- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యూర్ డెవలప్మెంట్‌కు హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్
క్యూర్‌కు 3D.. ప్యూర్‌కు 2D.. మాస్టర్ ప్లాన్స్ రూపొందిస్తున్న హెచ్ఎండీఏ.. త్వరలో ఆర్ఎఫ్పీ నోటిఫికేషన్

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్)పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. క్యూర్‌కు ప్రత్యేక చట్టంతోపాటు ప్రత్యేక మాస్టర్ ప్లాన్ తీసుకురావాలని నిర్ణయించింది. క్యూర్ పరిధిలో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్, హైరైజ్డ్ బిల్డింగ్స్ రావడంతో ‘త్రీడీ మాస్టర్ ప్లాన్’ చేయాలనుకుంటోంది. ఈ బాధ్యతలను హెచ్ఎండీఏకు అప్పగించింది.
హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్
హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పరిధిలో ఇప్పటికే హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్-2050 రూపకల్పన తుది దశకు చేరుకుంది. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఎకానమిక్ డెవలప్మెంట్ ప్లాన్(ఈడీపీ), కంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్(సీఎంపీ), బ్లూ, అండ్ గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్‌లకు నివేదికలను రూపొందించారు. వీటిలో ముఖ్యంగా ప్రజా రవాణాకు సంబంధించిన మొబిలిటీ ప్లాన్ కీలకంగా మారింది. కంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్(సీఎంపీ)-2050 అమలు చేయడానికి రూ.4లక్షల కోట్లు అవసరమని హెచ్ఎండీఏ అంచనా వేసింది. దీంతోపాటు 2050 వరకు ప్రజా రవాణాను మెరుగుపర్చడానికి చేపట్టాల్సిన ప్రాజెక్టులపై లీ అసోసియేట్స్ కీలక అంశాలను సిపార్సు చేసింది. దీంతోపాటు ఎకానమిక్ డెవలప్మెంట్ ప్లాన్(ఈడీపీ)ని సైతం హెచ్ఎండీఏ ఫైనల్ చేసింది. బ్లూ, గ్రీన్ ప్లాన్‌కు సంబంధించిన నివేదికను ఫైనల్ చేయాల్సి ఉంది. అయితే హెచ్ఎండీఏ పరిధిలో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్), పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ(ప్యూర్)లు ఉన్నాయి. క్యూర్‌కు త్రీడీ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ప్యూర్‌కు మాత్రం 2డీ మాస్టర్ ప్లాన్ రూపొందించాలనే డెసిషప్ తీసుకుంది.
క్యూర్‌కు 3డీ మాస్టర్ ప్లాన్..
హైదరాబాద్‌ను 2050 నాటికి స్మార్ట్ సిటీగా మార్చేందుకు హెచ్‌ఎండీఏ అత్యాధునిక సాంకేతికతతో కొత్త మహా ప్రణాళికను రూపొందిస్తోంది. ముఖ్యంగా గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ చిత్రాలు, ఏఐ (కృత్రిమ మేధస్సు) ఉపయోగించి రూపొందించే 3D మ్యాపింగ్ విధానం ద్వారా నివాస, పారిశ్రామిక, గ్రీన్ జోన్‌లను స్పష్టంగా విభజించి.. వందకుపైగా జోన్‌లతో అభివృద్ధిని ప్లాన్ చేస్తున్నారు. కాగా 3డీ మాస్టర్ ప్లాన్‌లోని ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి.
- 3D మ్యాపింగ్ మరియు GIS (Geographic Information System) ఉపయోగించి క్షేత్రస్థాయి పరిస్థితులను ఖచ్చితంగా మ్యాప్ చేస్తారు.
- మారుతున్న నగర అవసరాలకు అనుగుణంగా 2050 వరకు మౌలిక సదుపాయాల అభివృద్ధి.
- పారిశ్రామిక, వాణిజ్య, నివాస, గ్రీన్ జోన్, రవాణా కనెక్టివిటీని స్పష్టంగా గుర్తిస్తారు.
- ఈ ప్లాన్ ద్వారా బిల్డింగ్ అనుమతులు, ఎన్ఓసీ (NOC) ప్రక్రియలను ఆన్‌లైన్‌లో త్వరగా పొందే అవకాశం ఉంటుంది.
త్వరలో ఆర్ఎఫ్పీ
హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీకి మాస్టర్ ప్లాన్-2050ను రూపొందించినా హెచ్ఎండీఏ…క్యూర్‌కు ప్రత్యేకంగా త్రీడీ మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి కసరత్తు చేస్తున్నది. ఇందుకు సంబంధించిన ఏఏ కంపోనెంట్స్ ఉండాలి? ఏ ప్రాతిపదికన ప్లాన్ రూపొందించాలనే అంశాలతో కూడిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ) నోటిఫికేషన్ జారీచేయడానికి హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ కన్సల్టెన్సీల కోసం త్వరలోనే ఆర్ఎఫ్పీ నోటిఫికేషన్ జారీచేయనున్నారు.






