చాట్‌జీపీటీ అధికంగా వాడితే జ్ఞాపక శక్తి తగ్గుతుంది..! అధ్యయనంలో వెల్లడి

by Javid Pasha |   (  Updated:2025-09-26 06:21:12  IST  )

చాట్‌జీపీటీ అధికవాడకం జ్ఞాపక శక్తి తగ్గుదలకు కూడా దారితీస్తున్నదని, మెదడులోని న్యూరల్ కనెక్టివిటీపై ప్రతికూల ప్రభావం చూపడమే ఇందుకు కారణమని పరిశోధకులు పేర్కొన్నారు.

చాట్‌జీపీటీ అధికంగా వాడితే జ్ఞాపక శక్తి తగ్గుతుంది..! అధ్యయనంలో వెల్లడి
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అనేకమంది యూజ్ చేస్తున్న ఏఐ(AI) టూల్స్‌లలో చాట్‌జీపీటీ ఒకటి. ఎటువంటి సమాచారమైనా సులభంగా పొందే అవకాశం ఉన్నందున విద్యార్థులు, ఉద్యోగులు దీనిని ఎక్కువగా వాడుతున్నారు. అయితే దీని అధిక వాడకం మెదడు సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చునని, ముఖ్యంగా జ్ఞాపక శక్తి తగ్గే చాన్స్ ఉందని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఆ వివరాలేమిటో చూద్దాం.

అధ్యయనంలో భాగంగా పరిశోధకులు సమాచారాన్ని ప్రాసెస్ చేయడంలో, గుర్తుంచుకోవడంలో చాట్‌జీపీటీ(ChatGPT) వంటి ఏఐ సాధానాల వాడకం ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిశీలించారు. అందుకోసం 54 మంది వినియోగదారుల మెదడు(EEG) స్కాన్‌లను సైతం పరిశీలించారు. అయితే చాట్‌జీపీటీ వంటి ఏఐ సెర్చ్ ఇంజిన్లను ఉపయోగించినవారు, ఎటువంటి ఏఐ సాధనాలను ఉపయోగించనివారితో పోలిస్తే తక్కువ మెదడు సామర్థ్యాన్ని ప్రదర్శించారని, విషయాలను గుర్తుంచుకోవడంలో వీరు ఇబ్బంది పడుతున్నారని గుర్తించారు. చాట్‌జీపీటీ అధికవాడకం జ్ఞాపక శక్తి తగ్గుదలకు కూడా దారితీస్తున్నదని, మెదడులోని న్యూరల్ కనెక్టివిటీపై ప్రతికూల ప్రభావం చూపడమే ఇందుకు కారణమని పరిశోధకులు పేర్కొన్నారు. Link

Next Story