Digital Marketing : ఏం నడుస్తోంది బ్రో.. ! ఇంకేంది అంతా డిజిటల్ మార్కెటింగ్.. With AI..!!

by Javid Pasha |   (  Updated:2025-08-20 07:50:40  IST  )

ఇప్పుడు ఏఐ(AI) ఆధారిత డిజిటల్ మార్కెటింగ్‌కు విస్తరిస్తోంది. చాట్‌బాట్‌లు, రోబోట్లు, ఏఐ ఆధారిత కంటెంట్ క్రియేటర్లు, డేటా విశ్లేషణలు ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి.

Digital Marketing : ఏం నడుస్తోంది బ్రో.. ! ఇంకేంది అంతా డిజిటల్ మార్కెటింగ్.. With AI..!!
X

దిశ, ఫీచర్స్ : ఏం నడుస్తోంది బ్రో.. అంటే.. ‘ఇంకేంది అంతా డిజిటల్ మార్కె‌టింగ్ విత్ ఏఐ(AI).. ఇంకా సెర్చ్ ఇంజిన్ ఆప్టమైజింగ్.. ఎక్సెట్రా ఎక్సెట్రా..’ అంటోంది ఆధునిక యువత. ఈ మార్పు తాజా సాంకేతిక పరిణామాలకు, పరిస్థితులకు అద్దం పడుతున్నదని మనం కూడా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చి మొత్తం ప్రపంచమే మన చేతుల్లో ఇమిడిపోగా.. ఇటీవల ఏఐ ప్రవేశంతో ఆధునిక సాంకేతికత సరికొత్త అవకాశాలను క్రియేట్ చేస్తోంది. అలాంటి వాటిలో డిజిటల్ మార్కెటింగ్ కూడా ఒకటి. మార్కెటింగ్ అంటే ఏవో ఉత్పత్తి సంస్థలకు మాత్రమే అవసరమని ఇన్నాళ్లు అనుకునే వాళ్లం. కానీ ట్రెండ్ మారింది గురూ.. ! ఇప్పుడు ప్రతీ వ్యక్తికీ, ప్రతీ సంస్థకు కూడా అది అవసరం. మనుగడకు చక్కటి మార్గం.

మీరొక వ్యక్తిగా ఫేమస్ కావాలంటే కూడా డిజిటల్ మార్కెటింగ్ అవసరం.. అంటే.. వివిధ సోషల్ మీడియా వేదికల్లో, ఆన్‌లైన్ సైట్లలో మీ గురించి మీరు చెప్పుకుంటే తప్ప ఎవరూ గర్తించరు. మీ టాలెంట్ ఏందో అక్కడ ప్రదర్శిస్తే తప్ప నేటి యుగంలో అత్యధిక మందికి చేరుకోదు. ముఖ్యంగా ఏఐ హవా నడుస్తున్న ఈ రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ ట్రిక్స్ తెలియకుంటే వెనుకబడినట్టే అంటున్నారు సాంకేతిక నిపుణులు. మీ సేవలు, నైపుణ్యాలు, బ్రాండ్లు, ఇలా.. టాలెంట్ ఏదైనా సరే.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి రీచ్ అయ్యే చక్కటి షార్ట్‌కట్ వే ఏదైనా ఉందంటే దటీజ్ డిజిటల్ మార్కెటింగ్.

డిజిటల్ మార్కెటింగ్ రకాలు

1. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO) : మీరు మీ గురించి మీరు లేదా మీరు చేసే పని గురించి, మీరు ఏదైనా పరిశ్రమకు ఫౌండర్ అయితే దాని ఉత్పత్తుల గురించి ప్రపంచానికి తెలియ జేయడానికి, సేల్ చేయడానికి ఏదో ఒక ఆన్ లైన్ వేదిక అవసరం. చాలామంది సొంత వెబ్‌సైట్‌లను కలిగి ఉంటారు. అయితే గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లలో మీ వెబ్‌సైట్ లేదా మీ సోషల్ మీడియా పోస్ట్ వంటివి హై ర్యాంకింగ్‌లో చూపించడానికి కంటెంట్, కీవర్డ్స్, టెక్నికల్ అంశాలను ఆప్టిమైజ్ చేయడమే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్.

2. సోషల్ మీడియా మార్కెటింగ్ : ప్రస్తుతం ఫేస్ బుక్, ఎక్స్, ఇన్ స్టాగ్రామ్, లింక్డ్ ఇన్ వంటి ప్లాట్ ఫారమ్‌లలో కంటెంట్ క్రియేట్ చేస్తూ, షేర్ చేస్తూ తమ ఉత్పత్తులు, వ్యక్తిగత అంశాలు, బ్రాండ్ల గురించి తెలిజేయడం, అవగాహన పెంచడం వంటివి కామన్ అయిపోయింది. ఇది చేయగలిగడమే భవిష్యత్తులో ఆయా మీకు మంచి అవకాశాలను క్రియేట్ చేసే చాన్స్ ఉంటుంది.

3. పే-పర్-క్లిక్ (PPC) యాడ్స్ : గూగుల్ యాడ్స్ లేదా సోషల్ మీడియా యాడ్స్ ద్వారా టార్గెటెడ్ ప్రకటనలు చేయడం, క్లిక్‌కు ఖర్చు చెల్లించడం కూడా ఇప్పుడొక ఉపాధి, ఉద్యోగ అవకాశంగా విస్తరిస్తున్నదని నిపుణులు చెబుతున్నారు.

4. కంటెంట్ మార్కెటింగ్ : బ్లాగ్స్ క్రియేట్ చేయడం, వీడియోలు, ఇన్ఫోగ్రాఫిక్స్ ఇ- బుక్స్ వంటి వాల్యూబుల్ కంటెంట్‌ను క్రియేట్ చేసి ప్రేక్షకులను, వీక్షకులను ఆకర్షించడం

5. ఇమెయిల్ మార్కెటింగ్ : యూజర్లకు లేదా మీరు టార్గెట్‌గా భావించే వ్యక్తులకు వ్యక్తిగతంగా ఇమెయిల్స్ పంపడం కూడా డిజిటల్ మార్కెటింగ్‌లో అంతర్భాగమే. పర్సనలైజ్ చేసిన ఇమెయిల్స్ ద్వారా ఆఫర్లు, అప్‌డేట్స్ వంటివి పంపవచ్చు.

6. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో కలిసి బ్రాండ్‌ను కలిసి బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం. అలాగే ఇతరుల ద్వారా ఉత్పత్తులను ప్రమోట్ చేయించి, విక్రయాలపై కమీషన్ చెల్లించే అఫిలియేట్ మార్కెటింగ్ కూడా డిజిటల్ మార్కెటింగ్ కిందకే వస్తుంది.

డిజిటల్ మార్కెటింగ్ ప్రయోజనాలు

* ఎక్కువ మందికి రీచ్ అవ్వొచ్చు. గ్లోబల్ ఆడియన్స్‌ను చేరుకోవచ్చు

*ఫలితాలు అంచనా వేయడం (Measurable results) : ప్రకటనలు, కంటెంట్, క్లిక్స్, కన్వర్షన్స్ వంటివి ట్రాక్ చేయవచ్చు.

*తక్కువ ఖర్చు - ఎక్కువ ప్రయోజనాలు : సాధారణ, సంప్రదాయ మార్కెటింగ్‌తో పోలిస్తే రవాణా, వివిధ వ్యక్తులకు చెల్లింపులు తదితర ఖర్చులు ఉండవు. కాబట్టి తక్కువ ఖర్చులో ఎక్కువ మందిని రీచ్ అవ్వొచ్చు. ఉత్పత్తులను, బ్రాండ్‌లను ప్రమోట్ చేయవచ్చు.

*టార్గెటెడ్ అప్రోచ్ : నిర్దిష్ట వయస్సు, ప్రాంతం, దేశం, ఆసక్తుల ఆధారంగానూ ఆడియన్స్‌ను టార్గెట్ చేయవచ్చు.

ఏఐతో మరింత ఊపు

ఇప్పుడు ఏఐ(AI) ఆధారిత డిజిటల్ మార్కెటింగ్‌కు విస్తరిస్తోంది. చాట్‌బాట్‌లు, రోబోట్లు, ఏఐ ఆధారిత కంటెంట్ క్రియేటర్లు, డేటా విశ్లేషణలు ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి. ముఖ్యంగా ఏఐ ఆధారిత షార్ట్ ఫార్మ్ వీడియోలు, రీల్స్, లైవ్ స్ట్రీమింగ్స్ కూడా పాపులర్ అవుతున్నాయి. అంతేకాకుండా వాయిస్ సెర్చ్ ఆప్టిమైజేషన్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఇక్కడ సిరి, అలెక్సా, గూగుల్ జెమినీ వంటివి ఇందుకు చక్కటి ఉదాహరణ. భవిష్యత్ జాబ్ మార్కెట్ అంతా డిజిటల్ మార్కెటింగ్‌పైనే ఆధారపడి ఉంటుందని, కాబట్టి ఈ స్కిల్స్ తప్పనిసరి అని కూడా నిపుణులు చెబుతున్నారు.

Next Story