'12 హవర్ వాక్ చాలెంజ్'.. గ్లోబల్ మోమెంట్‌ను ప్రారంభించిన ఓ బ్రాడీ

by Dishanational4 |
12 హవర్ వాక్ చాలెంజ్.. గ్లోబల్ మోమెంట్‌ను ప్రారంభించిన ఓ బ్రాడీ
X

దిశ, ఫీచర్స్: నటాలీ బ్లాంక్ చీకటితో కూడిన నిశ్శబ్ద పారిస్ వీధుల్లో తెల్లవారుజామున నడవడం ప్రారంభించింది. ఉదయం ఐదు గంటలకు నడకను ఆరంభించిన ఆమె 12 గంటల తర్వాత సూర్యాస్తమయంతో ముగించింది. దాదాపు 44 కి. మీ వాక్‌లో సంగీతం, పాడ్‌కాస్ట్, కెమెరా, డిజిటల్ డిస్ట్రాక్షన్ ఏమీ లేవు. ఉత్తమ జీవితాన్ని అన్‌లాక్ చేయడానికి, బ్రోడ్ మైండెడ్‌‌గా మారేందుకు ఒక్క రోజును పెట్టుబడి పెట్టడానికి రోజంతా షికారు చేసింది. ఈ '12-Hour Walk Challenge'లో సరికొత్త జీవితానుభవాలను పొందింది. ప్రస్తుతం ఈ చాలెంజ్ ఆధునిక తీర్థయాత్రగా మారగా.. ఈ గ్లోబల్ మోమెంట్‌కు సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం.

కొందరికి నడక అనేది బహుమానం. క్యూరియాసిటీ మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళుతుందో అక్కడ తేలేందుకు పర్మిషన్ ఇచ్చే గిఫ్ట్. మనను మన విస్మయ భావాలకు( AWE Monents) కనెక్ట్ చేసే కానుక అని చెప్తుంటాడు ఈ '12 హవర్ వాక్ చాలెంజ్' ప్రారంభించిన ఓ'బ్రాడీ. '12-Hour Walk Challenge' పుస్తకాన్ని రచించిన ఆయన.. అంటార్కిటికా, మౌంట్ ఎవరెస్ట్ వంటి ఎక్స్‌ట్రీమ్ ప్లేసెస్‌లో అనేక అడ్వెంచర్స్ చేశాడు. ఇవే మన శరీరాలను పరిమితికి ఎలా నెట్టాలనే విషయంలో తనను నిపుణుడిగా మార్చాయి. ఈ క్రమంలోనే మనుషుల్లో నెలకొన్న పరిమిత నమ్మకాలను తొలగించడానికి, బియాండ్‌ ది లిమిట్స్ ఉన్నారని రుజువు చేసేందుకు వన్‌-డే ప్రిస్క్రిప్షన్ మోడల్‌ను ప్రతిపాదించాడు. ఈ లైఫ్ చేంజింగ్ జర్నీలో పాల్గొనాలని ప్రపంచానికి పిలుపునిస్తున్నాడు. ఈ క్రమంలోనే 'ఇన్వెస్ట్ వన్-డే.. అన్‌లాక్ యువర్ బెస్ట్ లైఫ్' అని యూత్‌ను ఇన్‌స్పైర్ చేస్తున్నాడు.

నిజానికి ఈ చాలెంజ్‌లో కోరుకున్నంత వరకు, అవసరమైనంత సేపు విరామాలు తీసుకోవచ్చు. ఈ 12 గంటల్లో ఒక్క కిలోమీటర్ లేదా 50 కిమీ నడిచామా అనేది మ్యాటర్ కాదు. ఎందుకంటే సవాల్ అనేది రేసు కాదని చెప్తుంటాడు ఓ'బ్రాడీ. ఈ పన్నెండు గంటల వాక్.. అపరిమిత అవకాశాల జీవితాన్ని అన్‌లాక్ చేసే సాధికారత కలిగిన ఆలోచనా విధానంగా, పాజిబుల్ మైండ్‌సెట్‌గా అభివర్ణించాడు. ఇది ప్రజలకు నిరంతరం విస్తరించిన దృక్పథాన్ని, కొత్త విషయాలను ప్రయత్నించడానికి సుముఖతను ఇస్తుంది. రొటీన్ ఆలోచనల న్యూరోప్లాస్టిసిటీ నుంచి డిస్‌కనెక్ట్ అయి, మీలోని డీప్ ట్రుత్‌కు కనెక్ట్ చేస్తుంది.

ఒంటరి ప్రయాణంలో ఒంటరి మాత్రం కాదు..

కాగా ఈ చాలెంజ్ తీసుకున్న చాలా మంది యూత్ పాజిటివ్ రెస్పాన్స్‌తో ముందుకొచ్చారు. ఒక్క రోజులో ఇన్ని అద్భుతాలు చూడొచ్చని, లైఫ్ అంటే ఇదేనని అర్థమవుతుందని చెప్పుకొస్తే.. మరికొందరు గ్రేట్‌ఫుల్‌గా, విశాలమైన స్పేస్‌గా అభివర్ణించారు. ఇంతకు ముందెన్నడూ లేని కాన్ఫిడెన్స్ వచ్చిందని, 'నిశ్శబ్దంలో ఏదీ లేదనేది అవాస్తవం.. ఇందులోనే అన్నీ ఉన్నాయి' అని తమ అనుభవాలను పంచుకున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed