- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హే ఫీవర్ నివారణలో టెక్నాలజీ.. అందుబాటులోకి కొత్త డివైజ్‌లు!
హే ఫీవర్ నివారణ కోసం సాంకేతిక నిపుణులు కొత్త డివైజ్‌లను తయారు చేస్తున్నారు. ఇవి ముక్కు లోపలి కణజాలాలకు సున్నితమైన లైట్, హీట్ లేదా మైక్రో స్టిమ్యులేషన్ ఇవ్వడం ద్వారా రిలీఫ్ అందిస్తాయి.

దిశ, ఫీచర్స్ : అలర్జిక్ రైనైటిస్ (హే ఫీవర్) వచ్చినప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలిసిందే. రోగ నిరోధక వ్యవస్థ అతి సున్నితంగా స్పందించడం వల్ల వచ్చే సమస్య ఇది. దుమ్ము, దూళి, పుప్పొడి, జంతు రోమాలు వంటి సాధారణ అలర్జన్లు ముక్కులోకి వచ్చినప్పుడు కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భంలో రోగ నిరోధక కణాలు(Immune cells) హిస్టమిన్‌ను విడుదల చేసి, వాపు, దురద, తుమ్ములు, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలను కలిగిస్తాయి. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రస్తుతం కొత్త మెడికల్ డివైజ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. అవేమిటి? ఏ విధంగా పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తగా అభివృద్ధి చేస్తున్న కొత్త డివైజ్‌లు ముక్కు లోపలి కణజాలాలకు సున్నితమైన లైట్, హీట్ లేదా మైక్రో స్టిమ్యులేషన్ ఇవ్వడం ద్వారా రిలీఫ్ అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని రోజుకు కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఉపయోగించాలి. ఇవి నాసికా మ్యూకోసా(Nasal mucosa)ను శాంత పరచి, రోగ నిరోధక స్పందనను తగ్గించి, హిస్టమిన్ విడుదలను నియంత్రిస్తాయి. ఫలితంగా శ్వాస సులభం అవుతుంది. తుమ్ములు, కంజెషన్ తగ్గుతాయి. ప్రారంభ అధ్యయనాలు దీర్ఘకాలిక అలర్జీ ఉన్నవారికి మంచి ఉపశమనం ఇచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
కొత్త నాసల్ స్టిమ్యులేషన్ మెడికల్ డివైజ్‌లు కేవలం రిలీఫ్ కోసం మాత్రమే తప్ప మెడికేషన్ స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయవని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ నాన్-డ్రగ్ టెక్నాలజీలు చిన్న రోజువారీ సెషన్లతో, తక్కువ సైడ్ ఎఫెక్టులతో అలర్జీలను సులభంగా నిర్వహించే మంచి ఎంపికగా మారవచ్చు అంటున్నారు. అయితే ఇవి మొత్తం మూడు రకాలుగా ఉంటున్నాయి. లైట్ థెరపీ, మైక్రో-స్టిమ్యులేషన్ (మైక్రోకరెంట్), హీట్ (రేడియోఫ్రీక్వెన్సీ) ఆధారిత స్టిమ్యులేషన్. ఇవి ముక్కు లోపలి కణజాలాలను లక్ష్యంగా చేసుకుని వాపు, హిస్టమిన్ విడుదలను తగ్గించి తుమ్ములు, ముక్కు దిబ్బడ, దురద వంటి లక్షణాలు నియంత్రిస్తాయి.






