- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Micro break : ఒక చిన్న విరామం చాలు.. మీలో క్రియేటివిటీని పెంచేస్తుంది!
Micro break : ఒక చిన్న విరామం చాలు.. మీలో క్రియేటివిటీని పెంచేస్తుంది!

దిశ, ఫీచర్స్ : అలసటగా అనిపించినప్పుడో, పని ఒత్తిడి పెరిగినప్పుడో ఎవరికైనా ఏమనిపిస్తుంది..? కాసేపు విరామం తీసుకుంటే రిలాక్స్ అవుతామనిపిస్తుంది. అలా అనిపించడంలో ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే మీరు తీసుకునే ప్రతీ చిన్న విరామం క్రియేటివిటీని పెంచుతుంది అంటున్నారు మానసిక నిపుణులు. ఇలా చేసే పనిలో కొన్ని క్షణాలో, కొన్ని నిమిషాలో విశ్రాంతి తీసుకోవడాన్నే మైక్రో బ్రేక్ అంటారు. ఐటీ సెక్టర్‌లో చాలామంది ఈ ట్రెండ్ ఫాలో అవుతుంటారు. వాస్తవానికి ఇది మనల్ని రీచార్జ్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
10 నిమిషాలకు మించకుండా..
మైక్రో బ్రేక్ అనేది ఫలానా పనిచేస్తున్నప్పుడు మాత్రమే తీసుకోవాలనేం లేదు. మీరు నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు, ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు.. ఇలా ఎప్పుడైనా తీసుకోవచ్చు. దీనివల్ల మీలోని ఒత్తిడి, ఆందోళన, అలసట, టెన్షన్ వంటివి తగ్గుతాయి. అయితే మీరు బ్రేక్ తీసుకోవడం అనేది 10 నిమిషాలకు మించి ఉండకూడదు. అప్పుడే అది మైక్రో బ్రేక్ అవుతుంది. తరచుగా ఆయా పనుల్లో బిజీగా ఉండేవారు, ముఖ్యంగా సిస్టమ్ వర్క్ చేసేవారు మధ్య మధ్యలో మైక్రో బ్రేక్ తీసుకోవడంవల్ల స్ట్రెస్ రిలీఫ్ అవుతారు. అలాగే బ్రేక్ సమయంలో మ్యూజిక్ వినడం, ప్రకృతిని ఆస్వాదించడం, కొలీగ్స్ లేదా ఫ్రెండ్స్‌తో మాట్లాడటం వంటి మీకు ఇష్టమైన పనులు చేయవచ్చు. దీనివల్ల మీలోని మెంటల్ ఎనర్జీ రీచార్జ్ అవుతుంది.
తగ్గుతున్న రిస్క్
కాసేపు కూడా రెస్ట్ లేకుండా గంటల తరబడి వర్క్ చేస్తే క్రియేటివిటీ తగ్గే చాన్స్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఓవర్ లుక్, ఓవర్ బర్డెన్ కారణంగా కొన్నిసార్లు బర్న్ అవుట్ అవుతుంటారు. దీంతో చేస్తున్న వర్క్‌పై ఆసక్తి, ఏకాగ్రత తగ్గుతాయి. నాణ్యత లోపిస్తుంది. ఇలా జరగకూడదంటే మీరు ‘మైక్రో ట్రెండ్’ ఫాలో అవడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా నిశ్చల జీవన శైలిని దూరం చేసి, మధుమేహం, అధిక రక్తపోటు గుండె జబ్బులు వచ్చే రిస్క్‌ను తగ్గించడంలో మైక్రో బ్రేక్ కీ రోల్ పోషిస్తుంది.






