- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవసరానికో అబద్దం.. ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ కంటే.. చాటింగ్‌లోనే ఎక్కువ!
ముఖా ముఖి ఇంటరాక్షన్‌తో పోలిస్తే చాటింగ్ సందర్భంగా అబద్ధాల చెప్పే అవకాశం ఎక్కువని ఒక అధ్యయనం పేర్కొన్నది

దిశ, ఫీచర్స్ : అబద్దం చెప్పినా అతికినట్టు ఉండాలంటారు కొందరు. కానీ అందరికీ అలా చెప్పడం రాదని కూడా అంటుంటారు పెద్దలు, నిపుణులు. ఒకవేళ చెప్పినా.. వారి బిహేవియర్‌ను బట్టి, నోటి నుంచి మాటలు వెలువడే శబ్దాన్ని బట్టి తెలివైనవారు వెంటనే పసిగడతారు. అందుకే చాలా మంది ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్స్‌లో అబద్ధాలు చెప్పడానికి వెనుకాడుతారు. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడో, తప్పనప్పుడో అబద్దం ఆడితే తప్పేంటి? అనుకున్నవారు సైతం ఇక్కడ ఆ ధైర్యం చేయరు. కానీ అదే టెక్ట్సింగ్ లేదా చాటింగ్ విషయానికి వస్తే మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఇక్కడ అవసరాన్ని బట్టి అబద్దాలు చెప్పేవారి సంఖ్య కాస్త ఎక్కువేనని అధ్యయనాలు చెబుతున్నాయి.
ముఖా ముఖి ఇంటరాక్షన్‌తో పోలిస్తే.. ఏమాత్రం భయం లేకుండా అబద్దాన్ని సైతం అందంగా, అట్రాక్ట్‌గా, అతికినట్టుగా చెప్పడం చాటింగ్‌లో చాలా ఈజీ అని చాలామంది భావిస్తారు. పైగా అవతలి వ్యక్తి కూడా ప్రత్యక్షంగా మన హావభావాలు గమనించే చాన్స్ లేదు. అందుకే ఇక్కడ అవసరాన్ని అబద్దాల కన్వర్జేషన్‌కు అవకాశం ఎక్కువని కార్నెల్ యూనివర్సిటీ నిపుణుల అధ్యయనం పేర్కొంటున్నది. ఆధునిక కాలంలో ప్రజలు ఏయే సందర్భాల్లో ఎక్కువ అబద్ధాలు చెబుతారో తెలుసుకునే ఉద్దేశంతో జెఫ్ హాన్‌కాక్ నేతృత్వంలోని నిపుణుల బృందం 660 మంది విద్యార్థులతో సహా, పలువురు పెద్దలను కూడా ప్రశ్నించింది.
వారం రోజులపాటు 660 కమ్యూనికేషన్‌లను ట్రాక్ చేసింది. ఈ సందర్భంగా తెలిసిందేమిటంటే.. టెక్స్ట్ సందేశాలు లేదా చాటింగ్ సంభాషణల్లో, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్స్ కంటే కూడా 10 రెట్లు ఎక్కువగా అబద్ధాలు ఆడుతున్నట్లు తేలింది. అయితే ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు ఇవి 5% కంటే తగ్గినట్లు కూడా నిపుణులు గుర్తించారు. మొత్తానికి టెక్ట్సింగ్ మెసేజ్‌లు, చాటింగ్‌లు.. ఇలా డిజిటల్ ఇంటరాక్షన్స్ ఏవైనా సరే.. ప్రత్యక్ష సంభాషణలతో పోలిస్తే అబద్దాలు చెప్పే అవకాశం కాస్త ఎక్కువని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






