ఇతర జాతులతో పోలిస్తే పిల్లులకు ఆ విషయంలో 100 రెట్లు అధిక సామర్థ్యం.. సీక్రెట్ కనిపెట్టేసిన శాస్త్రవేత్తలు

by Disha Web Desk 7 |
ఇతర జాతులతో పోలిస్తే పిల్లులకు ఆ విషయంలో 100 రెట్లు అధిక సామర్థ్యం.. సీక్రెట్ కనిపెట్టేసిన శాస్త్రవేత్తలు
X

దిశ, ఫీచర్స్ : పిల్లులు అసాధారణమైన ఘ్రాణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అయితే ఈ స్నిఫింగ్ ఎబిలిటీస్‌కు సంక్లిష్టమైన నాజల్ ఎయిర్ వే నిర్మాణమే కారణమని సంచలనాత్మక అధ్యయనం ఆవిష్కరించింది. పిల్లి ముక్కుకు సంబంధించిన వివరణాత్మక 3D కంప్యూటర్ మోడల్‌ను రూపొందించిన శాస్త్రవేత్తలు.. వివిధ ఆహార వాసనలు కలిగిన గాలి ప్రవాహాన్ని దానిగుండా పంపించారు. పిల్లి నాసికా భాగాలలోని గాలి రెండు విభిన్న ప్రవాహాలుగా విడిపోతుందని గుర్తించిన సైంటిస్టులు.. ఒక ప్రవాహం క్లెన్సింగ్, హ్యుమిడిటీకి లోనవుతుందని.. మరొకటి ఘ్రాణ ప్రాంతానికి వాసనను సమర్ధవంతంగా అందిస్తుందని వివరించారు.

పిల్లి ముక్కు హైలీ ఎఫెక్టివ్ డ్యూయల్-పర్పస్డ్ ‘గ్యాస్ క్రోమాటోగ్రాఫ్‌’గా పనిచేస్తుందని తెలిపారు శాస్త్రవేత్తలు. ఇది రసాయనాలను ఆవిరి రూపంలో గుర్తించడానికి, వేరు చేయడానికి ఉపయోగించే పరికరం. కాగా పిల్లి నాసికా నిర్మాణం ఈ విషయంలో చాలా నైపుణ్యం కలిగి ఉంది. ఇది ఇప్పటికే ఉన్న గ్యాస్ క్రోమాటోగ్రాఫ్‌లకు మెరుగుదలను ప్రేరేపిస్తుంది. వాసనతో నిండిన గాలి ఘ్రాణ ప్రాంతానికి చేరుకున్న తర్వాత.. చాలా కాలం పాటు సమాంతర మార్గాల ద్వారా తిరిగి ప్రసారం చేయబడుతుంది. ఈ రీసర్క్యులేషన్ మరింత క్షుణ్ణంగా వాసనను ప్రాసెస్ చేయడానికి అనుమతిస్తుంది. ఒకే పరిమాణంలో ముక్కులు ఉన్న జాతులతో పోలిస్తే పిల్లి ముక్కు వాసనను గుర్తించడంలో 100 రెట్లు ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ అధ్యయనం క్షీరదాలు, ఇతర జాతుల మధ్య గ్యాస్ క్రోమాటోగ్రఫీ సామర్థ్యం యొక్క మొదటి పరిమాణాత్మక పోలికను అందిస్తుంది.

Read More: కృత్రిమ ఆకులను తయారుచేసిన శాస్త్రవేత్తలు.. సూర్యకాంతిని శక్తిగా మార్చడంలో కీలకం

Next Story

Most Viewed