- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరస్కరణలే దీవెనలుగా మార్చుకున్న యువకుడు.. కోటి రూపాయల జీతంతో..
ఐఐటీలో సీటు పొందలేకపోయినా.. మైక్రోసాఫ్ట్ తనను తిరస్కరించినా.. పట్టుదలతో ముందుకు సాగాడు.. గూగుల్‌లో పని చేసి.. మెటాలో జాయిన్ అయ్యి.. ఏడాదికి కోటికి పైగా సంపాదిస్తున్న యువకుడు

దిశ, ఫీచర్స్: జీవితంలో విజయానికి ఒకే మార్గం ఉండదు. దీనిని చాలామంది చాలాసార్లు నిరూపించారు. అలాంటివారిలో అమిత్ దత్తా ఒకరు. ప్రస్తుతం లండన్‌లో పనిచేస్తున్న ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను స్టార్టింగ్‌లో టాలెంట్ లేదని ఎవరూ ఉద్యోగంలోకి తీసుకోలేదు. ఆ తిరస్కరణలనే ఆశీర్వాదాలుగా మల్చుకొని ఇప్పుడు ప్రపంచ ప్రముఖ టెక్ సంస్థలో భారీ జీతంతో ఉద్యోగం చేస్తున్నాడు.
రిజెక్ట్ అయినా..
అమిత్ దత్తా 2018లో ఐఐటీలో చేరాలని ఆశపడ్డాడు. కానీ ఆ అవకాశం దక్కలేదు. తన ప్రతిభకు అందులో అవకాశం రాదని అన్నారు. తప్పని పరిస్థితుల్లో ఒక సాధారణ కాలేజీలో చేరాడు. ఇనిస్టిట్యూటే ముఖ్యంకాదు. తాను ఎలాగైనా ఇంజనీర్ కావాలన్నదే ముఖ్యం అనుకొని ముందుకు సాగాడు. ఎలాగైతేంది మొత్తానికి కష్టపడి ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాడు. ఇక మంచి ఉద్యోగం మీదే తన కాన్సెంట్రేషనంతా. అలా మొదటిసారిగా 2021లో మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్ కోసం చాలా కష్టపడి సిద్ధమయ్యాడు. కానీ చివరికి వాళ్లు తిరస్కరించారు. చాలా బాధపడ్డాడు. ఎందుకు రిజెక్ట్ అయ్యాను అనే భావన మనసులోంచి పోవడం లేదు.
ప్యాకేజీ రూ.1.7 కోట్లు..
మైక్రోసాఫ్ట్ రిజెక్ట్ చేసిందని ఉత్తగనే ఆలోచిస్తే ఏం ఫాయిదా..ఆ వైఫల్యాన్ని పాఠంగా మార్చుకోవాలి కదా అని అనుకున్నాడు. తన నైపుణ్యాలను ఇంకా మెరుగుపరుచుకున్నాడు. అదే అతనికి మెరుగైన అవకాశాల దారి చూపించింది. 2022లో అతని టాలెంట్‌కు మెచ్చి గూగుల్ ఫుల్‌టైమ్ ఉద్యోగం ఇచ్చింది. అక్కడ రెండు సంవత్సరాల పాటు పనిచేసి తన టెక్నికల్ నైపుణ్యాలను పెంచుకున్నాడు. అతని ప్రతిభను గమనించిన మెటా సంస్థ లండన్ ఆఫీస్‌లో అవకాశం ఇచ్చింది. ఆరు రౌండ్లు ఇంటర్వ్యూ పూర్తిచేసి ఉద్యోగాన్ని సంపాదించాడు. ప్రస్తుతం అతడి సంవత్సర ప్యాకేజీ రూ.1.7 కోట్లు.
నిరంతర శ్రమతో..
ఐఐటీలో ప్రవేశం రాలేదనో.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగం ఇవ్వలేదనో బాధపడుతూ ఇంట్లో కూర్చుంటే ఈ జాబ్ ఆఫర్ వచ్చేదా? అమిత్ సంవత్సరానికి కోటి రూపాయలకు పైగా జీతం సంపాదించేవాడా? ఒక్క అమితే కాదు. ఎవరి జీవితంలో అయినా ఇది వర్తిస్తుంది. తిరస్కరణలకు కుంగిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళితేనే విజయం సొంతమవుతుంది. అమిత్ తన సక్సెస్ స్టోరీని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. నేటి యువతకు ప్రేరణగా మారింది. ఐఐటీ లాంటి సంస్థలో చేరకపోయినా నిరంతర శ్రమతో గొప్ప విజయం సొంతం చేసుకోవచ్చని నిరూపిస్తోంది.






