- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియమైన వ్యక్తి దుస్తుల వాసనతో తగ్గుతున్న ఒత్తిడి, ఆందోళన..! కారణమిదే..
ప్రియమైన వ్యక్తి దుస్తుల వాసనతో తగ్గుతున్న ఒత్తిడి, ఆందోళన..! కారణమిదే..

దిశ, ఫీచర్స్ : ఒక వ్యక్తి ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే.. తన భాగస్వామి లేదా ఇష్టమైన వ్యక్తి శరీరం నుంచి గానీ, ధరించే దుస్తుల నుంచి గానీ వచ్చే వాసనతో వెంటనే ఉపశమనం పొందుతారని, మధురానుభూతికి లోనవుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా పరిశోధన సైతం మరోసారి అదే వెల్లడించింది. సన్నిహితమైన వ్యక్తుల వాసన ఒత్తిడి, ఆందోళనలు తగ్గించడంలో కీ రోల్ పోషిస్తుందని పేర్కొన్నది.
తాజా పరిశోధన ప్రకారం.. భాగస్వామి(partner) లేదా ప్రియమైన వ్యక్తి ధరించిన షర్ట్, ప్యాంట్ లేదా వారు ఉపయోగించిన దిండు వంటి సాధారణ వస్తువుల వాసన కూడా మీ మనస్సును మధురానుభూతికి లోను చేస్తుంది. ఆ క్షణంలో శారీరక సాన్నిహిత్యం, కౌగిలింత లేదా మాటలు లేకపోయినా ఈ ప్రభావం ఉంటుందని అధ్యయనం పేర్కొన్నది. ప్రియమైన వ్యక్తి వాసన మెదడుకు భద్రతా భావన(A sense of security)ను అందించడంవల్ల ఇలా జరుగుతుందని, ఇదొక జీవ రసాయనిక స్థాయిలో జరిగే అనుబంధానికి నిదర్శనమని పరిశోధకులు అంటున్నారు.
ప్రియమైన లేదా అత్యంత ఇష్టమైన వ్యక్తి వాసనను సహజంగానే క్షణాల్లో మెదడు గుర్తిస్తుంది. వెంటనే రిలాక్సేషన్ సంకేతాలను శరీరానికి పంపుతుంది. ఇది ఒక రకమైన భావోద్వేగ, శారీరక సౌకర్యాన్ని (Emotional and physical comfort) అందిస్తుంది. అందుకే కొందరు వ్యక్తులు తమ భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తికి సంబంధించిన కర్చీఫ్, టీ షర్ట్, లో దస్తులు వంటివి ‘దొంగిలించడం’ లేదా ఆ వ్యక్తులు లేనప్పుడు వాటి వాసన చూడటం వంటివి చాలా సహజమైన ప్రవర్తనలుగా నిపుణులు పరిశోధకులు పేర్కొంటున్నారు.
ప్రియమైన వ్యక్తి దుస్తుల వాసన చూడటం, చెమట వాసన పీల్చడం వంటి చర్యలు కేవలం భావోద్వేగ స్థాయిలోనే కాకుండా, శాస్త్రీయంగానూ సమర్థనీయమైనవని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే అవి సదరు వ్యక్తుల మెదడులో సెరోటోనిన్, ఆక్సిటోసిన్ వంటి హ్యాపీ హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తాయి. స్ట్రెస్, యాంగ్జైటీస్, డిప్రెషన్ వంటి రుగ్మతలను దూరం చేస్తాయి. మానసిక స్థితిని మెరుగు పరుస్తాయి. సౌంకర్యవంతమైన భావనను కలిగిస్తాయి. ఇష్టమైన వ్యక్తుల మధ్య తాత్కాలికంగా ఫిజికల్ డిస్టెన్స్ ఉన్నప్పటికీ మానవ సంబంధాలలో అనుబంధాన్ని ఎలా మేనేజ్ చేయడంలో వాసన ప్రాముఖ్యతను ఈ పరిశోధన తెలియజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. Link






