- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tea: " టీ " ని పదే పదే వేడి చేస్తున్నారా.. అయితే, డేంజరే అంటున్న నిపుణులు
ఉరుకుల పరుగుల జీవితం ప్రజల దినచర్యను కూడా మార్చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : ఉరుకుల పరుగుల జీవితం ప్రజల దినచర్యను కూడా మార్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా, టీ విషయంలో అశ్రద్ధగా ఉంటున్నారు. " టీ " ( Tea) ని ఎప్పుడు పడితే అప్పుడు తాగుతున్నారు. మన ఇళ్ళల్లో ఒకసారి చేసిన టీ ని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతూ ఉంటారు. కానీ, ఇది మంచి పద్దతి కాదంటూ నిపుణులు చెబుతున్నారు. దీని వలన మీ ఆరోగ్యం దెబ్బతింటుంది .. తరచుగా వేడి టీ తాగడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే నష్టాలు ఏంటో ఇక్కడ చూద్దాం..
రుచిలో మార్పు: టీని పదే పదే వేడి చేసి తాగడం వలన టేస్ట్ మారుతుంది. అంతే కాకుండా సువాసన కూడా పోయి దానిలోని పోషకాలు మొత్తం తగ్గుతాయి. కాబట్టి ఒకసారి తయారు చేసిన " టీ "ని అప్పుడే తాగాలి.
ఆరోగ్యానికి హాని: పదే పదే వేడి చేసిన టీ తాగడం వలన ఆరోగ్యానికి హానికరం. అంతే కాకుండా, సూక్ష్మజీవులు పెరగడం ప్రారంభిస్తాయి. ఈ బ్యాక్టీరియా ఆరోగ్యానికి హానికరం. టీని ఇంట్లో తయారు చేయడానికి ఎక్కువ పాలు అవసరమవుతాయి. ఇది సూక్ష్మజీవులను పెంచుతుంది.
కడుపు నొప్పి: నిపుణుల చెప్పిన దాని ప్రకారం టీని మళ్ళీ మళ్ళీ వేడి చేయడం వలన పోషకాలు పూర్తిగా నాశనమవుతాయి. అలాగే, ఇలాంటి టీ ని తాగడం వలన కడుపు నొప్పి, పొట్ట సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.






