Viral : డిగ్రీలు, ఎంబీఏలు లేకపోతేనేం..! నెలకు రూ. 8 లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్..!!

by Javid Pasha |   (  Updated:2025-06-05 06:11:19  IST  )

Viral : డిగ్రీలు, ఎంబీఏలు లేకపోతేనేం..! నెలకు రూ. 8 లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్..!!

Viral : డిగ్రీలు, ఎంబీఏలు లేకపోతేనేం..! నెలకు రూ. 8 లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్..!!
X

దిశ, ఫీచర్స్ : ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందనే మాట అందరూ వింటూ ఉంటారు. కానీ.. కొందరు మాత్రం ఆచరించి చూపుతుంటారు. సరిగ్గా అదే చేశాడు ఓ డ్రైవర్. డిగ్రీలు, ఎంబీఏలు లేకపోతేనేం. తనకు వచ్చిన ఆలోచననే అవకాశంగా మల్చుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడతను నెలకు రూ. 5 నుంచి 8 లక్షలు సంపాదిస్తున్నాడు. అతని పేరు, వ్యక్తిగత వివరాలైతే తెలియదు కానీ, ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టంట తెగ వైరల్ అవుతూ ఎందరినో ఆకట్టుకుంటోంది. ఆ వివరాలేమిటో చూద్దాం.

*అది ముంబైలోని యూఎస్ కాన్సులేట్ ఆఫీస్ ఏరియా(US Consulate Office Area in Mumbai). వీసా అపాయింట్‌మెంట్ వచ్చీపోయే వారితో బిజీ బిజీగా ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చిన వారు తమ వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లను, ఇతర వస్తువులను లోపలికి తీసుకెళ్లడానికి అనుమతించరు. సమీపంలో ఎక్కడా లాకర్ ఫెసిలిటీ కూడా లేదు. బయట ఎక్కడైనా పెడదామంటే కూడా తగిన సౌకర్యం లేక జనాలు అవస్థలు పడుతుండటాన్ని గమనించిన ఓ ఆటో డ్రైవర్. వీసాకోసం వచ్చే కస్టమర్ల బ్యాగ్‌లను తన ఆటోలోనే సేఫ్‌గా భద్ర పరిచి, అందుకోసం కొంతమొత్తం నగదు తీసుకునేవాడు.

*క్రమంగా డిమాండ్ బాగా పెరగడంతో సదరు ఆటోడ్రైవర్ ఆటోను తోలడం కూడా మానేసి కేవలం బ్యాగులను భ్రదపరచే సేవను ప్రారంభించాడు. ఇలా ఒక్కో బ్యాగ్‌కు రూ. 1,000 రూపాయలు వసూలు చేస్తూ, రోజుకు 20-30 మంది కస్టమర్ల నుంచి రూ. 20,000 నుంచి రూ. 30,000 సంపాదిస్తున్నాడు. ఈ విషయాన్ని లెన్స్‌కార్ట్ ప్రొడక్ట్ లీడర్ రాహుల్ రూపానీ సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఐడియా అదిరింది గురూ అంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.

Next Story