సోలార్ ప్యానెల్ ఇక చల్ల చల్లగా.. హైడ్రోజెల్ కోటింగ్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు

by Javid Pasha |

ట్రాన్స్‌పరెంట్ హైడ్రోజెల్ కోటింగ్‌ వల్ల సోలార్ ప్యానెల్ మెయింటెనెన్స్ పీరియడ్ పెరగుతుంది. అగ్నిప్రమాదాల ప్రమాదాల రిస్క్ తగ్గుతుంది.

సోలార్ ప్యానెల్ ఇక చల్ల చల్లగా.. హైడ్రోజెల్ కోటింగ్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు
X

దిశ, ఫీచర్స్ : విద్యత్ అవసరాలకో, గృహ ఉపయోగాలకో సోలార్ ప్యానెల్ వాడేవారికొక గుడ్ న్యూస్.. ఏంటంటే.. అందులో అధిక ఉష్ణోగ్రత కలిగిన హాట్‌స్పాట్స్ (hotspots) సమస్యను పరిష్కరించేందుకు హాంగ్ కాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ, అలాగే తియాన్‌జిన్ యూనివర్సిటీ అండ్ హెబీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలకు చెందిన శాస్త్రవేత్తలు ఒక పారదర్శక (transparent) హైడ్రోజెల్ కోటింగ్‌ను డెవలప్ చేశారు. ఇది సోలార్ ప్యానెల్ హాట్‌స్పాట్ల ఉష్ణోగ్రతలను 16°C వరకు తగ్గించడమే కాకుండా దాని సామర్థ్యాన్ని సైతం పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఏయే ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం పదండి!

ట్రాన్స్‌పరెంట్ హైడ్రోజెల్ కోటింగ్‌ వల్ల సోలార్ ప్యానెల్ మెయింటెనెన్స్ పీరియడ్ పెరగుతుందని పరిశోధనలో తేలింది. అంతేకాకుండా అగ్నిప్రమాదాల ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఈ టెక్నాలజీ వాడటంతో ప్యానెల్‌ల పవర్ అవుట్‌పుట్ 13% వరకు పెరుగుతుంది. హైడ్రోజెల్ కోటింగ్ నీటిని గ్రహించే హైడ్రోజెల్‌తో పాటు కాటన్ థ్రెడ్‌లు, అలాగే సన్నని టెఫ్లాన్‌లాంటి పొరను కలిగి ఉంటుంది. ఇది శీతలీకరణను సమానంగా, దీర్ఘకాలికంగా అందిస్తుంది. హాట్‌స్పాట్‌ల వల్ల వచ్చే పవర్ నష్టాల్లో సుమారు 50% వరకు తిరిగి పొందవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా భవనాలపై ఏర్పాటు చేసే సోలార్ సిస్టమ్స్(BIPV) అండ్ రూఫ్‌టాప్ సిస్టమ్‌లకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అయితే కోటింగ్ వల్ల సోలార్ ప్యానెల్ ధరలు సుమారు 10.7% పెరుగుతాయి. అయినప్పటికీ ఎక్కువ సూర్యరశ్మి ఉండే ప్రాంతాల్లో, విద్యుత్ ధరలు ఎక్కువగా ఉన్న చోట్ల 3 నుంచి 4.5 సంవత్సరాల్లోనే ఈ అదనపు ఖర్చు తిరిగి వసూలు అవుతుందని పరిశోధకుల అంచనా. ప్రస్తుతం ఈ టెక్నాలజీని పెద్ద స్థాయిలో రియల్-వరల్డ్ టెస్టింగ్‌కు సిద్ధం చేస్తున్నారు. త్వరలో వాణిజ్యాంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

Next Story