నాలుగేళ్ల బాలుడి స్కేట్ బోర్డింగ్ స్కిల్‌.. ఓ వ్య‌క్తి ఇలా స్పందించారు (వీడియో)

by Disha Web Desk 20 |
నాలుగేళ్ల బాలుడి స్కేట్ బోర్డింగ్ స్కిల్‌.. ఓ వ్య‌క్తి ఇలా స్పందించారు (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః కొంతమంది పిల్లలు చాలా త్వ‌ర‌గా నైపుణ్యాల‌ను త‌మ వ‌శం చేసుకుంటారు. వాళ్ల‌కి ఇష్టం క‌ల‌గాలే కానీ ఎంతటి విద్య‌నైనా అల‌వోక‌గా చేసేస్తారు. అలా చాలా చిన్న వ‌య‌సులో త‌మ అపూర్వమైన స్కిల్స్ చూపించే పిల్లల వీడియోలను చూస్తుంటే ఆశ్చ‌ర్యంతో పాటు తెగ ముచ్చ‌టేస్తుంది. రష్యాలోని మాస్కోకు చెందిన ఈ 4 ఏళ్ల బాలుడి స్కేట్‌బోర్డింగ్ నైపుణ్యాలు స‌రిగ్గా ఇలాగే అనిపిస్తాయి. అయితే, ఈ బాలుడి వీడియోలు 'మిహోంచెస్' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తుంటారు. బుడ్డొడి ఇన్‌స్టాగ్రామ్ బయో ప్రకారం అతని వయస్సు నాలుగు సంవత్సరాల మూడు నెలలు. అయినా, 1.15 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోల్లో, ఈ బోర్టింగ్ బాబు మాస్కో వీధుల్లో స్కేట్‌బోర్డింగ్ చేస్తూ కనిపిస్తాడు. ఇప్పుడు ఈ తాజా వీడియోలో ఒక స్కేట్ బోర్డింగ్ ఈవెంట్‌లో తన స్కేట్‌బోర్డింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ కనిపిస్తాడు. నెటిజ‌నులు భేష్ అంటున్న ఈ వీడియోను మీరూ చూడండి.


Next Story

Most Viewed