- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పబ్లిక్ ప్లేస్‌లో సిగరెట్ తాగితే.. ఈ డివైజ్ పొట్టు పొట్టు తిడుతుంది!
సిగరెట్ తాగేవారిని గుర్తించి తిట్టగలిగే ఒక ఏఐ ఆధారిత గాడ్జెట్‌ను బెంగుళూరుకు చెందిన ఓ యువకుడు తయారు చేశాడు.

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చాక అద్భుతాలు చేస్తోంది. అనేక విషయాల్లో మానవులకు సౌకర్యాలను కల్పిస్తోంది. ప్రతీ సమస్యను టెక్నాలజీతో ఎలా పరిష్కరించాలన్న దానిపై ఔత్సాహికులు, సాంకేతిక నిపుణులు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. తమ క్రియేటివిటీని ప్రదర్శిస్తు్న్నారు. అలాంటి మరో అద్భుతమైన ఆవిష్కరణకు తెరతీశాడు బెంగుళూరు చెందిన ఓ టెకీ (techie). పబ్లిక్ ప్లేస్‌లో సిగరెట్ కాల్చేవారిని గుర్తించి ‘తిట్టే’ ఏఐ పవర్డ్ డివైజ్‌ను తయారు చేశాడు. దీంతో నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఫొటో తీసి గుర్తిస్తుంది
ధూమపానం ఆరోగ్యానికి హానికరమనే విషయం తెలిసిందే. సిగరెట్ కేవలం తాగేవారికే కాదు. వారు వదిలే పొగవల్ల చుట్టు పక్కలవారికి కూడా నష్టం. ఇది తరచుగా గమనించిన పంకజ్ అనే టెకీ ‘పబ్లిక్‌లో సిగరెట్ కాల్చడం చూస్తే చాలా అసహ్యం’ అనే తన మనసులోని మాటను డైరెక్ట్‌గా చెబుతూ తిట్టకుండా.. ఆ పని ఒక డివైజ్ ద్వారా చేస్తే ఎలా ఉంటుందోనని ఆలోచించాడు. ఈ ఆలోచనలో నుంచే ఒక సరికొత్త ఆవిష్కరణకు మార్గం ఏర్పడింది. సిగరెట్ తాగేవారిని గుర్తించి హెచ్చరిస్తూ తిట్టగలిగే ఒక ఏఐ ఆధారిత గాడ్జెట్‌ను అతను తయారు చేశాడు. ఇది ఒక రాస్పెబెర్రీపై మీద నడుస్తుంది. కెమెరా ద్వారా ప్రతీ సెకనుకు చుట్టు పక్కల సిగరెట్ తాగేవారిని ఫొటో తీసి, YOLOv8 + MediaPipe AI మోడల్స్‌ను ఉపయోగించి ఆ వ్యక్తిని, సిగరెట్‌ను, స్మోకింగ్ జెస్చర్‌ను రియల్-టైమ్‌లో గుర్తిస్తుంది. ఆ వెంటనే తిట్టడం స్టార్ట్ చేస్తుంది.
ఏఐ సహాయంతో వర్క్..
సిగరెట్ తాగేవారిని ‘తిట్టే’ ఈ ఏఐ పవర్డ్ డివైజ్‌లో స్మోకింగ్ చేస్తున్నవారిని గుర్తించగానే రెండు ఆడియోలు ప్లే అవుతాయి. ముందు శిశువు ఏడ్చినట్లు (The sound of the first baby's cry) శబ్దం, ఆ తర్వాత అమ్మమ్మ తిట్టినట్టు(బెంగుళూరు లోకల్ లాంగ్వేజ్-కన్నడలో) ఆడియోలు ప్లే అవుతాయి. ఇవి Sarvam AI సహా సాయంతో తయారు చేయబడ్డాయి. ఇక తిట్టే డివైజ్ ప్రస్తుతం ప్రొటోటైప్ స్టేజ్‌లో ఉండగా.. పంకజ్ దానిని ప్రస్తుతం త్రీడీ (3D) ప్రింటెడ్ పోర్టబుల్ వెర్షన్ కూడా తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నాడు. దీనికి సంబంధించిన వివరాలను పంకజ్ ఫిబ్రవరి11, 2026న X వేదికగా షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అతనికి అవార్డు ఇవ్వాలని, సోషల్ రిఫార్మ్ కోసం ఈ టెక్నాలజీ ఉపయోగకరమైందని చెబుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇది అతని వ్యక్తిగత ప్రాజెక్ట్ అయినప్పటికీ.. పబ్లిక్ స్మోకింగ్‌పై సృజనాత్మక, సాంకేతిక పరిష్కారమని ప్రజా అవసరాలకు దానిని ఉపయోగించుకోవడంపై ఆలోచించాల్సిన అవసరం ఉందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్‌లో ఇది చాలా అవసరమని అభిప్రాయపడుతున్నారు.






