- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Study Reveals : సింగిల్స్‌తో పోలిస్తే.. మ్యారీడ్ పీపుల్ అధిక బరువు పెరిగే చాన్స్ ఎక్కువట.. కారణం ఇదే!
Study Reveals : సింగిల్స్‌తో పోలిస్తే.. మ్యారీడ్ పీపుల్ అధిక బరువు పెరిగే చాన్స్ ఎక్కువట.. కారణం ఇదే!

దిశ, ఫీచర్స్ : పెళ్లయ్యాక పొట్ట పెరగడం, లావెక్కడం వంటివి సాధారణంగా జరిగే విషయాలేనని పెద్దలు అంటుంటారు. అయితే అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడంపై ఫోకస్ చేసిన ఓ అధ్యయనం కూడా అదే చెబుతోంది. సింగిల్స్‌తో పోలిస్తే వివాహం రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు అధిక బరువు పెరుగుతారని తెలిపింది. బ్యాచిలర్ లైఫ్‌కి, మ్యారీడ్ లైఫ్‌కి గల తేడాలు, ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులే ఇందుకు కారణమని పేర్కొన్నది. ఇంకా ఏయే కారణాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
*కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో కంఫర్ట్ వల్ల : ఇండివిడ్యువల్స్‌తో పోలిస్తే మ్యారీడ్ పీపుల్ తమ జీవితంలో ఎక్కువ సౌకర్యంగా, సంతోషంగా ఫీలవుతారు. అంతేకాకుండా స్థిరమైన సంబంధం కారణంగా వీరిలో భావోద్వేగ భద్రత(Emotional security) పెరుగుతుంది. కానీ శారీరక ఆకర్షణ(attractiveness)ను కాపాడుకోవాలనే మోటివేషన్ తగ్గుతుంది. అట్లనే జంటలు ఆరోగ్యకరమైన లేదా కఠినమైన ఆహార నియామాలు, వ్యాయామాలకంటే సౌకర్యానికే ప్రయారిటీ ఇవ్వడంవల్ల అధిక బరువు పెరుగుతారు.
*కామన్ ఈటింగ్ హాబిట్స్(Common eating habits) : సింగిల్స్ తిండి విషయంలో కచ్చితమైన సమయం, నియమం పాటించకపోవచ్చు. కానీ జంటలు అలా కాదు. తరచుగా కలిసి భోజనం చేస్తారు. ఉమ్మడి ఆహార అలవాట్ల కారణంగా ఎక్కువ తినడం, తినే ఆహారంలో కేలరీల స్థాయి పెరగడం సహజంగానే జరిగిపోతుంది. అట్లనే రొమాంటిక్ డిన్నర్లు, వేడుకలు లేదా టేక్ అవుట్‌నైట్స్ వంటివి అధిక కేలరీలు తీసుకోవడాన్ని పెంచుతాయి. ఫలితంగా బరువు పెరిగేందుకు దారితీస్తుంది.
*పరస్పర ప్రభావం(Mutual influence) : ఆహారపు అలవాట్లు, హ్యాపీనెస్ మూవ్‌మెంట్లు వంటి విషయాల్లో, జీవన శైలి ఎంపికల్లో జంటలు ఒకరినొకరు ప్రభావితం చేస్తారు. ఒకరు నిశ్చల జీవనశైలి లేదా జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినే అలవాటును అవలంబిస్తే.. మరొకరు కూడా అదే అనుసరించవచ్చు. ఇది ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గడానికి, అధిక బరువు పెరగడానికి దారితీస్తుంది.
*టైమ్ అండ్ ఎనర్జీ లిమిటేషన్స్ : పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలు పెరగడం, ఉద్యోగం, ఫ్యామిలీ రిలేటెడ్ అంశాలపై ఎక్కువ సమయం కేటాయించడం చేస్తారు. దీంతో వ్యాయామాలకు, ఆహార నియమాలకు ప్రయారిటీ తగ్గిస్తారు. ఫలితంగా బరువు పెరగుతారు. అందుకే అవివాహితులతో పోలిస్తే, వివాహిత వ్యక్తులు ఒక దశాబ్దంలో సగటున 4 నుంచి 6 పౌండ్లు, అంటే.. 1.81 నుంచి 2.72 కిలోగ్రాములు అధిక బరువు పెరుగుతున్నట్లు ‘Journal of Obesity’ స్టడీ పేర్కొన్నది. కాబట్టి జంటలు కూడా అధిక బరువు పెరగకుండా ఉండే జీవనశైలి అనుసరించాలని, అవసరమైన మార్పులను, ఆహార నియమాలను పాటించాలని, వ్యాయామాలకు ప్రయారిటీ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.






