- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గర్భ నిరోధకాలపై అవగాహన కల్పించే.. డాక్టర్ క్యూటరస్.!
గర్భనిరోధకాలు, సెక్స్ పట్ల ఉన్న మిథ్యలను తొలగించి ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో మార్గనిర్దేశం చేస్తోంది

దిశ, ఫీచర్స్: గర్భనిరోధకాల విషయంలో మహిళలదే బాధ్యత అన్నట్లతు చూస్తుంది సమాజం. కానీ బాధ్యత భాగస్వాములిద్దరిది కదా.? అంటోంది డాక్టర్ తనయా నరేంద్ర. ''డాక్టర్ క్యూటరస్''గా ప్రసిద్ధిగాంచిన తనయ గర్భనిరోధకాలు, సెక్స్ పట్ల ఉన్న మిథ్యలను తొలగించి ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో మార్గనిర్దేశం చేస్తోంది.
డాక్టర్ క్యూటరస్..
గర్భనిరోధకాల గురించి మాట్లాడాలంటే చాలామంది సంకోచిస్తారు. కొన్నిసార్లు మౌనంగా ఉండిపోతారు. మహిళలే ఈ బాధ్యతను మోస్తుంటారు. తమకు సంబంధం లేని విషయం అన్నట్లుగా పురుషులు పక్కకు తప్పుకుంటారు. గర్భనిరోధకం లేదా బర్త్ కంట్రోల్ ఎంచుకోవడం ఇద్దరి బాధ్యత అని అంటోంది డాక్టర్ తనయా. ఈ విషయం పట్ల సోషల్ మీడియాలో ఆమె పెద్ద కమ్యూనిటీనే నిర్మించింది. సంక్లిష్టమైన ఆరోగ్య అంశాలను సరళంగా.. సులభంగా వివరిస్తోంది. అందుకే సోషల్ మీడియాలో తనను ''డాక్టర్ క్యూటరస్'' అని ముద్దుగా పిలుచుకుంటారు జనాలు.
తనయా చెప్పే సందేశం..
గర్భనిరోధకం అందరికీ ఒకేలా సరిపోదనేది తనయా అభిప్రాయం. మెడికల్ హిస్టరీ, జీవనశైలి, భవిష్యత్తులో పిల్లలు కావాలా వద్దా అనేవి ఆధారంగా చేసుకొని నిర్ణయం తీసుకోవాలి సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తోంది. అందుకే ఆమెకు ఎంతో ఫాలోయింగ్ ఉంది. బయట ఎవరితో పంచుకోలేని విషయాలను సోషల్ మీడియా ద్వారా తనయాతో పంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకా.. ఆమె ఏం కొత్త విషయం చెప్తుందో అని ఎదురుచూస్తుంటారు. సెక్స్ గురించి ఆడవాళ్లకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తోంది డాక్టర్ క్యూటరస్.
ఉత్తమ గర్భ నిరోధకాలివే..
పబ్లిక్ అడిగిన కొన్ని డౌట్లను క్లారిఫై చేసింది డాక్టర్ తనయా. గర్భనిరోధకాల్లో మహిళలకు వివిధ రకాల ఎంపికలు ఉన్నాయని చెప్తోంది. టాబ్లెట్లు, ప్యాచ్‌లు, వాజినల్ రింగ్‌లు వంటి షార్ట్-యాక్టింగ్ మెథడ్స్ ఉన్నాయిగానీ.. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవాలి లేదా అప్లయ్ చేయాలని అంటోంది. ఇట్లా రోజు ఇదేం తలకాయనొప్పి అనుకునేవాళ్లకు లాంగ్-యాక్టింగ్ రివర్సిబుల్ కాంట్రాసెప్టివ్స్ ఇంప్లాంట్లు, ఐయూడీలు రక్షణ ఇస్తాయని సజెస్ట్ చేస్తోంది. తక్కువ మెయింటెనెన్స్‌తో కొందరు మహిళలు ట్యూబెక్టమీ వంటి సర్జికల్ మెథడ్స్‌ను ఎంచుకోవాలని సూచిస్తోంది.
అపోహలు అస్సలొద్దు..
సోషల్ మీడియా ద్వారా పదే పదే అడుగుతున్న కొన్ని అపోహలకు సమాధానాలు ఇస్తోంది తనయా. చాలామంది గర్భనిరోధక టాబ్లెట్లు ఆరోగ్యానికి హానికరమా అని అడుగుతున్నారట. దీనికి తనయా ఏం చెప్తుందంటే.. సరైన వైద్య మార్గదర్శకత్వంలో తీసుకుంటే టాబ్లెట్లు సురక్షితమైనవి.. ప్రభావవంతమైనవి. చాలా సందర్భాల్లో జీవితాన్ని కాపాడతాయని అంటోంది. ఇంకొకరు గర్భనిరోధకాలు సంతానోత్పత్తిని తగ్గిస్తాయా అని అడిగితే.. పర్మనెంట్ ఎంపికలు తప్ప పద్ధతిని ఆపిన తర్వాత సంతానోత్పత్తి సాధారణంగా తిరిగి వస్తుందని సూచిస్తోంది. ఇలాంటి ఎన్నో సందేహాలకు సరైన మార్గం చూపిస్తూ పేషెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది.






