నీటిలో మైక్రోప్లాస్టిక్‌ను తొలగించే ‘పెన్ను’ తయారుచేసిన విద్యార్థులు!

by B.Srinivas |   (  Updated:2026-01-25 15:31:23  IST  )

నీటిలోని మైక్రోప్లాస్టిక్‌ను తొలగించే పెన్నును టెక్సాస్ విద్యార్థులు తయారుచేశారు.

నీటిలో మైక్రోప్లాస్టిక్‌ను తొలగించే ‘పెన్ను’ తయారుచేసిన విద్యార్థులు!
X

దిశ, ఫీచర్స్: టెక్నాలజీలో యువతరం దూసుకుపోతుంది. కొత్త కొత్త ఆవిష్కరణలతో జెన్‌జీ అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి పర్యవరణంలోనూ సంచలనాత్మక మార్పులు క్రియేట్ చేయొచ్చని ఇప్పటికే రుజువు చేయగా.. తాజాగా నీటిలోని మైక్రోప్లాస్టిక్‌ను తొలగించే సాంకేతిక పరికరాన్ని టెక్సాస్ విద్యా్ర్థులు తయారు చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. పెన్నును పోలివుండే దీనికి ‘అల్ట్రాసోనిక్ మైక్రోప్లాస్టిక్ ఫిల్ట్రేషన్’ అని పేరుపెట్టారు. అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన జస్టిన్ హువాంగ్, విక్టోరియా తాగు నీటిలోని అత్యంత ప్రమాదకరమైన మైక్రోప్లాస్టిక్స్‌ను తొలగించే ఎలక్ట్రానిక్ డివైజ్‌ను కనిపెట్టగా ఇది మురుగునీటిలోనూ సమర్థవంతంగా పనిచేస్తోంది. ఈ సాంకేతికత భవిష్యత్తులో మన ఇళ్లలోనూ, పెద్ద పెద్ద వాటర్ ఫిల్టర్ ప్లాంట్లలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని నిపుణులు చెబుతున్నారు.

ఎలా పనిచేస్తుంది?
నీటిలో కంటికి కనిపించని మైక్రో ప్లాస్టిక్‌ను తొలగించడానికి Acoustic Force అనే ఫార్ములాను అప్లై చేశారు. ఈ పరికరంలోని ధ్వని తరంగాల(Acoustic Forces)ను నీటిలోకి పంపించగానే.. ఇవి వాటర్‌లో మైక్రో ప్లాస్టిక్ కణాలపై ఒత్తిడి చేయడంతో చెత్తంతా ఒకేచోట చేరుతుంది. అనంతరం ప్లాస్టిక్ ఒక ముద్దలాగా ఏర్పడగానే సులభంగా తొలగించి స్వచ్ఛమైన నీటిని వేరు చేస్తారు. ఈ ప్రక్రియలో ఎలాంటి ఫిల్టర్లు, పైపులు, మోటార్లతో అవసరం లేదని, దీనినుంచి ఎలాంటి సౌండ్ కూడా రాదని స్టూడెంట్స్ వివరించారు. దీనిని పెద్దమొత్తంలో వినియోగిస్తే పట్టణాలకు సరఫరా అయ్యే వాటర్‌ను క్లీన్ చేయొచ్చు. బట్టలనుంచి వచ్చే మైక్రో ఫైబర్స్ డ్రైనేజీలో కలవకుండా చేసి, ఫ్యాక్టరీలనుంచి వచ్చే వేస్ట్ వాటర్‌ను పర్యావరణహితంగా మార్చుకోవచ్చని తెలిపారు.

ప్రతిష్టాత్మక అవార్డు:
ఈ ఇద్దరు స్టూడెంట్స్ తమ పరిశోధనకుగానూ ప్రతిష్టాత్మకమైన రీజెనెరాన్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్ అందించిన ‘Gordon E. Moore Award’అవార్డుల్లో మొదటి బహుమతి గెలుచుకున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రీ-కాలేజీ సైన్స్ ఫెయిర్ కాగా దాదాపు వీరికి రూ.50 లక్షల ప్రైజ్ మనీ లభించింది.

Next Story