వావ్.. ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ వాకింగ్ చేస్తే ఇన్ని ప్రయోజనాలా?

by Javid Pasha |   (  Updated:2026-01-29 16:02:10  IST  )

జస్ట్ వాకింగే కదా అనుకుంటారు చాలామంది. కానీ 12 నిమిషాలు ఫ్రెండ్స్‌తో మట్లాడుతూ చేసే వాకింగ్ మీ జీవితాన్ని ఆనంద మయం చేస్తుంది

వావ్.. ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ వాకింగ్ చేస్తే ఇన్ని ప్రయోజనాలా?
X

దిశ, ఫీచర్స్ : వాకింగ్ ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. కానీ చేసే పద్ధతిని బట్టి కూడా కొన్ని అదనపు ప్రయోజనాలు చేకూరుతాయని మీకు తెలుసా? ఐయోవా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఒక తాజా అధ్యయనంలో అదే వెల్లడైంది. సాధారణ నడకతో పోలిస్తే ప్రియమైన వ్యక్తి లేదా బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి జస్ట్ 12 నిమిషాలు వాకింగ్ చేసినా మెదడు పనితీరులో సానుకూల మార్పులు జరుగుతాయని, ఇది మొత్తం ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుపై పాజిటివ్ ఇంపాక్ట్ చూపుతుందని తేలింది. అదెలాగో చూద్దాం పదండి.

జస్ట్ వాకింగే కదా అనుకుంటారు చాలామంది. కానీ ఇదే మన జీవితాలను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అదోస్తులతో కలిసి 12 నిమిషాలు వాకింగ్ చేసినప్పుడు సరిగ్గా అదే జరుగుతున్నదని అధ్యయనం పేర్కొన్నది. ఈ సందర్భంగా ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గి సంతోషం, సామాజిక సంబంధాలు మెరుగుపడుతున్నట్లు నిపుణులు అంటున్నారు. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు కొంతమంది కాలేజీ విద్యార్థులు తమకు ఇష్టమైన స్నేహితులతో కలిసి ఒక భవనం చుట్టూ వాకింగ్ చేయాలని సూచించారు. ఇలా కొంతకాలం రకరకాల వాకింగ్ పద్ధతుల ద్వారా శరీరంలో, ముఖ్యంగా మెదడులో జరుగుతున్న మార్పులను, సానుకూల, ప్రతికూల ప్రభావాలను ఎనలైజ్ చేశారు.

స్నేహితులతో కలిసి వాకింగ్ చేస్తున్నప్పుడు పరస్పరం సంభాషించుకోవడం, సంబంధాలను గుర్తు చేసుకోవడం, సంతోషంగా మాట్లాడటం, ఎమోషనల్ సపోర్ట్ అందించుకోవడం వంటివి 12 నిమిషాల వ్యవధిలో మెదడులోని మూడ్, స్ట్రెస్ కంట్రోలింగ్, సోషల్ కనెక్షన్స్‌కు సంబంధించిన భాగాలను ప్రభావితం చేశాయని పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాకుండా శరీరాన్ని కదిలిస్తూ విశ్వసనీయంగా మాట్లాడటం ఎమోషన్ ప్రాసెసింగ్ అండ్ బాండింగ్‌కు సంబంధించిన బ్రెయిన్ ఏరియాలను ఉత్తేజ పరిచినట్లు గుర్తించారు. అంటే మొత్తానికి ఫ్రెండ్స్‌తో కలిసి వాకింగ్ చేయడం ఆందోళనను తగ్గించి, సానుభూతిని, సంతోషాన్ని, సానుకూల భావాన్ని పెంపొందించడంలో అద్భుతంగా సహాయపడిందని కనుగొన్నారు. అందుకే వీలైతే స్నేహితులతో కలిసి వాకింగ్ చేయండి.. ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు.

Read More.. నాన్నతో కలిసి డిన్నర్ చేయడం.. పిల్లల చదువు, భవిష్యత్తును మార్చేస్తుందా?

Next Story