- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health : కార్బ్ డైట్స్.. గుండెకు హానికరమా? హార్వర్డ్ స్టడీ షాకింగ్ ఫ్యాక్ట్స్!
లో- కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ఆరోగ్యానికి మంచిదే కదా అనుకుంటారు చాలామంది. కానీ వాటిలో కొన్ని గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి!

దిశ, ఫీచర్స్ : కొందరు బరువు తగ్గాలని, బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉండాలని తక్కువ కార్బోహైడ్రేట్ కలిగిన డైట్ ఫాలో అవుతుంటారు. కానీ దీనివల్ల నష్టాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ఒక అధ్యయనం ఇదే చెబుతున్నది. అనారోగ్యకరమైన లో- కార్బోహైడ్రేట్స్ మీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నది. ఇందుకు సంబంధించిన వివరాలను జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో 2026 ఫిబ్రవరి 11న పబ్లిష్ అయ్యాయి. ఆ విరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
లో - కార్బ్ డైట్ అంటే?
నిజానికి తక్కువ కార్బోహైడ్రేట్ డైట్ అంటే.. రోజువారీ ఆహారంలో కార్బోహైడ్రేట్లు(carbs) తక్కువగా తీసుకునే ఆహార పద్ధతి. సాధారణంగా రోజుకు 50-130 గ్రాముల కంటే తక్కువ కార్బ్స్ తీసుకుంటారు. అలాగే కొన్ని కచ్చితమైన డైట్లలో 20-50 గ్రాములు మాత్రమే తీసుకుంటారు. ఇది అధిక బరువు తగ్గడం, డయాబెటిస్ బాధితులకు రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రించడం, ఎనర్జీ లెవెల్స్ మెరుగు పరచడం వంటి అవసరాలకోసం ఉపయోగపడుతుంది. అయితే చాలామందికి ఇక్కడే ఒక అనుమానం కూడా ఉంటుంది. వాస్తవానికి లో- కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అధిక బరువును నియంత్రిస్తాయి కాబట్టి మంచిదే కదా.. అనుకుంటారు. అధ్యయనం దీనిపై క్లారిటీ ఇచ్చిందేమిటంటే.. ఆరోగ్యకరమైన లో- కార్బోహైడ్రేట్స్ వల్ల ఇక్కడ ఎటువంటి సమస్యా లేదు. కాకపోతే అనారోగ్యకరమైన తక్కువ కార్బోహైడ్రేట్స్ కలిగిన ఆహారాలే గుండె ఆరోగ్యానికి హాని చేస్తాయని అధ్యయనం స్పష్టం చేసింది. స్టడీలో భాగంగా దాదాపు 2 లక్షలమందిని పరిశోధకులు అబ్జర్వ్ చేశారు. 1986 నుంచి 2019 వరకు ఫాలో-అప్ చేసిన ఈ స్టడీలో, డైట్ నాణ్యత, హార్ట్ డిసీజ్ (CHD) మధ్య సంబంధాన్ని పరిశీలించారు.
రిస్క్ తగ్గించేవి.. పెంచేవి
అధ్యయనాలను విశ్లేషించిన నిపుణుల ప్రకారం అనారోగ్యకరమైన లో కార్బ్ డైట్స్ అంటే.. రిఫైన్డ్/ప్రాసెస్డ్ ఫుడ్స్, యానిమల్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారాలు, రెడ్ మీట్, బేకన్, సాసేజ్, ఇతర ప్రాసెస్డ్ మీట్స్, బటర్/ఐస్‌క్రీమ్, రిఫైన్డ్ గ్రెయిన్స్, షుగర్స్, యానిమల్ ఫ్యాట్స్ వంటి తక్కువ కార్బోహైడ్రేట్ కలిగిన ఆహారాలు హార్ట్ డిసీజ్ రిస్క్‌ను 14% పెంచుతాయి. అయితే హెల్తీ లో - కార్బ్ డైట్స్, హోల్ గ్రెయిన్స్(whole grains), మొక్క ఆధారిత ప్రోటీన్లు మాత్రం ఈ రిస్కును 15% తగ్గిస్తాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. అనారోగ్యకరమైన తక్కువ కార్బోహైడ్రేట్ డైట్ మాత్రమే గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆరోగ్యాకరమైన కార్బ్ డైట్ మాత్రం కాదు.
ఆరోగ్యకరమైన లో- కార్బ్ డైట్
ఆకు కూరలు, నట్స్, సీడ్స్, అవకాడో, ఆలివ్ ఆయిల్, బ్రోకలీ, బీన్స్ వంటివి ఆరోగ్యకరమైన లో కార్బోహైడ్రేట్స్ కలిగిన ఆహారాలు ఇవి అధిక బరువును తగ్గించడంలో, బ్లడ్ షుగర్‌ను కంట్రోల్లో ఉంచడంలో సహాయపడతాయి. మొక్క ఆధారిత ఆహారాలు దీని పరిధిలోకి వస్తాయి. ఇవి గుండె జబ్బుల రిస్క్‌ను 15% వరకు తగ్గిస్తాయి. కాబట్టి హెల్తీ ఫ్యాట్స్ లేదా హెల్తీ లో కార్బోహడ్రేట్లు కలిగిన ఆహారం మంచిదే.
అనారోగ్యకరమైన లో- కార్బ్ డైట్
జంతు ఆధారిత ఆహారాలు, ముఖ్యంగా అధిక కొవ్వు కలిగిన రెడ్ మీట్, బేకన్, సాసేజ్, ప్రాసెస్డ్ మీట్స్, హై-సాచురేటెడ్ ఫ్యాట్ ఫుడ్స్ (బటర్, ఫుల్-ఫ్యాట్ చీజ్ ఎక్సెస్)వంటివి కూడా తక్కువ కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. ఇన్‌ఫ్లమేషన్‌ను, చెడు కొలెస్ట్రాల్ అధికం చేస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని 14% పెంచుతాయి. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను ప్రోత్సహిస్తాయి. అందుకే అనారోగ్యకరమైన లో కార్బ్ డైట్‌ను అవాయిడ్ చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అధ్యయనం కూడా అదే చెబుతున్నది.






