- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూ జనరేషన్ కిచెన్ రోబోస్.. పనులన్నీ అవే చేసిపెడతాయ్..!
హౌస్‌హోల్డ్ రోబోల ప్రధాన లక్ష్యం ఆధునిక మానవుల సమాయాన్ని ఆదా చేయడం, సౌకర్యాన్ని కల్పించడమేనని నిపుణులు అంటున్నారు.

దిశ, ఫీచర్స్ : ఆధునికత పెరిగేకొద్దీ మానవులు బిజీ ఐపోతున్నారు. ఉరుకులు, పరుగుల జీవితంలో ఇండ్లల్లో ఎక్కువసేపు గడిపే సమయం కూడా దొరకడం లేదు కొందరికి. మరికొందరికి ఇంటి పనులు, వంటపనులు కూడా భారంగా మారిపోతున్నాయి. కాగా ఇలాంటి పరిస్థితులను మేనేజ్ చేయడంలో సహాయపడగల న్యూ జనరేషన్ హౌస్‌హోల్డ్ రోబోట్స్‌ను అభివృద్ధి చేయడంలో కంపెనీలు ఫుల్ ఫోకస్ పెట్టాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. అలాంటి హౌస్ హోల్డ్ రోబోలవల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనుషుల్లాగే పనుల నిర్వహణ
కూరగాయలు తరగడం, మసాలా కలపడం, వంట చేయడం మొదలు కొని డిష్ వాషింగ్ వరకు అన్ని రోజువారీ పనులను ఆటోమేటిగ్గా చేయగలిగే రోబోలను సాంకేతిక నిపుణులు డెవలప్ చేస్తున్నారు. ఇవి అధునాతన సెన్సర్లు, ఏఐ-పవర్డ్ విజన్ సిస్టమ్‌లు, అలాగే కచ్చితమైన రోబోటిక్ ఆర్మ్స్‌తో ఉండే ఈ మరయంత్రాలు గిన్నెలు, స్పూన్లు, కత్తులు తదితర వంటపాత్రలను గర్తించి అచ్చం మనుషుల్లాగే వంట చేయగలవు. కుకింగ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ను అనుసరించి పనిచేస్తాయి. అంటే ఈ హౌస్‌హోల్డ్ రోబోలు వంటగదిని నిజమైన స్మార్ట్ కిచెన్‌గా మార్చేస్తాయని నిపుణులు అంటున్నారు.
సురక్షిత డిజైన్లలో..
హౌస్‌హోల్డ్ రోబోల ప్రధాన లక్ష్యం ఆధునిక మానవుల సమాయాన్ని ఆదా చేయడం, సౌకర్యాన్ని కల్పించడమేనని నిపుణులు అంటున్నారు. చాపింగ్, స్టీరింగ్, క్లీనింగ్ వంటి పనులు ఏఐ ఆధారిత రోబోలు చేయడం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. అలాగే ఏఐ విజన్ వ్యవస్థల ద్వారా రోబోలు ఏ పదార్థం తీసుకోవాలో, ఎంత సాఫ్ట్‌గా పట్టుకోవాలో అర్థం చేసుకుంటాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు (ఉదా: Samsung, Moley Robotics) ఇలాంటి రోబోలను పరీక్షిస్తున్నాయని, ఇంటి వాతావరణానికి అనుగుణంగా, సురక్షితంగా డిజైన్ చేస్తున్నాయని సాంకేతిక నిపుణులు అంటున్నారు.
సమయం ఆదా..
భవిష్యత్తులో రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత అభివృద్ధి చెందితే.. ఇక దాదాపు ప్రతీ ఇంటిలో, హోటల్స్‌లో ఏఐ ఆధారిత చెఫ్ రోబోలు సహాయకులుగా ఉంటాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదంటున్నారు నిపుణులు. దీంతో వంట చేయడం మరింత కంఫర్ట్‌గా మారుతుంది. ముఖ్యంగా న్యూజనరేషన్‌కు ఇవి సహాయపడే అవకాశం ఎక్కువ. ప్రస్తుతం హౌస్‌హోల్డ్ రోబోలు ఖరీదైనవి కావచ్చు. కానీ టెక్నాలజీ అభివృద్ధితో ధరలు తగ్గి, సాధారణ మధ్య తరగతి ప్రజల ఇండ్లలోకి కూడా భవిష్యత్తులో ‘AI- ఆధారిత వంట రోబోలు’వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మొత్తంగా ఈ కొత్త తరం రోబోలు మన రోజువారీ జీవితాన్ని సులభతరం చేసి, శక్తి, సమయం ఆదా చేస్తాయని చెబుతున్నారు.






