జీవన సంతృప్తిని పెంచుతున్న చిన్న చిన్న వెకేషన్లు.. ఇంకా ఆ బెనిఫిట్స్ కూడా..!

by Javid Pasha |   (  Updated:2026-01-09 07:53:10  IST  )

అప్పుడప్పుడూ వెకేషన్లకు వెళ్లేవారు జీవితంలో ఎక్కువ సంతృప్తిని పొందుతారు. కొత్త ప్రాంతాల సందర్శన, కొత్త అనుభవాలు ఆనందాన్ని కలిగించడమే ఇందుకు కారణం

జీవన సంతృప్తిని పెంచుతున్న చిన్న చిన్న వెకేషన్లు.. ఇంకా ఆ బెనిఫిట్స్ కూడా..!
X

దిశ, ఫీచర్స్ : మీకు తెలుసా? ఏడాది పొడవునా ప్రయాణం, వినోదం, విశ్రాంతి, కొత్త ప్రదేశాలను చూడటం, ప్రియమైన వారితో గడపడం ఇలా ఏదో ఒక పర్పస్ కోసం ఎక్కువసార్లు వెకేషన్ తీసుకునేవారు జీవితంలో ఎక్కువ సంతోషంగా ఉంటారని ఒక అంతర్జాతీయ అధ్యయనం పేర్కొన్నది. వెల్‌నెస్ స్టడీలో భాగంగా, 9 దేశాల్లో 12 వేలమందిని ప్రశ్నించిన నిపుణులు పలు ఆసక్తికరమైన విషయాలను గుర్తించారు. అవేమిటో చూద్దాం పదండి!

*వెకేషన్ ప్రభావం : కుటుంబంతోనో, స్నేహితులతో కలిసి వెకేషన్ ప్లాన్ చేయడం, ట్రిప్‌కి వెళ్లడం, దగ్గరలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడం ఇలా ప్రతీ ఒక్కటి ఏదో ఒక ప్రయోజనాన్ని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇలా వెకేషన్ తీసుకునే వాళ్లు, తీసుకోని వారితో పోలిస్తే జీవితంలో తక్కువ స్ట్రెస్, క్వాలిటీ స్లీప్, ఎక్కువ సంతృప్తి కలిగి ఉంటున్నారని కనుగొన్నారు. కేవలం కేవలం మూడు నుంచి నాలుగు రోజుల చిన్న బ్రేక్‌లు కూడా మానసిక స్థితిని మెరుగు పర్చడంలో, ప్రొడక్టివిటీ పెంచడంలో సహాయపడతాయని, వెకేషన్ నుంచి తిరిగి వచ్చాక ఆ ప్రభావం వారాల పాటు కొనసాగుతుందని గుర్తించారు.

*తక్కువ ఒత్తిడి : ఇక వెకేషన్ తీసుకునే వారు తక్కువ ఒత్తిడిని ఎందుకు కలిగి ఉంటారంటే.. వెకేషన్లు మనసును పని నుంచి దూరం చేసి, కార్టిసాల్ (Stress hormone) లెవెల్స్ తగ్గిస్తాయి. తరచూ చిన్న బ్రేక్‌లు తీసుకుంటే స్ట్రెస్ పేరుకుపోకుండా రెగ్యులర్‌గా రీసెట్ అవుతుంది. బర్న్‌ అవుట్ తగ్గుతుంది. ఒకే పెద్ద వెకేషన్ తర్వాత స్ట్రెస్ తిరిగి పెరిగే అవకాశం ఎక్కువ.

*నాణ్యమైన నిద్ర : వెకేషన్ సమయంలో రిలాక్స్ అయి, రొటీన్ మార్పు వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. తరచూ బ్రేక్‌లు తీసుకుంటే ఈ ప్రయోజనం ఏడాది పొడవునా కొనసాగుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. స్ట్రెస్ తగ్గడం వల్ల నిద్రలేమి సమస్యలు తగ్గి, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. యాక్టివ్‌నెస్ పెరుగుతుంది.

*జీవితంలో ఎక్కువ సంతృప్తి : మిగతా వారితో పోలిస్తే అప్పుడప్పుడూ వెకేషన్లకు వెళ్లేవారు జీవితంలో ఎక్కువ సంతృప్తిని పొందుతారు. కారణం కొత్త ప్రాంతాల సందర్శన, కొత్త అనుభవాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక ట్రిప్ రాబోతోందనే ఆశ (Anticipation) కూడా హ్యాపీనెస్‌ను పెంచుతుంది. తరచూ చిన్న ట్రిప్‌లు తీసుకుంటే ఈ బూస్ట్ రిపీట్ అవుతుంది. మొత్తం జీవిత సంతృప్తి పెరుగుతుంది. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ (APA) స్టడీస్ కూడా వెకేషన్లు ఈ విధమైన ప్రయోజనాలను కలిగిస్తాయని పేర్కొన్నది.

Read More..

పిల్లలతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నారా?.. ఈ టిప్స్ మీకోసమే

Next Story