Liver health : పాదాలపై బ్రౌన్ కలర్ మచ్చలా..? లివర్‌‌లో ఆ సమస్యకు సంకేతం కావచ్చు!

by Javid Pasha |

Liver health : పాదాలపై బ్రౌన్ కలర్ మచ్చలా..? లివర్‌‌లో ఆ సమస్యకు సంకేతం కావచ్చు!
X

దిశ,ఫీచర్స్ : కాలేయం.. మానవ శరీరంలోని అతి ముఖ్యమైన అవయావాల్లో ఒకటి. మనం హెల్తీగా ఉండాలంటే లివర్ పనితీరు సక్రమంగా ఉంటేనే సాధ్యమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి భిన్నంగా ఏవైనా లోపాలున్నా, లివర్ పనితీరు మందగించినా టోటల్ హెల్త్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. మొదట్లోనే సమస్యను గుర్తించకపోవడం, నిర్లక్ష్యం చేయడం వల్ల తర్వాత ప్రాణాంతకంగా మారవచ్చు. అయితే లివర్‌లో సమస్యలు ఉన్నప్పుడు అందకు సంబంధించిన సంకేతాలు, లక్షణాలను పాదాలపై కూడా కనిపిస్తాయి అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

లివర్ సరిగ్గా పనిచేయడం లేదంటే అందుకు సంబంధించిన లక్షణాలు కొద్ది రోజుల ముందు నుంచే కనిపిస్తాయి. ముఖ్యంగా ఫ్యాట్ పేరుకుపోయినట్లయితే పిత్తం (bile) మందంగా మారవచ్చు. దీనివల్ల పాదాల్లో దురద వస్తుంది. దీంతోపాటు పాదాలపై రెడ్ అండ్ బ్రౌన్ కలర్ మచ్చలు తరచుగా ఏర్పడుతుంటే కూడా లివర్‌ పనితీరు మెరుగ్గా లేదని అర్థం చేసుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. ఇక ఫ్యాటీ లివర్ లేదా లివర్ సిర్రోసిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా శరీరం దిగువ భాగానికి బ్లడ్ సర్క్యూట్ సరిగ్గా జరగదు. ఫలితంగా పాదాలపై బ్రౌన్ కలర్ మచ్చలు కనిపిస్తాయి. విటమిన్ కె, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి లోపాలవల్ల కూడా పాదాల్లో ఇలాంటి సమస్యలు కనిపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి లక్షణాలను గుర్తించగానే అలర్ట్ అవ్వడం బెటర్ అంటున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Next Story