నానో టెక్నాలజీ.. చర్మ క్యాన్సర్ల నివారణకు స్మార్ట్ స్కిన్ ప్యాచ్‌లను అభివృద్ధి చేసిన నిపుణులు.

by Javid Pasha |

పరిశోధకులు నానో టెక్నాలజీని ఉపయోగించి, చర్మ క్యాన్సర్ల నివారణ కోసం హీట్-యాక్టివేటెడ్ స్మార్ట్ స్కిన్ ప్యాచ్‌లను అభివృద్ధి చేశారు.

నానో టెక్నాలజీ.. చర్మ క్యాన్సర్ల నివారణకు స్మార్ట్ స్కిన్ ప్యాచ్‌లను అభివృద్ధి చేసిన నిపుణులు.
X

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అద్భుతాలు చేస్తోంది. ఇప్పటికే ఏఐ ఆధారిత సేవలు ఆయా రంగాల్లో ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇటీవల నానో టెక్నాలజీ సైతం దూసుకుపోతోంది. హైలీ టార్గెటెడ్ థెరపీల్లో ఈ సాంకేతికతను ఉపయోగించుకోవడంపై పరిశోధనలు ఊపందుకుంటున్నాయి ఇందులో భాగంగా వూహాన్ యూనివర్సిటీ & సిటీ యూనివర్సిటీ ఆఫ్ హాంగ్ కాన్ (Wuhan University&City University of Hong Kon)లకు చెందిన పరిశోధకులు స్కిన్ క్యాన్సర్లను మేనేజ్ చేయడానికి సాగే గుణం(Stretchy) గల, హీట్-యాక్టివేటెడ్ స్కిన్ ప్యాచ్‌లను అభివృద్ధి చేశారు. ఇవి మెలనోమా(చర్మ క్యాన్సర్) వంటి స్థానిక సమస్యలను శస్త్ర చికిత్స లేకుండా, సాధారణ ఔషధాల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నిర్వహించడానికి సహాయపడతాయని చెబుతున్నారు.

పనితీరు.. ఫలితాలు..

నానో టెక్నాలజీ ద్వారా లేజర్-ఇండ్యూస్డ్ గ్రాఫీన్ (LIG) వంటి మెటీరియల్స్‌ను ఉపయోగించి తయారు చేసిన ఈ స్కిన్ ప్యాచ్‌లు కాంతి లేదా తక్కువ వేడి (సుమారు 42°C) ద్వారా ప్రేరేపించబడి, కాపర్ అయాన్లను (copper ions) విడుదల చేస్తాయి. ఇవి క్యాన్సర్ కణాల డీఎన్‌ఏ దెబ్బతీసి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ద్వారా నాశనం చేస్తాయని నిపుణులు అంటున్నారు. కొత్తగా పరిశోధకులు తయారు చేసిన ప్యాచ్ సాగేగుణంతో పాటు బ్రీతెబుల్ స్కిన్ ఫ్రెండ్లీగా ఉండి అందరికీ సరిపోయేలా ఉంటుంది. తక్కువ పవర్ లేజర్ లేదా సూర్యకాంతి ద్వారా యాక్టివేట్ చేస్తే ఔషధం విడుదల అవుతుంది. ఇది ప్రభావిత ప్రాంతంపై మాత్రమే పనిచేసి, చుట్టు పక్కల ఆరోగ్యకరమైన కణాలకు అంటుకోదు. ఇన్-విట్రో& ఇన్-వైవో (Mouse) అధ్యయనాల్లో ఈ ప్యాచ్ ట్యూమర్ గ్రోత్‌ను 97% తగ్గించినట్లు తేలింది. ఇది అపోప్టోసిస్, క్యూప్రోప్టోసిస్, ఫెర్రోప్టోసిస్ వంటి బహుముఖ మరణ మార్గాలను యాక్టివేట్ చేస్తుంది.

భవిష్యత్ ప్రయోజనాలు..

ఈ విధమైన వేరబుల్ (wearable) స్కిన్ ప్యాచ్‌లు భవిష్యత్తులో ఇన్వేసివ్ శస్త్ర చికిత్సల అవసరాన్ని తగ్గించి, రోగుల రోజువారీ జీవితాన్ని తక్కువ అంతరాయంతో మేనేజ్ చేయడానికి సహాయపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. మెటీరియల్ సైన్స్‌లో కొనసాగుతున్న ఈ నానో టెక్నాలజీ ఆవిష్కరణలు ఇన్వేసివ్ శస్త్రచికిత్సల అవసరాన్ని తగ్గించి, రోగుల రోజువారీ జీవితాన్ని తక్కువ అంతరాయంతో నిర్వహించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా మెటీరియల్ సైన్స్‌లో ఈ ‘స్మార్ట్’ మెడికల్ టూల్స్ సేఫ్టీ&సమర్థతను మరింత మెరుగు పరుస్తాయి. ప్రస్తుతం ప్రీ-క్లినికల్ దశలో ఉన్న ఈ సాంకేతికత ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణకు కొత్త మార్గం చూపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

Next Story