సోషల్ మీడియాను వదలట్లేదుగా.. 22% టీనేజర్లు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదే..!

by Javid Pasha |

సోషల్ మీడియాను వదలట్లేదుగా.. 22% టీనేజర్లు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదే..!
X

దిశ, ఫీచర్స్ : స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చాక, దానిని వాడుతున్న ప్రతీ ఒక్కరు ఏదో ఒక సోషల్ మీడియా వేదికలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎంటర్టైన్మెంట్ కోసం కొందరు, సమాచారం కోసం మరి కొందరు, కమ్యూనికేషన్ పర్పస్ కోసమో, వ్యాపార ప్రయోజనాలకోసమో ఇంకొందరు సోషల్ మీడియాను యూజ్ చేసుకుంటున్నారు. అయితే ఇటీవల దీని అధిక వాడకం, దుర్వినియోగం యువతలో డిప్రెషన్, యాంగ్జైటీ వంటి సమస్యలకు దారితీస్తున్నదని శాన్ డియాగో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం పేర్కొన్నది. ఆ వివరాలేమిటో చూద్దాం.

*అధ్యయనంలో భాగంగా రీసెర్చర్స్ 10 లక్షల మంది టీనేజర్ల డేటాను విశ్లేషించగా, వారిలో స్క్రీన్ టైమ్ పెరిగినట్టు గుర్తించారు. వివిధ సోషల్ మీడియా యాప్‌లలో స్క్రోలింగ్ సమయం పెరగడం కారణంగా తాము వాస్తవ జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించడం లేదని టీనేజర్లలో 22% మంది పేర్కొన్నట్లు కూడా వెల్లడించారు. 2012 తర్వాత స్మార్ట్‌ఫోన్‌ల వాడకం పెరిగాక ఈ పరిస్థితి క్రమంగా పెరుగుతోందని అంటున్నారు.

*అదే విధంగా సమయం- సందర్భం, పర్పస్ లేని స్క్రీన్ సమయం యువతలో ఏకాగ్రతను కోల్పోవడం, ఇతర అంశాలపై ఫోకస్ చేయకపోవడం వంటి సమస్యలకు దారితీస్తున్నదని, అంతేకాకుండా డిప్రెషన్, యాంగ్జైటీ వంటి సమస్యలను 13 నుండి 66 శాతం వరకు పెంచుతున్నదని అధ్యయనాన్ని విశ్లేషించిన నిపుణులు అంటున్నారు. ప్రధానంగా టీనేజర్లలో పర్సనల్ ఇంటరాక్షన్‌లు తగ్గి, ఆన్‌లైన్ కనెక్షన్‌లు పెరిగాయి. దీంతో జీవితంలోని అనేక సందర్భాల్లో వాస్తవాలను ఆస్వాదించలేకపోతున్నారు. ముఖ్యంగా 11-13 ఏండ్ల బాలికల్లో, 14-15 ఏండ్ల బాలురుల్లో సోషల్ మీడియా స్క్రోలింగ్ పెరగడం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నదని, దానిని తగ్గించడం వల్ల మెరుగవుతన్నదని పరిశోధకులు గుర్తించారు.

ఎందుకలా జరుగుతుంది?

*టీనేజర్లలో 22% మంది రోజుకు 7 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడుపుతున్నారు. అయితే ఈ అల్గారిథమ్‌లు డోపమైన్ రివార్డ్ లూప్‌లను సృష్టించి, యువతను నిరంతర ఆకర్షణ, ఆశాభావంలో ఉంచుతాయి. ఫలితంగా వ్యక్తిగత సంబంధాలు తగ్గుతున్నాయి. అంటే ఆన్‌లైన్ కనెక్షన్‌లు నిజమైన సంబంధాల స్థానాన్ని ఆక్రమించడం కారణంగా లోన్లీనెస్, స్ట్రెస్, యాంగ్జైటీస్ వంటివి పెరుగుతున్నాయి. అధిక స్క్రీన్ సమయం నిద్రలేమి, దృష్టి సమస్యలు, మానసిక అలసటను పెంచుతున్నది. రోజువారీ కార్యకలాపాలలో ఆసక్తిని తగ్గిస్తున్నది. జీవితంలో సంతృప్తిని దెబ్బతీస్తున్నది. అందుకే సోషల్ మీడియాను పరిమితికి మించి గానీ, పర్పస్ లేకుండా గానీ వాడకపోవడం మంచిదని, మంచి కోసం వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. Link

Next Story