- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిల్లలతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నారా?.. ఈ టిప్స్ మీకోసమే
పిల్లలతో కలిసి ట్రావెల్ చేసేక్రమంలో పేరెంట్స్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదే లగేజ్ సర్దుకోవడం వల్ల అనవసరంగా ఆందోళన పడాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోవాలంటున్నారు నిపుణులు.

దిశ, ఫీచర్స్ : అసలే ఉరుకులూ పరుగుల జీవితాలు. పెద్దలు ఉద్యోగాలతో, రోజువారీ పనులతో బిజీ బిజీగా గడుపుతుంటే.. పిల్లలు పాఠశాలలు, కాలేజీలకు వెళ్తూ తీరిక లేకుండా ఉంటారు. సాధారణ రోజుల్లో ఎక్కువసేపు సరదాగా గడిపే సమయం ఉండట్లేదు ఈ రోజుల్లో. అందుకే హాలిడేస్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు. సెలవులొస్తున్నాయంటే చాలు చాలామంది తమ సొంత గ్రామాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. మరికొందరు పర్యాటక ప్రదేశాలను చుట్టి రావాలని భావిస్తుంటారు. అయితే ప్రయాణాల వేళ సరదాతోపాటు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. ముఖ్యంగా పిల్లలతో జర్నీ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
*చిన్న పిల్లలతో కలిసి ప్రయాణం చేయడమంటే అంత సులువు కాదు. ముఖ్యంగా ఐదేండ్లలోపు పిల్లలతో కలిసి జర్నీ చేసేక్రమంలో పేరెంట్స్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వెళ్లాలనుకున్న రోజే లగేజ్ సర్దుకోవడం వల్ల అనవసరంగా ఆందోళన పడాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే తగిన ప్లాన్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. ప్రయాణంలో పిల్లలకు కావాల్సిన ఆహారాలు, వస్తువులు, మెడిసన్ వంటివి ముందుగానే ప్యాక్ చేసి పెట్టుకుంటే మర్చిపోయే అవకాశం ఉండదు. అలాగే మీరు లాంగ్ జర్నీ చేస్తున్నట్లయితే మధ్యలో ఇబ్బందుల పడాల్సిన అవసరం ఉండదు. ఖర్చులు కూడా అదా అవుతాయి.
*మీరు ఏడాది మొదలు కొని మూడేండ్ల పిల్లలతో ప్రయాణిస్తున్నట్లయితే డైపర్, వైప్స్ ప్యాక్, మిల్క్, బేబీ ఫుడ్, బేబీ మాశ్చరైజర్ క్రీమ్ వంటివి ఉండేలా చూసుకోవాలి. అలాగే వారు తినే ఆహార పదార్థాలు, స్నాక్స్ వంటివి ముందుగానే సర్దాలి. వాటర్ బాటిల్స్, ఎక్స్‌ట్రా డ్రెస్‌లు తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ మీరు కార్‌లో ప్రయాణం చేయాలనుకుంటే.. పిల్లలకి ప్రత్యేకంగా కారు సీట్స్ ఉంటాయి. వాటిని ముందుగానే సెట్ చేసుకుంటే కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు వాడేందుకు అవసరం అయ్యే మెడిసిన్ లేదా సిరప్‌లు డాక్టర్ల సలహాతో ముందుగానే సిద్ధం చేసుకొని వెంట తీసుకెళ్లాలి.
*జర్నీ మధ్యలో వాంతింగ్స్, ఫీవర్ వంటివి వస్తే ఉపయోగించవచ్చు. అలాగే బస్సుల్లో, ట్రైన్లలో వెళ్తున్నప్పుడు బయట దొరికే ఆహారాలు తినడం అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి ముందుగానే ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకోవడం బెటర్. ఇక లాంగ్ జర్నీ అయితే పిల్లలు సరదాగా గడిపేందుకు కొన్ని బొమ్మలు, కార్టూన్ పుస్తకాలు, పజిల్స్ వంటి వాటిని తీసుకెళ్లవచ్చు. ఇక పర్యాట ప్రదేశాలకు ట్రావెల్ చేస్తున్నట్లయితే ముందుగానే మీరు వెళ్లబోయే ప్రాంతంలోని వాతావరణం, హోటల్స్, అక్కడ దొరికే రూమ్స్‌పై అవగాహన ఉంటే బెటర్. సాధ్యమైనంత వరకు బేబి ఫ్రెండ్లీ హోటళ్లను, ప్రాంతాలను ఎంచుకోండి. కార్‌లో ట్రిప్‌కి వెళ్తున్నప్పుడు కొంత సమయం బ్రేక్ తీసుకోవడం మంచిది.
Read More..






