Viral Video: ఏంటి స్వాతి రెడ్డి పాటలో ఇంత మీనింగు ఉందా.. వామ్మో కళ్లల్లో నీళ్లు తెప్పించేసారు భయ్యా.. మీనింగ్ తెలిస్తే సచ్చిపోతాం

by Vennela |

Viral Video: సోషల్ మీడియాలో రోజురోజుకీ క్రియేటివిటీ పెరిగిపోతోంది.

Viral Video: ఏంటి స్వాతి రెడ్డి పాటలో ఇంత మీనింగు ఉందా.. వామ్మో కళ్లల్లో నీళ్లు తెప్పించేసారు భయ్యా.. మీనింగ్ తెలిస్తే సచ్చిపోతాం
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: సోషల్ మీడియాలో రోజురోజుకీ క్రియేటివిటీ పెరిగిపోతోంది. నెటిజన్లను ఆకట్టుకునేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కొత్త కొత్త క్రియేటివిటీ ఐడియాలతో ముందుకు వచ్చేస్తున్నారు. మొబైల్ ఓపెన్ చేయగానే, తాము తయారు చేసిన రీల్ లేదా వీడియో వైపు కాసేపు ఆగి చూడాలి అంటే అందుకోసం ఒక సోషల్ మీడియా థియేటర్ ఎంత కష్టపడాలో అర్థం చేసుకోవచ్చు.

అయితే కష్టం కన్నా ముందు క్రియేటివ్ గా ఆలోచించడమే ఇందులో అసలైన విజయ రహస్యం అని చెప్పవచ్చు. అలాంటి ఓ చక్కటి క్రియేటివ్ ఐడియాతో ఈ వీడియోలో ఉన్న ముగ్గురు యువకులు వచ్చేసారు. తెలుగు సినిమాల్లో సాధారణంగా వినిపించే ఐటమ్ సాంగ్స్ లో డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉంటాయి. ఆ పాటలో మ్యూజిక్ బలంగా రణగుణ ధ్వనులతో నిండి ఉండటం వల్ల ఆ లిరిక్స్ అర్థాలు ఏంటో ఎవరికీ అర్థం కావు. వాటిని అర్థం చేసుకునే టైం కూడా ఎవరికి ఉండదు.

పాట రిధం బావుంటే చాలు లిరిక్స్ తో పనిలేకుండా అందరూ ఆ పాటను హమ్ చేసేస్తుంటారు. కానీ ఆ అర్ధాలను విడదీసి పాటలోని లిరిక్స్ ను అర్థం చేసుకుంటే మాత్రం నోటిమీద వేలేసుకోవడం ఖాయం. ఎందుకంటే ఒక్కో పదంలో 10 బూతులు అందులో వెతుక్కోవచ్చు. ముఖ్యంగా ఐటమ్ సాంగ్స్ లో ఉండే డబుల్ మీనింగ్ డైలాగులు, వ్యంగ్యార్థాలు తెలిస్తే ఏంటి ఇందులో ఇంత బూతు ఉందా అని ముక్కున వేలేసుకోవడం ఖాయం.

తాజాగా ఈ వీడియోలో ఉన్న ఈ క్రియేటర్లు మ్యాడ్ 2 సినిమాలో ఇటీవల సూపర్ హిట్ అయినటువంటి స్వాతి రెడ్డి పాటలోని లిరిక్స్ ను ఒక్కొక్క లైను వివరించుకుంటూ వెళ్లారు. అందులో మీనింగ్ను వెతుక్కుంటే చాలా డబుల్ మీనింగ్ బయటపడ్డాయి. ఈ వీడియో చూడటానికి సీరియస్ గా ఉన్నప్పటికీ, నెటిజన్లు మాత్రం తెగ నవ్వుకుంటున్నారు.



Next Story