- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కడ వీధుల్ని క్లీన్ చేస్తున్న కాకులు.. పర్యావరణం సేఫ్..!
సిగరెట్లు తాగడం, ఎక్కడంటే అక్కడ వాటి వ్యర్థాలను పడేయడం కారణంగా అవి కాలుష్య కారకాలుగా మారుతున్నాయి.

దిశ, ఫీచర్స్ : అనగనగా ఒక కాకి ఉండే.. అంటూ ప్రారంభించి చిన్నప్పుడు నానమ్మలో, అమ్మమ్మలో చెప్పిన కాకికథ మీరు వినే ఉంటారు. దాహం వేస్తున్న కాకికి ఎక్కడా నీరు కనబడదు. చివరికి ఒక మట్టి కుండ కనిపిస్తుంది. కానీ అందులో నీరు చాలా తక్కువగా అడుగు భాగాన ఉంటుంది. దీంతో సదరు కాకి ఒక్కో గులకరాయి తీసుకొచ్చి కుండలో వేయగా.. ఆ రాళ్లు అడుగు భాగానికి వెళ్లి, నీరు పైకి ఉబికి వస్తుంది. ఆ నీటిని తాగి దాహం తీర్చుకుంటుంది కాకి. కష్టపడనిదే ఏ ఫలితమూ దక్కదనే నీతికి నిదర్శనంగా ఈ కథ చెబుతుండేవారు. అయితే ఇటీవల స్వీడన్‌లోని సోడర్‌టాల్జే, వాక్సియో నగరాల్లో కార్విడ్ క్లీనింగ్(Corvid Cleaning) అనే స్టార్టప్ కంపెనీ చేసిన వినూత్న ప్రయోగం కూడా ఆ కాకి కథను గుర్తుకు తెచ్చేలా ఉంది. కాకపోతే సమ్ డిఫరెంట్. నగర వీధుల్లో పేరుకుపోతున్న తాగి పడేసిన సిగరెట్స్ బట్స్ అండ్ వాటి వ్యర్థాల నుంచి వెలువడే కాలుష్య నివారణలో, కాకులను భాగస్వామ్యం చేయడంలో సదరు స్టార్టప్ సక్సెస్ అయి, ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఏం చేసిందంటే..
సిగరెట్ వ్యర్థాలతో కాలుష్యం
కొందరు ధూమపానం చేస్తుంటారు. కానీ సిగరెట్ తాగాక చివరలో మిగిలిన ముక్కను ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు. అయితే స్వీడన్‌లో ఈ సమస్య మరీ ఎక్కువైపోతోంది. జనాలు సిగరెట్లు తాగడం, ఎక్కడంటే అక్కడ వాటి వ్యర్థాలను, ముక్కలను పడేయడం కారణంగా ప్రతీ సంవత్సరంలో ఆ దేశంలో మిలియన్ల కొద్దీ సిగరెట్ బట్స్ నగర వీధుల్లో పేరుకుపోయి, కాలుష్య కారకాలుగా మారుతున్నాయి. నేలలో, నీటి వనరుల్లో, గాలిలో చేరి పర్యావరణానికి, తద్వారా మానవులకు హాని కలిగిస్తున్నాయి. అయితే ఈ సమస్యకు చక్కటి సొల్యూషన్ ఆలోచించింది అక్కడి క్వారిడ్ క్లీనింగ్ అనే స్టార్టప్ కంపెనీ. వీధుల్లో పేరుకుపోయే సిగరెట్ ముక్కలను ఎప్పటికప్పుడు క్లీన్ చేయడంలో కాకుల్ని కూడా భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో, సమస్య అధికంగా ఉన్న సోడర్ టాల్జే, వాక్సియో నగరాల్లోని వీధుల్లో అధునాతమైన మెషిన్లను ఏర్పాటు చేసింది. వాటిని CrowBox అని పిలుస్తున్నారు.
పర్యావరణాన్ని రక్షిస్తున్న కాకులు
క్రౌ బాక్స్(CrowBox) అనేది ఒక స్మార్ట్ వెండింగ్ మెషిన్ లాంటిది. కాకులు సిగరెట్ బట్స్ (smoking bushes) లేదా చిన్న పైపులను దానిలోకి వేస్తే, వెంటనే చిన్న ఫుడ్ రివార్డ్ (Peanut-like) అందిస్తుంది. ఇక సదరు మెషిన్ ఆపరెంట్ కండిషనింగ్(Behavioral training) సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. అంటే మంచి పని చేస్తే రివార్డ్ ఇవ్వడం దాని ప్రధాన లక్షణంగా ఉంటుంది. అయితే ఇప్పుడు స్వీడన్ నగర వీధుల్లో రోడ్లు, పార్కులు, పబ్లిక్ ప్లేస్‌లలో పేరుకుపోయే సిగర్ బట్స్‌ను కాకులు స్వయంగా తీసుకొచ్చి క్రౌ బాక్స్‌లో వేస్తున్నాయి. అలా వేయగానే బయటకు వచ్చే పల్లీలు లేదా ఇతర గింజలను ఆహారంగా తింటున్నాయి. ఈ మెషిన్ ఎలా పని చేస్తుందంటే.. ఇది ఒక చిన్న ఆటోమేటిక్ డివైస్, కాకులను తనవద్దకు సులభంగా రీచ్ అయ్యేలా డిజైన్ చేయబడింది. వాటికి కనిపించేలా అందులో పెద్ద బటన్ లేదా ఓపెనింగ్ స్పేస్ ఉంటుంది. అవి ఒక సిగరెట్ బట్‌ను (Or other small litter) మెషిన్‌లోకి వేస్తే, వెంటనే ఒక చిన్న ఫుడ్ రివార్డ్ (సాధారణంగా పల్లీలు లేదా ఇతర గింజలు) డిస్పెన్స్ అవుతుంది. కాకులు ఇది తెలుసుకోవడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే పట్టాయి!
75% తగ్గుతున్న ఖర్చులు
మొదటిదశ ప్రయోగాల్లో 5-10 కాకులు మాత్రమే మెషిన్‌లో నుంచి వచ్చే ఫుడ్ రివార్డ్ కోసం సిగరెట్ బట్స్ తెచ్చి వేయడం చేశాయి. క్రమంగా ఈ ‘ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్’ ఇతర కాకులకు కూడా చేరి వాటి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు కాకులు గుంపులు గుంపులుగా సిగరెట్ బట్స్ తేవడం, క్రౌ బాక్స్‌లో వేసి, తమకు కావలసిన గింజల్ని తినడం తరచుగా చేస్తున్నాయి. అలా యంత్రంలో వేసిన సిగరెట్ ముక్కలను స్టార్టప్ కంపెనీ రీసైక్లింగ్ చేయడం ద్వారా కార్విడ్ క్లీనింగ్(Corvid Cleaning) అనే స్టార్టప్ పర్యావరణానికి జరిగే నష్టాన్ని నివారిస్తోంది. దీనివల్ల నగరాల్లో లేదా వీధుల్లో స్ట్రీట్ క్లీనింగ్ ఖర్చులు 75% వరకు తగ్గుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇది కేవలం స్వీడన్‌కి మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఇన్నోవేటివ్ సొల్యూషన్స్‌కు ప్రేరణగా నిలుస్తున్నదని నిపుణులు అంటున్నారు.






