Tree: ఆ వృక్షం స్త్రీలకు ఓ వరం.. ఆధ్యాత్మికంగా, సైంటిఫిక్ గా పేరు పొందిన ఏకైక చెట్టు ఇదే..!

by Phanindra |

ఇంట్లో చెట్టును నాటిన తర్వాత ప్రతి రోజూ మ‌హిళలు నీరు పోయాలి.

Tree: ఆ వృక్షం స్త్రీలకు ఓ వరం.. ఆధ్యాత్మికంగా, సైంటిఫిక్ గా పేరు పొందిన ఏకైక చెట్టు ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ ప్రపంచంలో ఎన్నో రకాల వృక్ష జాతులు ( Trees ) ఉన్నాయి. అయితే, వాటిలో కొన్ని చెట్లకు మాత్ర‌మే పూజలు చేస్తాము. మ‌న పూర్వీకులు పవిత్ర వృక్షాలుగా భావించి దేవతలును ఎలా కొలిచే వాళ్ళో అలాగే చెట్లకి కూడా దీపాలు వెలిగించి పూజ‌లు చేసేవాళ్ళు. అలాంటి వాటిలో అశోక‌ చెట్టు ( Ashoka tree ) కూడా ఒకటి. ఈ వృక్షం గురించి పురాణాల్లో కూడా ప్రస్తావించారు. వాస్తవానికి అశోక అనేది సంస్కృత ప‌దం. అంటే బాధ‌లను దూరం చేసి, సంతోషాలను దగ్గరకి చేర్చేదనే అర్థాలు వ‌స్తాయి. హిందూ సంప్రదాయ ప్రకారం ఈ వృక్షానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆధ్యాత్మికంగా, సైంటిఫిక్ గా పేరు పొందిన ఏకైక చెట్టు కూడా ఇదే. అయితే, ఇది ఇంట్లో ఉండటం వలన ఎలాంటి ప్రయోజనాలు క‌లుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

ఇంట్లో అశోక చెట్టును నాటిన తర్వాత ప్రతి రోజూ మ‌హిళలు నీరు పోయాలి. ఇది స్త్రీలకు ( womens ) ఓ వరం. వారు మాన‌సికంగా, శారీర‌కంగా ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు, వారికి రుతుక్ర‌మ స‌మ‌స్య‌లను కూడా దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎవరి ఇంట్లో ఉన్నా ఉత్త‌రం దిశ‌గా మాత్రమే పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎన్నో శుభాల‌ను కూడా క‌లిగిస్తుంది. అయితే, ఆ చెట్టుకు మాత్రం నీరు పోస్తూ ఉండాలి. భార్య , భర్త అశోక చెట్టు వేళ్ల‌ను దిండు కింద పెట్టుకుంటే .. వైవాహిక స‌మ‌స్య‌లు తొల‌గిపోయి వారి బంధం బలపడుతుంది.

ఈ వృక్షం వేళ్ల‌ను మంచి నీటితో క‌డిగి వాటిని పూజ గ‌దిలో పెట్టుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి వాస్తు దోషాల‌న్నీ తొల‌గిపోతాయ‌ట‌. అశోక చెట్టు కింద ప్రతి రోజూ నెయ్యి, క‌ర్పూరంతో దీపాన్ని వెలిగిస్తే ఆర్ధిక సమస్యలు నుంచి బయటపడతారు. అలాగే, ఆ ఇంట్లో వారంద‌రికీ మంచి జ‌రుగుతుంది. అదృష్టం ఎప్పుడూ వారి వెన్నంటే ఉంటుంది. ఈ చెట్టు ఆకులు యాంటీ బాక్టీరియ‌ల్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. వాటిని జ్యూస్ రూపంలో తీసుకుంటే .. జ‌లుబు, గొంతునొప్పి వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉపశమనం పొందుతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story