- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Microchip : చేతిపై మైక్రోచిప్ స్టిక్కర్.. రోజువారీ పనుల్లో ఉపయోగానికి సాంకేతిక నిపుణుల కొత్త ఆవిష్కరణ..!
నియర్ ఫీల్డ్ మైక్రోచిప్‌లను చేతివేళ్లపైనో, గోర్లపైనో, అర చేతిలోనో, చేతి వెనుక భాగంపైనో, మీ షర్ట్ బటన్‌లకో ఇలా ఎక్కడైనా అతికించుకోవచ్చు.

దిశ, ఫీచర్స్ : మీరు ఎక్కడైనా షాపింగ్ చేసినప్పుడు ఆన్‌లైన్ పేమెంట్ చేయాలంటే ఏం చేస్తారు? స్మార్ట్ ఫోన్లు దగ్గర ఉండాల్సిందే. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు లేదా జీపే, ఫోన్ పే, వంటి యూపీఐ సర్వీసులను ఉపయోగిస్తారు. కానీ ఇకముందు ఇలాంటి అవసరం లేకుండానే, ఇంతకంటే సింపుల్‌గానూ పేమెంట్ చేయవచ్చు అంటున్నారు సాంకేతిక నిపుణులు. జస్ట్ మీ చేతిని క్యూ ఆర్ కోడ్ వైపు ఇలా చూపితే చాలు. పేమెంట్లు అవే జరిగిపోతాయి. ఎందుకంటే అలాంటి సేవలు అందించగల నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్‌ఎఫ్‌సీ) మైక్రోచిప్‌లను స్వీడన్ సాంకేతిక నిపుణులు డెవలప్ చేశారు. అవి ఏ విధంగా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం.
నియర్ ఫీల్డ్ మైక్రోచిప్‌లను జస్ట్ మీ చేతివేళ్లపైనో, గోర్లపైనో, అర చేతిలోనో, చేతి వెనుక భాగంపైనో, మెడపైనో, మీ షర్ట్ బటన్‌లకో ఇలా ఎక్కడైనా అతికించుకోవచ్చు. అవసరమైనప్పుడు వీటి ద్వారా కేవలం ఆన్‌లైన్ పేమెంట్లు చేయవచ్చు. అంతేకాకుండా ఇతర పలు రకాల సేవలను కూడా పొందవచ్చు. ఉదాహరణకు జిమ్ సెంటర్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు, కార్లు ఇలా ఎక్కడైనా అక్కడ డోర్లు లాక్ చేయడానికి, ఓపోన్ చేయడానికి వీటిని ఉపయోగించుకునే వీలుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం స్వీడన్ దేశంలో వేలాది మంది నియర్ ఫీల్డ్ మైక్రో చిప్‌లను వివిధ సేవల్లో ఉపయోగించుకుంటున్నారు. భవిష్యత్తులో అన్ని దేశాల్లోనూ ఈ సేవలు విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే అదే సందర్భంలో ప్రైవసీ పరమైన సవాళ్లు ఎదరురు కావచ్చుననే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. కాగా కంఫర్టబుల్, ప్రైవసీ మధ్య బ్యాలెన్సింగ్ పాటించే సాంకేతిక పరిష్కారాలను సైతం కనుగొనడం ద్వారా అలాంటి ఇబ్బందులను అధిగమించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఇది సక్సెస్ అయితే జస్ట్ ఒక మైక్రోచిప్ ఆన్‌లైన్ ఆధారిత అన్ని సేవల్లో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదంటున్నారు నిపుణులు. Link






