పెద్ద పెద్ద టెక్ట్స్ మెసేజ్‌లు పెట్టేవారిని తక్కువ అంచనా వేయకండి..! ఎందుకంటే..

by Javid Pasha |   (  Updated:2025-07-09 13:34:00  IST  )

పెద్ద పెద్ద టెక్ట్స్ మెసేజ్‌లు పెట్టేవారిని తక్కువ అంచనా వేయకండి..! ఎందుకంటే..

పెద్ద పెద్ద టెక్ట్స్ మెసేజ్‌లు పెట్టేవారిని తక్కువ అంచనా వేయకండి..! ఎందుకంటే..
X

దిశ, ఫీచర్స్ : మీ స్నేహితులు, పరిచయస్తులు, ప్రియమైన వ్యక్తులు తరచుగా మెసేజ్ చేస్తుంటే బోర్‌గా ఫీలవుతున్నారా? అందులోనూ లాంగ్ టెక్ట్స్ మెసేజ్ చేస్తుంటే వీరికేం పనిలేదు అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడ్డట్లే. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద సందేశాలు పంపేవారు నిజానికి తెలివైన వారని, హై ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని, ఇతరులపట్ల ఎక్కువ సానుభూతి కలిగి ఉంటారని జర్నల్ ఆఫ్ కమ్యూనికేషన్‌లో పబ్లిషైన తాజా అధ్యయనం పేర్కొన్నది.

వాట్సాప్, వివిధ మెసేజింగ్ యాప్స్.. వేదికలేవైనా వాటిలో లాంగ్ టెక్ట్స్ పంపేవారిని నిపుణులు ‘Textroverts’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇతరులతో పోలిస్తే వీరు డిజిటల్ కన్వర్జేషన్‌లో డిటేయిల్డ్ కమ్యూనికేషన్‌ను ఇష్టపడతారు. నిజమైన భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి ఆయా వేదికలను, అందులోని ఎమోజీలను సైతం ఉపయోగిస్తారు. సరైన క్లారిటీ ఇచ్చేందుకు, విషయాలపట్ల అవగాహన పెంచేందుకు కూడా వీరు తమ సందేశాలను నిడివి పెంచే ధోరణిని అవలంబిస్తారని, ఇది సదరు వ్యక్తుల ఉన్నత భావోద్వేగ అవగాహనను ప్రతిబింబిస్తుందని అధ్యయనం పేర్కొన్నది. Link

Next Story