GPT-Rosalind : బయాలజీ, డ్రగ్ డిస్కవరీకి OpenAI ప్రత్యేక మోడల్!

by Javid Pasha |   (  Updated:2026-05-19 11:08:03  IST  )

ప్రస్తుతం పూర్తిగా ఏఐ ఆవిష్కరించిన ఏ డ్రగ్ కూడా ఫేస్-3 ట్రయల్స్ పూర్తి చేయలేదు. కానీ GPT-Rosalind ఎర్లీ-స్టేజ్ రీసెర్చ్ ఖర్చును, సమయాన్ని తగ్గిస్తుందని సాంకేతిక నిపుణులు అంటున్నారు.

GPT-Rosalind : బయాలజీ, డ్రగ్ డిస్కవరీకి OpenAI ప్రత్యేక మోడల్!
X

దిశ, ఫీచర్స్ : ఓపెన్ ఏఐ (OpenAI) ఇటీవల జీపీటీ రొసాలిండ్ (GPT-Rosalind) అనే కొత్త డొమైన్-స్పెసిఫిక్ ఏఐ మోడల్‌ను లాంచ్ చేసింది. అయితే ఇది పూర్తిగా బయాలజీ, డ్రగ్ డిస్కవరీ & ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్ కోసం రూపొందించబడింది. డీఎన్‌ఏ స్ట్రక్చర్ ఆవిష్కరణలో కీలకపాత్ర పోషించిన Rosalind Franklin పేరు మీదీ ఈ మోడల్‌ను క్రియేట్ చేశారు. ఒక డ్రగ్ డెవలప్ చేసి మార్కెట్ తీసుకు రావడానికి 10–15 సంవత్సరాలు పడుతుంది. అలాగే క్లినికల్ ట్రయల్స్‌కు వచ్చిన 10 డ్రగ్స్‌లో కేవలం ఒకటి మాత్రమే ఆమోదం పొందుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి GPT-Rosalind డ్రగ్ డెవలప్‌మెంట్ పైప్‌లైన్‌లో ముందు దశల్లో (evidence synthesis, hypothesis generation, experimental planning, molecules-proteins-genes reasoning) సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

పార్ట్‌నర్లు, భద్రతాపరమైన జాగ్రత్తలు

అమ్జెన్ (Amgen), మోడెర్నా(Moderna), నోవో నార్డిస్క్ (Novo Nordisk), థర్మో ఫిషర్(Thermo Fisher), అలెన్ ఇన్‌స్టిట్యూట్(Allen Institute), ఎన్విడియా(NVIDIA), యుసిఎస్ఎఫ్ (UCSF) వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే దీని ఎర్లీ పార్ట్‌నర్లుగా ఉన్నాయి. అదే సందర్భంలో నోవో నార్డిస్క్ ఓపెన్ ఏఐ‌తో డ్రగ్ డిస్కవరీ, మాన్యుఫాక్చరింగ్, కమర్షియల్ ఆపరేషన్స్ అంతటా విస్తృత స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్‌నకు సంతకం చేసింది. ఈ మోడల్ యాక్సెస్ చాలా కచ్చితంగా నియంత్రబడతోంది. సేఫ్టీ, క్వాలిఫికేషన్ రివ్యూతో జెనామిక్స్, పాథోజెన్ బయాలజీలో బలమైన సామర్థ్యాలు ఉన్నందున బయోసెక్యూరిటీ రిస్క్ ఉందని పరిగణించి ఈ గేట్‌కీపింగ్ చేస్తున్నట్లు నిపుణులు అంటున్నారు.

పరిమితులు -ప్రయోజనాలు

ప్రస్తుతం పూర్తిగా ఏఐ ఆవిష్కరించిన ఏ డ్రగ్ కూడా ఫేస్ -3 ట్రయల్స్ పూర్తి చేయలేదు. కానీ GPT-Rosalind ఎర్లీ-స్టేజ్ రీసెర్చ్ ఖర్చును, సమయాన్ని కూడా తగ్గిస్తుందని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఈ ఆవిష్కరణ బయోలజీ రీసెర్చ్‌లను వేగవంతం చేసి, రేర్ డిసీజెస్‌తో బాధపడుతున్న 30 కోట్ల మందికి చికిత్సలు సులభంగా అందుబాటులోకి రావడానికి దోహదపడే అవకాశ: ఉందని నిపుణులు చెబుతున్నారు.

నానో టెక్నాలజీ.. చర్మ క్యాన్సర్ల నివారణకు స్మార్ట్ స్కిన్ ప్యాచ్‌లను అభివృద్ధి చేసిన నిపుణులు.

Next Story