సమతుల్యతను మెరుగు పరుస్తాయి. రెగ్యులర్ హెల్త్ చెకప్‌ల ద్వారా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. Link

Next Story