- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చర్మంపై సాంస్కృతి చిహ్నాలు.. యువతలో కొత్త టాటూ ట్రెండ్!
బైగా, రబారీ, గారో, తోడా వంటి ఆదివాసీ సమాజాల్లో శతాబ్దాలుగా ఉన్న ‘గొడ్న’ సంప్రదాయాన్ని కూడా ఆధునిక టాటూ ఆర్టిస్టులు పునరుద్ధరిస్తున్నారు.

దిశ, ఫీచర్స్ : టాటూస్.. ఇప్పుడు కేవలం ఒక సింబల్ మాత్రమే కాదు. ఫ్యాషన్ ప్రపంచంలో భాగమైపోయాయి. ఇవి వ్యక్తిత్వాన్ని, స్టైల్‌ను ప్రతిబింబిస్తాయని కూడా కొందరు చెబుతుంటారు. ఇవన్నీ ఏమో కానీ.. నేటి యువతలో అనేకమంది స్టైలిష్ లుక్స్ కోసం ఈ ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. ఒకప్పుడు చిన్న చిన్న గుర్తులు, పేర్లు, ట్రయాంగిల్స్, రెగ్యులర్ ఫ్లవర్స్ మాత్రమే టాటూల రూపంలో దర్శనమిచ్చేవి. కానీ ఇటీవల భారతీయ సంప్రదాయ కళలు, హ్యాండ్లూమ్ డిజైన్లు, ఎంబ్రాయిడరీ పద్ధుతులను పోలిన టాటూలు సైతం బాగా పాపులర్ అవుతున్నాయని ట్రెండీ ఫాలోవర్స్ అంటున్నారు. ఇంకా ఏయే రూపాల్లో ఇవి వ్యక్తం అవుతున్నాయి? యువత ఏ విధంగా భావిస్తుందో ఇప్పుడు చూద్దాం.
అందంతోపాటు సంస్కృతి, గుర్తింపు
యువత, టాటూస్ అభిమానుల ఆలోచనలకు అనుగుణంగా ఇండియన్ టాటూస్ ఆర్టిస్టులు తమ డిజైన్లను మార్చుకుంటున్నారు. ముఖ్యంగా సాంప్రదాయిక చీరలు, హ్యాండ్‌లూమ్ నమూనాలు, ఎంబ్రాయిడరీ మోటిఫ్స్‌ను స్కిన్ మీదకు తీసుకురావడం ఇప్పుడు ట్రెండ్‌గా మారుతోంది. అంతెందుకు హ్యాండ్‌లూమ్ లేబుల్ పహెర్ (Paher) వ్యవస్థాపకురాలు అంకితా కయాల్ తన ముంజేతిపై జామదాని, తంగాలియా, బాంధిని వంటి డిజైనర్ నమూనాలను టాటూ వేయించుకున్నారు. ఇలా ఎంతోమంది టాటూస్‌ను ఒక ఫ్యాషన్‌గానే కాకుండా ఆసక్తికరమైన అంశాలను మేళవిస్తూ కొత్త కళారూపంగా భావిస్తున్నారు. కేవలం అందం, స్టైల్ కోసం మాత్రమే కాకుండా గుర్తింపు, సంస్కృతి, వారసత్వం వంటి భావనలను, డిజైన్లను చర్మంపై చిరకాలం నిలిపి ఉంచడానికి సైతం ఈ టాటూస్ కళ ఉపయోగపడుతోందని పలువురు చెబుతున్నారు.
డిజిటల్ రూపంలోకి సంప్రదాయం
ఉత్సవి ఝవేరి (Utsavi Jhaveri) వంటి ఆధునిక టాటూ ఆర్టిస్టులు కర్ణాటక కసూతి, పశ్చిమ బెంగాల్ కాంతా, గుజరాత్ తంగాలియా, పంజాబ్ ఫుల్కారి వంటి సంప్రదాయ ఎంబ్రాయిడరీ నమూనాలను డిజిటల్‌గా మార్చేసి ‘Dori’ అనే కలెక్షన్‌గా తీసుకొస్తున్నారు. అంటే.. ఇది కేవలం టాటూ కాదు.. అమ్మ, అమ్మమ్మల నుంచి వచ్చిన థ్రెడ్ వంటి సంబంధాన్ని తరాల మధ్య కలిపే అద్భుతమైన కళ అని కూడా అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా సంప్రదాయ గొడ్నా (Godna) నుంచి ఆధునిక టాటూల వరకు బైగా, రబారీ, గారో, తోడా వంటి ఆదివాసీ సమాజాల్లో శతాబ్దాలుగా ఉన్న ‘గొడ్నా’ (హ్యాండ్ పోక్ టాటూలు) సంప్రదాయాన్ని కూడా ఆధునిక టాటూ ఆర్టిస్టులు పునరుద్ధరిస్తున్నారు.
జీవన ప్రతిబింబాలుగా..
‘ గొడ్నా’ టాటూ నమూనాలు ధాన్యాలు, పర్వతాలు, చేపలు, జాలరి వంటి రోజువారి జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. ఒకప్పటి కళాత్మక రూపం ఆధునిక టాటూల రూపంలో చర్మంపై అలంకారంగా మారుతున్నాయి. చీరలు, టెక్స్‌టైల్స్ వరకు విస్తరిస్తున్నాయి. ఈ ట్రెండ్ టాటూను కేవలం ఫ్యాషన్‌గా కాకుండా, సంస్కృతి, గుర్తింపు, వారసత్వాన్ని సంరక్షించే మాధ్యమంగా మారుస్తోందని నిపుణులు అంటున్నారు. దీంతో ఇప్పుడు ఎంబ్రాయిడరీ, హ్యాండ్‌లూమ్, టాటూ కళలు ఇప్పుడు ఒకే తరహా విజువల్ భాషను పంచుకుంటున్నాయి.






